న్యాయవాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత న్యాయవాదుల కోసం వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టామని, త్వరలో పార్టీ ప్రకటించే పూర్తి స్థాయి మేనిఫెస్టోలో న్యాయవాదుల సంక్షేమం కోసం పలు పథకాలను పొందుపరుస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ప్రగతిభవన్‌లో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్లతోపాటు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కేటీఆర్‌ను కలిశారు