‘చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతాం’ | Lawyers Protest  at nampally court | Sakshi
Sakshi News home page

నాంపల్లి కోర్టు వద్ద బాబు దిష్టిబొమ్మ దగ్ధం

Published Tue, Apr 24 2018 4:38 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

Lawyers Protest  at nampally court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో సీఎం చంద్రబాబు వైఖరి పట్ల న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలను అణగదొక్కేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ఆ వర్గానికి చెందిన న్యాయవాదులు మంగళవారం నాంపల్లి కోర్టు వద్ద ఆందోళన చేశారు. బీసీ వ్యతిరేకి చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. బీసీల ఓట్లు కావాలిగానీ, బీసీలు జడ్జీలు కాకూడదా? అంటూ న్యాయవాదులు ప్రశ్నించారు. కోర్టు వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీసీలను అవమానించిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పానలి ఈ సందర్బంగా డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement