
సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలులో చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగ తగులుతోంది. ఎమ్మిగనూరు విశాఖ గార్డెన్ వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు యత్నించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్లకార్డులతో రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసన తెలిపింది. సీమాంధ్ర ద్రోహి చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
మరోవైపు.. న్యాయ రాజధానిపై చంద్రబాబు వైఖరి ప్రకటించాలని, లేదంటే చంద్రబాబు కర్నూలు పర్యటనను అడ్డుకుంటామని న్యాయవాదులు హెచ్చరించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయ రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ న్యాయవాదులు మండిపడ్డారు.
చదవండి: పేదల ఇళ్లపై ఇవీ నిజాలు.. బాబూ పవనూ అర్థమవుతుందా?
Comments
Please login to add a commentAdd a comment