ఐడియా మరో బంపర్ ఆఫర్... | Idea again slashes rates by up to 67 per cent | Sakshi
Sakshi News home page

ఐడియా మరో బంపర్ ఆఫర్...

Published Mon, Jul 18 2016 6:04 PM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM

ఐడియా మరో బంపర్ ఆఫర్... - Sakshi

ఐడియా మరో బంపర్ ఆఫర్...

న్యూఢిల్లీః ఐడియా నెట్వర్క్ వినియోగదారులకు వారంలోనే వరుసగా రెండోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న 4జి, 3జి మొబైట్ ఇంటర్నెట్ ప్యాక్ ధరలపై 67 శాతం తగ్గింపును ప్రకటించింది. తన పోటీదారులు భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ జియో తో పోల్చితే భారీగా తగ్గింపును ఐడియా ప్రకటించింది. రెండు రోజుల క్రితం 1జిబి కన్నా తక్కువ ప్యాక్స్ పై ధరలో 45 శాతం తగ్గింపు విధిస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ... తాజాగా అత్యధికంగా ఇంటర్నెట్ వాడే 2జిబి నుంచి 10 జిబి ప్యాక్స్ కలిగిన వినియోగదారులకు 67 శాతం ధరలు తగ్గిస్తున్నట్లు ఐడియా ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రీపెయిడ్ 3జి, 4జి కస్టమర్లకోసం భారతి ఎయిర్ టెల్ 67 శాతం ధరలు తగ్గించడంతో.. ఐడియా ఒకే వారంలో రెండోసారి ధరల తగ్గింపును చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఐడియా  10 జిబి 4జి, 3జి ఇంటర్నెట్ ప్యాక్స్ ను కేవలం 990 రూయాయలకే అందిస్తోంది. అలాగే ఇంతకు ముందు 449 రూపాయలుండే 2జిబి డేటాను  349 రూపాయలకు అందిస్తోంది. ప్రస్తుత 67 శాతం భారీ తగ్గింపులతో ఐడియా కస్టమర్లు ఇంతకు ముందు 3జి డేటా ధరలకు దగ్గరగా  5జిబి 4జి, 3జి డేటా ప్యాక్ లకు  649 రూపాయలకే పొందే అవకాశం లభిస్తోంది. ఈ నూతన టారిఫ్ ను ప్రీ పెయిడ్ వినియోగదారులు 4జి, 3జి ప్రొవైడర్లద్వారా వెంటనే పొందవచ్చని ఐడియా వెల్లడించింది. రిలయన్స్ జియో అతి తక్కువ రేటుకు ఇంటర్నెట్ ప్యాక్స్ ను అందిస్తుండటంతో మిగిలిన అన్ని టెలికాం కంపెనీలు ధరలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement