ఉద్యోగస్తులకి బదిలీలు సర్వ సామాన్యం. ఆరోపణలు వచ్చినా, మూడు సంవత్సరాలు గడిచినా ఆ ఉద్యోగిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతా నికి బదిలీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకన్నా న్యాయమూర్తుల బదిలీలు క్రమబద్ధంగా జరు గుతూ ఉంటాయి. ప్రతి సంవ త్సరం ఏప్రిల్, మే నెలల్లో ఈ బదిలీలు తప్పక జరుగు తాయి. కోవిడ్–19 వచ్చిన తరువాత ఈ బదిలీల విష యంలో ప్రభుత్వాలు వెనుకంజ వేశాయి. కేంద్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థలు ఈ వార్షిక బదిలీలని నిలిపివేశాయి. మనదేశంలోని చాలా హైకోర్టులు కూడా ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించాయి. అందులో ముఖ్యమైనవి తెలంగాణ, బాంబే, అలహా బాద్, మద్రాస్, మధ్యప్రదేశ్, కేరళ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి.
కరోనా తీవ్రత లేని రాష్ట్రాలు కూడా ఈ సంవత్సరం సాధారణ బదిలీలను నిలిపివేశాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం న్యాయమూర్తులను బదిలీలు చేసింది. ఆ హైకోర్టు ఇన్‌చార్జ్ న్యాయ మూర్తులను బదిలీలు చేసింది. ఆ హైకోర్టు ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ జనరల్ బి.రాజశేఖర్ ఈ మధ్య గుండెపోటుతో మరణించారు. పని ఒత్తిడి వల్ల మరణించినాడని, కోవిడ్ వల్ల మర ణించాడని వార్తలు విన్పిస్తున్నాయి. అందులో ఏది వాస్తవమో మనకు తెలియదు. కరోనా విజృంభిస్తున్నవేళ, కోర్టులే వర్చువల్ కోర్టులుగా పనిచేస్తున్న సందర్భంలో న్యాయమూర్తుల బదిలీలు అవసరమా అన్న ప్రశ్నని చాలామంది న్యాయమూర్తులు, న్యాయవాదులు, వెలి బుచ్చుతున్నారు.
కొన్ని మాసాలపాటు కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు వున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి. లాక్‌డౌన్‌వల్ల, కొత్త పద్ధతులకి, న్యాయ మూర్తులు, సిబ్బంది అలవాటు పడే పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త వాతావరణానికి న్యాయమూర్తులు, సిబ్బంది ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ఈ వాతావర ణంలో కోర్టులో కేసుల పరిష్కారం, కుటుంబ బాధ్యత, పిల్లల చదువు, ఆరోగ్యం లాంటి అంశాలతో న్యాయ మూర్తులు తల్లడిల్లుతున్నారు.
ఈ దశలో న్యాయమూర్తులకి బదిలీలు వాళ్లని తెలియని ఒత్తిడికి గురిచేస్తాయి. కరోనా కాలంలో కొత్త ప్రాంతానికి వెళ్లడం, అక్కడ సర్దుబాటు కావడం సులువైన విషయం కాదు. సామాను సర్దుకోవడం చాలా కష్టమైన పని. దానికి పనివాళ్ళ సహాయం కావాలి. ప్యాకర్స్, మూవర్స్ అవసరం ఏర్పడుతుంది. కూరగాయలనే కడు గుతున్న కాలంలో సామానుని ఒక ఊరి నుంచి మరో ఊరికి తరలించడం కష్టసాధ్యమైన పని. లగేజీకి, అంటు వ్యాధి సంక్రమించకుండా చూసుకోవడం చాలా కష్టమైన పని. పిల్లల చదువూ, ఆరోగ్యం, తల్లిదండ్రుల బాధ్యత మధ్య న్యాయమూర్తులు సతమతమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇంత ఒత్తిడిలో ఉన్న న్యాయమూర్తులు తన విధు లని ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్నని చాలామంది విజ్ఞులు లేవనెత్తుతున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా న్యాయ మూర్తులు నోరు విప్పరు. అలాంటి క్రమశిక్షణ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళ అసోసియేషన్స్ కూడా మాట్లాడటానికి జంకుతారు. మిగతా ఉద్యోగులు వేరు. న్యాయమూర్తులు వేరు. కిందికోర్టు న్యాయమూర్తులని అనవసర బదిలీల ద్వారా, అసౌకర్య బదిలీల ద్వారా బలిపశువులని చేస్తూ ఉంటారని సుప్రీంకోర్టు మింటూ మాలిక్ కేసులో (హైకోర్టు ఆఫ్ కలకత్తా వర్సెస్ మింటూ మాలిక్ మరియు ఇతరులు, స్పెషల్ లీవ్ పిటిషన్ (సివిల్) నెం. 24240/2019, తీర్పు తేదీ నవంబర్ 15, 2019) అభిప్రా యపడింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, బి.ఆర్. గవాయ్‌లు ఈ తీర్పుని వెలువరించారు.
న్యాయమూర్తులని బలిపశువులు చేసే విషయంలో సుప్రీంకోర్టు తన ఆందోళనని ఈ తీర్పులో వెలువ రించింది. ఈ కేసులో ఒక రైల్వే మేజిస్ట్రేట్‌ని నిర్బంధంగా పదవీ విరమణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులని ఆ న్యాయమూర్తి కలకత్తా హైకోర్టులో సవాలు చేశాడు. ఆ న్యాయమూర్తిని తిరిగి విధుల్లో చేర్చుకోవా లని హైకోర్టులోని డివిజన్ బెంచ్ హైకోర్టుని ఆదేశిం చింది. అతను చేసిన చర్యలో చెడు నడవడిక లేదని సదు ద్దేశంతో అతను ఆ చర్యను చేశాడని హైకోర్టు అభి ప్రాయపడింది.
ఆ మేజిస్ట్రేట్ ప్రయాణం చేసే రైలు తరచూ ఆల స్యంగా రావడానికి కారణం అనవసరంగా కొన్ని ప్రదే శాల్లో ఆపి, చట్ట వ్యతిరేకంగా కొన్ని వస్తువులని దింపడం. తన అధికార పరిధిలో చట్ట వ్యతిరేక పనులు జరగడం పట్ల ఆందోళన చెంది అతను ఆ రైల్వే ఉద్యోగుల మీద చర్య తీసుకుంటాడు. ఈ విషయం మీద హైకోర్టు విచా రణ జరిపి అతన్ని సస్పెండ్ చేసి, నిర్బంధంగా పదవీ విరమణకు ఆదేశాలు జారీ చేస్తుంది.
ఈ ఆదేశాలను అతను హైకోర్టులో సవాలు చేస్తే, అతన్ని తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని అదేవిధంగా లక్ష రూపాయలు అతనికి ఖర్చుల కింద ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ హైకోర్టునే ఆదేశించింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ఇలా అభిప్రాయపడింది. ఈ రోజుల్లో న్యాయమూర్తులని బలిచేసే ట్రెండ్ ఒకటి మొదలైంది. అనవసర బదిలీల ద్వారా మరో విధమైన చర్యల ద్వారా న్యాయమూర్తుల మీద చర్యలు తీసుకుంటున్నారు. న్యాయమూర్తులకి వ్యతిరేకంగా న్యాయవాదులు గానీ, ఇతరులు కానీ ధర్నాలు చేస్తే చాలు.. వారిని బది లీలు చేస్తున్నారు. అదేవిధంగా చర్యలు తీసుకుంటు న్నారు. న్యాయమూర్తుల తప్పు ఎంతవుందన్న ఆ విష యాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు.
సాధారణ బదిలీల విషయంలో మింటూ మాలిక్ కేసులో మాదిరిగా చెడు నడవడిక, ధర్నాల ప్రస్తావన వుండదు. అలాంటి కేసులు ఒకటి అరా ఉండవచ్చేమో తెలియదు. కానీ, ఇవి ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగే ప్రక్రియ. ఈ కోవిడ్–19 కాలంలో అన్ని హైకోర్టుల మాదిరిగా బదిలీలను నిలిపివేస్తే న్యాయమూర్తులు అసౌక ర్యానికి, వేదనకి గురికాకుండా ఉంటారు.
వ్యాసకర్త,
మంగారి రాజేందర్
Comments
Please login to add a commentAdd a comment