
సాక్షి, హైదరాబాద్: మంథనిలో జరిగిన న్యాయవాదుల హత్యోదంతంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ పెద్దల ఆదేశాల మేరకే హత్యలు జరిగాయని ఆరోపణలు చేశారు. వారిపై కుట్ర కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంథని న్యాయవాదుల హత్యలో స్థానిక టీఆర్ఎస్ నేతలు కేవలం పాత్రధారులేనని, హత్యకు ఉసిగిల్పింది మాత్రం కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్‌లను తీవ్ర ఆరోపణలు చేశారు.
మొన్న హాలియా సమావేశంలో కేసీఆర్, తమను ఎవరైనా ప్రశ్నిస్తే నషంలాగా నలిపివేస్తామని చెప్పినట్లు రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. బాల్క సుమన్ ఏకంగా హత్య చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తొక్కేస్తమని పెద్దలే చెపుతున్నారని ఉదాహరించారు. ఈ హత్యలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ బాధ్యులని చెప్పారు. ఈ అంశాన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ హత్యపై సీబీఐ దర్యాప్తు కోసం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సుమోటోగా చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment