న్యూడిల్లీ: కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపుదారులకు తీరని నిరాశను మిగిల్చింది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) , ఇతర చిన్న పొదుపు ఖాతాలపై వడ్డీరేటులో కోత పెట్టింది. పీపీఎఫ్ సహా, చిన్న పొదుపు ఖాతాలపై 0.1 శాతం వడ్డీ రేటును తగ్గిస్తూ ప్రభుత‍్వం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం వీటిపై ప్రస్తుత వడ్డీరేటు 8 శాతం, రేపటినుంచి 7.9శాతంగా ఉండనుంది. పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి స్కీం, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాదారులపై దీని ప్రభావం పడనుంది.
ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా, ఏప్రిల్ 1, 2017 నుంచి ప్రారంభమయ్యే 2016-17 నాలుగో త్రైమాసికంలో ఈ వడ్డీ రేట్ల తగ్గించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆ దేశాలు అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేసింది. దీంతో చిన్నమొత్తాల్లో పొదుపు చేసుకునే ఖాతాదారుల నడ్డి విరిచింది. వారి ఆశలపై నీళ్లు చల్లింది.
మరోవైపు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశీయబ్యాంకులు కూ పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లలో కోత పెట్టే అవకశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రుణాల జారీ వృద్ధి మందగించడంతో బ్యాంకులు తమ నిర్వహణ లాభాలను పెంచుకునేందుకు సేవింగ్స్ ఖాతాలనిల్వలపై వడ్డీ రేట్ల కోత తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.