ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు | defected ysrcp mlas get highcourt notices | Sakshi
Sakshi News home page

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు

Published Tue, Nov 15 2016 1:06 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు - Sakshi

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు

- అసెంబ్లీ కార్యదర్శికి కూడా..
- పిటిషన్ల విచారణార్హతపై వాదనలు వినిపించాలన్న హైకోర్టు
- స్పష్టం చేసిన ధర్మాసనం.. డిసెంబర్ 12కు వారుుదా
 
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది, ఆ తరువాత అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలకు ఉమ్మడి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు అసెంబ్లీ కార్యదర్శికి కూడా నోటీసులు జారీ చేసింది. ఫిరారుుంపుదారులపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణార్హతపై వాదనలు వినిపించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 12కు వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన బుడ్డా రాజశేఖరరెడ్డి, చిదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, అత్తారు చాంద్‌బాషా, గొట్టిపాటి రవికుమార్, జలీల్‌ఖాన్, కిడారి సర్వేశ్వరరావు, కలమట వెంకటరమణ, ఎం.మణిగాంధీ, పాలపర్తి డేవిడ్‌రాజు, తిరువీధి జయరాములు, భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, జ్యోతుల నెహ్రు, రావు వెంకట సుజయ కృష్ణ రంగారావు, పాశం సునీల్‌కుమార్, వరపుల సుబ్బారావు, ఎస్.వి.మోహన్‌రెడ్డి, పోతుల రామారావు, అమర్‌నాథ్‌రెడ్డి, ఎం.అశోక్‌రెడ్డిలు ఆ తరువాత తెలుగుదేశం పార్టీలోకి ఫిరారుుంచారు. వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ తామిచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు హైకోర్టులో వేర్వేరుగా నాలుగు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది.

 నిర్ణయం వెలువరించకుంటే ఏమిటన్నదే ప్రధాన ప్రశ్న...
 ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పదవ షెడ్యూల్ కింద స్పీకర్ వెలువరించే నిర్ణయాలు న్యాయసమీక్షకు లోబడి ఉంటాయన్న విషయంలో ఎటువంటి సందేహం లేదని, అరుుతే స్పీకర్ నిర్ణయం వెలువరించని నేపథ్యంలో ఏమిటన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్నని తెలిపింది. ఈ సమయంలో అసెంబ్లీ కార్యదర్శి తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలకు అసలు విచారణార్హతే లేదన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ముందు దాఖలయ్యే వ్యాజ్యాలకు విచారణార్హత లేదని ఇదే హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిందన్నారు. 10వ షెడ్యూల్ కింద స్పీకర్ నిర్ణయం వెలువరిస్తే దానిపై న్యాయసమీక్ష చేయవచ్చునని, నిర్ణయం వెలువరించడానికి ముందు న్యాయసమీక్ష తగదని ఏజీ చెప్పారు.

 వారికి నోటీసులు అవసరమే..
 ఈ విషయాన్ని కూడా తాము తేలుస్తామని, అందులో భాగంగా స్పీకర్‌కు తప్ప మిగిలిన వారికి నోటీసులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. నోటీసులు కూడా అవసరం లేదని, అసెంబ్లీ కార్యదర్శి తరఫున తాను వాదనలు వినిపిస్తున్నానని ఏజీ వివరించారు. అరుుతే ధర్మాసనం అందుకు అంగీకరించలేదు. అసెంబ్లీ కార్యదర్శితో పాటు ప్రతివాదులుగా 20 మంది ఎమ్మెల్యేలకూ నోటీసులు వెళ్లాల్సిందేనని, ఈ వ్యాజ్యాలు ఏ విధంగా విచారణార్హత కావో వారు సైతం వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. వారి వాదనలు వినకుండా ముందుకెళితే రేపు వారు అభ్యంతరం తెలిపే అవకాశం ఉందని, అందువల్ల వారి వాదనలు వినడం సబబని తెలిపింది. విచారణార్హత అంశం తేలిన తరువాత అనర్హత అంశంలోకి వెళతామని తేల్చి చెప్పింది. అసెంబ్లీ కార్యదర్శితో సహా పార్టీ ఫిరారుుంచిన 20 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 12కు వారుుదా వేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement