వీసా ఫీజులో 80 శాతం కోత
భారత్ నుంచే వచ్చే భారీ పర్యాటక ఆదాయంపై కన్నేసిన మరో గల్ఫ్ దేశం బహ్రెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ ఆదాయాన్ని కొల్లగొట్టే వ్యూహంలో భాగంగా బహ్రెయిన్ సందర్శించాలనుకునే పర్యాటకుల వీసా ఫీజులో భారీ కోత విధించింది. 80 శాతం వీసా ఫీజును తగ్గించినట్టు బహ్రెయిన్ టూరిజం బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెరాడ్ బచ్చర్ ప్రకటించారు.
ప్రస్తుతం 25 దినార్లుగా ఉన్న ఈ ఫీజును కేవలం 5 దినార్లకు పరిమితం చేసింది. ఈ తాజా నిర్ణయం ప్రకారం ఇప్పటివరకూ రూ. 4,446 లుగా ఉండగా, ప్రస్తుతం అయిదు దినార్లు అంటే కేవలం 889 రూ. మాత్రమే. 25 దినార్లుగా ఉన్న ఈ ఫీజును కేవలం 5 దినార్లకు పరిమితం చేసింది. ఈ తాజా నిర్ణయం ప్రకారం ఇప్పటివరకూ రూ. 4,446 లుగా ఉన్న ఈ ఫీజు, ప్రస్తుతం అయిదు దినార్లు అంటే కేవలం రూ. 889 మాత్రమే.
అలాగే ఇండియానుంచి తక్కువ సమయంలోతమ దేశానికి చేరేలా చర్యలు చేపడుతున్నామని జెరాడ్ చెప్పారు. ముంబై ఢిల్లీ మధ్య ప్రయాణంకంటే తక్కువగా, సమానంగా ముంబై, బహ్రెయిన్ ప్రయాణం ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఒక వారంలో 75 విమాన సర్వీసులున్నాయని.. భారతదేశం మధ్య అద్భుతమైన వాయుమార్గ నిర్మాణ లక్ష్యంతో ఒక బిలియన్ డాలర్ల వ్యయంతో విమానాశ్రయ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టామని అది పూర్తయితే ప్రస్తుతం తొమ్మిది మిలియన్లుగా ఉన్న పర్యాటకుల సంఖ్య 14 మిలియన్లకు చేరుతుందని అంచనా వేశారు.
బిలియన్ల డాలర్ల ఆదాయంపై గురిపెట్టిన బహ్రెయిన్ భారతీయ పర్యాటకును ఆకర్షించేందుకు వీలుగా భారీ ప్రణాళికలే రచిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఇండియాలో మొట్టమొదటి బహ్రెయిన్ పర్యాటక కార్యాలయాన్ని కూడా త్వరలోనే ప్రారంభించనుంది. దీన్ని బట్టే దేశం నుంచి బహ్రెయిన్ ఆశిస్తున్న పర్యాటక రంగం డిమాండ్ ను మనం అంచనా వేయవచ్చు. 2015 ఆర్థిక సంవత్సరంలో 69కోట్లను వెచ్చించగా, అదే ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 4 వేల కోట్లు ఖర్చుపెట్టినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి.
కాగా గల్ఫ్ దేశం అనగానే విలాసవంతమైన అరబ్ షేకులు..ఆయిల్ నిక్షేపాలు.. ఉపాధికోసం పరుగులు పెట్టే కార్మికులు.. వేలమంది పర్యాటకులు మనకు గుర్తుకు వస్తారు. గల్ఫ్ దేశాలకు కువైట్, బహ్రయిన్, ఇరాక్, ఒమన్,ఖతర్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఇండియానుంచి వచ్చే పర్యాటక ఆదాయంకూడా భారీగానే ఉంది. దీంట్లో అగ్ర భాగం దుబాయ్ దే. ఆ తరువాత, ఓమన్, అబుదాభి నిలుస్తాయి.