సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్‌ను పంజాబ్-హరియాణా కోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళన చేశారు. విధులను బహిష్కరించిన తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు నిరసన తెలిపారు. శనివారం వరుకు రాష్ట్ర్రవాప్తంగా ఉన్న అన్ని కోర్టులను న్యాయవాదులు బహిష్కరించాలని బార్ అసోసియేషన్ తీర్మానించింది. సంజయ్ కుమార్‌ను తక్షణమే తెలంగాణ కోర్టుకు బదిలీ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. మరొకవైపు హైకోర్టు బిల్డింగ్‌ను తరలించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని హైకోర్టు పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు బార్ కౌన్సిల్ గేట్ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment