
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరంలోని పీపుల్స్ ప్లాజా నుంచి రాజ్‌భవన్ వరకు న్యాయవాదులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌తోపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రంలో అన్ని కోర్టుల్లో విధులు బహిష్కరించి.. లాయర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. న్యాయవాదుల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్‌లో రూ. ఐదువేల కోట్ల కేటాయించాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. పదివేల చొప్పున ఉపకార వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.