వేలల్లో ఫీజుల వసూలుపై సుప్రీంకోర్టు విస్మయం
న్యూఢిల్లీ: న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టేందుకు లాయర్లుగా ఎన్‌రోల్‌చేసుంటున్న న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు(ఎస్‌బీసీ) భారీ స్థాయిలో ఫీజులు వసూలుచేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. నిబంధనల ప్రకారం ఎస్‌సీ–ఎస్‌టీ కేటగిరీ లా పట్టభద్రుల నుంచి రూ.125 ఫీజు, జనరల్ కేటగిరీ నుంచి రూ.750 మించి వసూలుచేయకూడదని ధర్మాసనం ఆదేశించింది.
ఎస్‌బీసీలు వసూలుచేస్తున్న విపరీతమైన ఫీజుల కారణంగా అణగారిన, ఆర్థికంగా వెనకబడిన వర్గాల పేద, మధ్యతరగతి లా పట్టభద్రులు న్యాయవృత్తిలోకి రాలేని పరిస్థితి నెలకొంటోందని, వారు ఈ వృత్తిలో భాగస్వాములయ్యే అవకాశాలు తగ్గిపోతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తంచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ తీర్పు వెలువరిచింది.
Comments
Please login to add a commentAdd a comment