సస్పెన్స్‌తో థ్రిల్‌ | A thrill of thrilling audience with 'Thrill' suspense. | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌తో థ్రిల్‌

Published Mon, Jun 19 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM

సస్పెన్స్‌తో థ్రిల్‌

సస్పెన్స్‌తో థ్రిల్‌

సంజీవ్‌కుమార్‌ హీరోగా నటిస్తూ, నిర్మించిన సస్పెన్స్‌ ప్రేమకథా చిత్రం ‘థ్రిల్‌’. ఫాదర్‌ అండ్‌ మదర్‌ సమర్పణలో సురేశ్‌ సబ్నే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. పవిత్ర, సోనాలి కథానాయికలు. సంజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్‌తో ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే చిత్రమిది. కథ బాగా నచ్చడంతో హీరోగా నటించి, నిర్మించా.

‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘క్షణం’, హిందీలో ‘రాజ్‌’, ‘1920’ చిత్రాల తరహాలో ‘థ్రిల్‌’ కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. జూలై నెలాఖరులో సినిమా రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ‘‘నేను చెప్పిన కథ సంజీవ్‌కి బాగా నచ్చడంతో తొలిసారిగా హీరోగా నటించి, నిర్మించారు. అనుభవం ఉన్నవాడిలా నటించాడు’’ అన్నారు సురేశ్‌ సబ్నే. సుమన్‌ శెట్టి, రేలంగి, వెంకట్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్‌ నాయుడు, సంగీతం: మురళి లియోన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement