
వినతి పత్రం అందజేయటానికి వచ్చిన న్యాయవాదులు
పిఠాపురం : న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలువురు న్యాయవాదులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. కాకినాడలో సాగిన పాదయాత్రలో జగన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బచ్చు రాజేష్, మాజీ కార్యదర్శి గెద్డాడ వెంకటేశ్వరరావు, అధిత్య కుమార్ తదితరులు మాట్లాడుతూ డెత్ బెనిఫిట్స్ రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. జూనియర్ లాయర్‌లకు కొత్తగా బాధ్యతలు చేపట్టిన కాలంలో నెలకు రూ.5 వేలు ఇవ్వాలని హెల్త్ కార్డులు మంజూరు చేయాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment