పింఛన్ల పంపిణీకి దూరం చేసిన వైనం
మండిపడుతున్న పింఛన్ లబ్ధిదారులు
కరోనా సమయంలో సేవలు గుర్తు చేసుకుంటున్న ప్రజలు
ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరిక
మంచానికే పరిమితమైన ఈ వృద్ధురాలి పేరు కురువ లింగమ్మ. పెద్దకడబూరు మండలం మేకడోణ గ్రామానికి చెందిన ఈమె కుమారుడి వద్ద ఉంటోంది. వ్యవసాయ పనులు చేసుకునే కుమారుడు.. పింఛన్ డబ్బులతో ఈమెకు వైద్యం చేయిస్తున్నాడు. ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తుండటంతో తమకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదని చెబుతున్నాడు. ప్రస్తుతం సచివాలయానికి వెళ్లాలంటే పనులు మానుకోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్ని రోజులు తిరగాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చంద్రబాబుకు ముసలోళ్ల ఉసురు తప్పదని కన్నీటి పర్యంతమయ్యాడు.
కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామ, వార్డు వలంటీర్లను దూరం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పక్కన పెట్టడం... సచివాలయాలకే వెళ్లి పింఛన్ పొందాల్సి రావడంతో అవ్వాతాతలు, దివ్యాంగులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. మళ్లీ టీడీపీ హయాంలో పరిస్థితులే ఉత్పన్నం అవుతుండాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 20 వేల మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. మొదటి నుంచి వారిపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ విషయం చిమ్ముతున్నారు. వీరిని పింఛన్ల పంపిణీకి దూరం చేయడంపై అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 43–44 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో సచివాలయాలకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ ఎలా తీసుకుంటారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎన్నికల ముందే పింఛన్‌దారులకు ఇన్ని కష్టాలు తెచ్చిపెడితే... పొరపాటున టీడీపీ ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏమిటి చాలా మంది ప్రశి్నస్తున్నారు.
కరోనా సమయంలో స్వచ్ఛంద సేవలు..
రెండేళ్ల పాటు కరోనా రక్కసి జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేసింది. లాక్‌డౌన్, కర్ఫ్యూతో కరోనా సమయంలో పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అంతటి తీవ్రమైన పరిస్థితుల్లో వలంటీర్లు స్వచ్ఛంద సేవలు అందించారు. కోవిడ్ టెస్ట్‌లు చేయించడం, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్‌లకు తరలించడం, నెగిటివ్ వచ్చిన వారిని ఇళ్లలోనే ఉంచడం చేశారు. కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని అందించారు. సరుకులు, రైస్, మాస్‌్కలు కూడా పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి అనుమానాస్పదులను గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలో ప్రధాన భూమిక పోషించారు. వలంటీర్ల నిస్వార్థ సేవ కార్యక్రమాలతో కరోనా నుంచి గట్టెక్కామనే అభిప్రాయం ఎవరూ కాదనలేని నిజం.
అవినీతికి తావులేకుండా పథకాల అమలు
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజల రక్తమాంసాలను పీల్చి వేశాయి. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, రాజకీయాలు, కులమతాలకు అతీతంగా వలంటీర్లు సంక్షేమ పథకాలు అమలు చేశారు. పథకాల కోసం ప్రజలు సచివాలయాల చుట్టూ తిరుగలేదు. మండల స్థాయి కార్యాలయాలకు వెళ్లలేదు.. కానీ అర్హత కలిగిన వారందరికీ పథకాలు అమలయ్యాయి. ఇందుకు వలంటీర్లే కారణం. వలంటీర్ వ్యవస్థతో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుండటం, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటం చంద్రబాబు, అతని అనుయాయులు తట్టుకోలేక ఎన్నికల సమయంలో వారి సేవలను ప్రజలకు దూరం చేశారు.
ఉసురు తగులుతుంది
‘మంచి చేయరు... మంచి చేసే వారిని సహించరు.. మీ హయాంలో అంతంతమాత్రం చెల్లించే పింఛన్ పొందడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాం.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛన్ కష్టాలను మరచిపోయాం. మళ్లీ మీ కారణంగా కష్టాలు చుట్టుముడుతున్నాయి’ అని పింఛన్‌దారులు వాపోతున్నారు. తమ ఉసురు తగులుతుందని వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న బాలిక పేరు గీత. మానసిక స్థితి సరిగా లేని దివ్యాంగురాలు. కౌతాళానికి చెందిన బాలికకు తండ్రి ఈరన్న సపర్యలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ ఈ బాలికకు వలంటీర్ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఈ డబ్బుతో ఈరన్న మందులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం పింఛన్ కోసం సచివాలయాల వద్దకు వెళ్లాలని చెప్పడంతో ఈరన్న ఆవేదన వ్యక్తం చేసున్నాడు. తన కుమార్తె నడవలేదని, ఎత్తుకుపోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్నికష్టాలు పడాలో అని ఆందోళన చెందుతున్నాడు.
–కౌతాళం
కుమార్తెను పట్టుకుని నడిపిస్తున్న ఈమె పేరు లక్ష్మి. కోసిగి కడపాళెం వీధిలో నివాసం ఉంటున్నారు. ఈమె కుమార్తె రామచంద్రమ్మకు కళ్లు కనిపించవు. మాటలు రావు, కూర్చోలేదు, నడవలేదు. ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటుంది. పట్టుకుని నడిపిస్తే అయిదు అడుగులు వేస్తోంది. అంతలో ఏడ్చేస్తుంది. నరాలు బలహీనంగా ఉండడంతో బయోమెట్రిక్ ద్వారా పింఛన్ తీసుకోవడానికి చేతి వేళ్లు పడవు. ఈ దివ్యాంగురాలికి ఆర్‌బీఎస్ ద్వారా ప్రతి నెలా వలంటీర్ ఇంటికి వెళ్లి రూ.3వేలు పింఛన్ అందజేస్తున్నారు. ఈ నెల పింఛన్ ఎలా తీసుకోవాలని తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేన్తున్నారు.
– కోసిగి
భయపడుతున్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన వలంటీరు వ్యవస్థను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎన్నికల సమయంలో మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వలంటీరుగా ఎప్పటిలాగే ప్రజలకు సేవలు అందిస్తాం.
– అనిల్, చెరుకులపాడు
స్వచ్ఛందంగా సేవలు అందించాం
ప్రభుత్వం మాకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచింది. మాకు కేటాయించిన కుటుంబాలకు స్వచ్ఛందంగా సేవలు అదించాం. ప్రభుత్వ పథకాలను అందించి అవసరమైన సేవలను చేశాం. ఎన్నికల సమయంలో మమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నారు. అందుకే మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం.
– ప్రేమ్‌కుమార్, చెరుకులపాడు
రాజీనామాతో బుద్ధి చెబుతాం
మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి మా రాజీనామాలతో బుద్ధి చెబుతాం. ఐదేళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచిన ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటాం. ప్రజలకు సేవలు అందించడంలో చాలా తృప్తిని పొందాం. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశంతో మనో ధైర్యం పెరిగింది.
– వీరయ్య ఆచారి, కొసనాపల్లి
బాధ కలిగించింది
నాలుగున్నరేళ్ల పాటు నిస్వార్థంగా సేవలు అందించాం. ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశాం. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను లబి్ధదారులకు అందించాం. మాపై టీడీపీ, జనసేన నేతలు ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉన్నారు. ఎన్నో అభాండాలు వేశారు. చివరికి సంక్షేమ పథకాల అమలుకు దూరం చేయడం బాధ కలిగించింది. వలంటీర్ల సేవలను గుర్తించకుండా బురద చల్లడం దారుణం.
– విజయ్ రాజ్‌కుమార్, లక్ష్మీనగర్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment