సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదులు తొలి సారి తమ నిరసన గళాన్ని విప్పారు. హైకోర్టులో నెంబర్ టు స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌ను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు జూనియర్ జడ్జిగా బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుపై న్యాయవాదులు మండిపడుతున్నారు. త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిఫారసును వెనక్కి తీసుకోవాలని, ఆయనను ఏదైనా హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియంను డిమాండ్ చేస్తున్నారు. జస్టిస్ సంజయ్‌కుమార్ బదిలీ సిఫా రసు నేపథ్యంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం మంగళవారం అత్యవసరంగా ఏర్పా టు చేసిన సర్వసభ్య సమావేశానికి భారీస్థాయిలో న్యాయవాదులు పాల్గొన్నారు. కొలీజియం నిర్ణయానికి నిరసనగా మంగళవారం నుంచి శనివారం (3 నుంచి 7) వరకు కోర్టు విధులను బహిష్కరించాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానించింది. 4 నుంచి 7వ రకు విధులను బహిష్కరించాలని కింది కోర్టు ల న్యాయవాద సంఘాలను సైతం హైకోర్టు న్యాయవాదుల సంఘం కోరింది. ఇటు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కూడా జస్టిస్ సంజయ్‌కుమార్‌కు అండగా నిలవాలని నిర్ణ యించింది.
సుప్రీంకోర్టులో పిల్‌కు తీర్మానం..
సీనియర్ న్యాయవాదుల నేతృత్వంలోని సంఘం కార్యవర్గం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కొలీజియంలోని ఇతర న్యాయమూర్తులను కలవాలని కూడా తీర్మానించారు. ఇటు రాష్ట్రపతి, ప్రధాని, న్యాయశాఖ మంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా కలవాలని నిర్ణయించారు. న్యాయమూర్తుల నియామకాలు, ప్రధాన న్యాయమూర్తిగా పదో న్నతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిం చే విషయంలో మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం తీర్మానించింది. హైకోర్టులో ఉన్న న్యాయమూర్తుల ఖాళీలన్నింటినీ భర్తీ చేసే వరకు ఏ హైకోర్టు నుంచి కూడా న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయరాదని సుప్రీంకోర్టు కొలీజియంకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.
బదిలీ అన్యాయం: టి.సూర్యకరణ్‌రెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు
‘నెంబర్ టు స్థానంలోని న్యాయమూర్తిని అదే స్థానంలో మరో హైకోర్టుకు బదిలీ చేస్తే ఎవరికీ అభ్యంతరముండదు. 12వ స్థానంలో ఉండే లా బదిలీ చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఏఆరోపణలు లేని జస్టిస్ సంజయ్‌కుమార్‌ను ఇలా బదిలీ చేయడం సరికాదు. 3 రాష్ట్రాల సీజేలు జస్టిస్ సంజయ్‌కుమార్ కంటే జూనియర్లు. జస్టిస్ సంజయ్‌కుమార్‌కు సీజేగా పదో న్నతి ఇవ్వకపోవడం అన్యాయమైతే ఇప్పు డు జూనియర్‌గా బదిలీ చేయడం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమే..’
బదిలీ సిఫారసుపై న్యాయవాదుల భగ్గు
Published Wed, Sep 4 2019 3:23 AM | Last Updated on Wed, Sep 4 2019 5:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment