
సీఎం వైఎస్ జగన్‌కు వినతిపత్రం ఇస్తున్న బార్ అసోసియేషన్ ప్రతినిధులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అనంతరం హెలిప్యాడ్‌లో ఆయనకు వినతిపత్రం ఇచ్చారు.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును ఏర్పాటు చేయాలని, అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలించేవరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కృష్ణరంగడు, పుల్లారెడ్డి, జయరాజ్, ఓంకార్, రవిగువేరా, నరసింహ, లక్ష్మీనారాయణ ఉన్నారు.