అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారత వృద్ధిరేటు అంచనాలో మరోసారి కోత పెట్టింది. జూలైలో 7 శాతం అంచనా వేసిన సంస్థ 2020 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 90 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.1 శాతంగా ఉండనుందని తెలిపింది. దేశీయ డిమాండ్ ఊహించిన దానికంటే బలహీనమైన దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని ఐఎంఎఫ్ వ్యాఖ్యానించింది. జూలైలో 7.2 శాతంగా ఉన్న అంచనాను 20 బిపిఎస్ పాయింట్లు (7 శాతం) తగ్గించిన సంగతి తెలిసిందే.
ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం, ఆర్థిక ఉద్దీపన, వాణిజ్యయుద్ధం, డీగ్లోబలైజేషన్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే మాంద్యం ఏర్పడిందని ఐఎంఎఫ్ వెల్లడించింది. అయితే భారతదేశంలో ద్రవ్య విధాన సడలింపు, ఇటీవలి కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపులు వృద్ధికి తోడ్పడతాయని ఐఎంఎఫ్ పేర్కొంది. అలాగే గ్రామీణ వినియోగానికి తోడ్పడే ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వృద్ధికి తోడ్పడతాయని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment