
కాసేపట్లో వైఎస్ జగన్ దీక్షపై కార్యాచరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 నుంచి గుంటూరులో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక దీక్ష విషయంపై కాసేపట్లో కార్యాచరణ వెలువడనుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వైఎస్ఆర్ సీపీ నాయకులు సమావేశమై చర్చించనున్నారు.
వైఎస్ జగన్ దీక్షకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ఆర్ సీపీ దాఖలు చేసిన హౌస్మోషన్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ విషయంపై రెగ్యులర్ కోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. కాగా వైఎస్ జగన్ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్ఆర్ సీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీక్షకు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వాని ఆదేశించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరింది. అయితే రెగ్యులర్ కోర్టుకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.