
కర్నూలు జిల్లా: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మరోసారి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. వికేంద్రీకరణ అంశంతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశానికి సంబంధించి చంద్రబాబు వైఖరి ఏమిటో తెలపాలని న్యాయవాదులు శుక్రవారం ధర్మా చేపట్టారు. ఈ క్రమంలోనే కర్నూలులో చంద్రబాబు బస చేసే హోటల్ ముందు న్యాయవాదులు ధర్నాకు దిగారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నిరసన చేపట్టారు.
న్యాయ రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం న్యాయ రాజధానికి అంగీకరించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు.. ఇక్కడ అడుగుపెట్టే అధికారం లేదని న్యాయవాదుల సంఘం హెచ్చరించింది.
ఇక్కడ చదవండి: కర్నూలులో చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగ
Comments
Please login to add a commentAdd a comment