transfer orders
-
కుదరదట! విధుల్లో చచ్చినట్లు చేరాల్సిందేనట మమ్మీ!
కుదరదట! విధుల్లో చచ్చినట్లు చేరాల్సిందేనట మమ్మీ! -
ఏపీలో భారిగా ఐపీఎస్ ల బదిలీ
-
భార్యాభర్తలను విడదీయొద్దు
సాక్షి, హైదరాబాద్/ఖైరతాబాద్: జోనల్ విధానంలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317పై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటాయింపుల్లో గందరగోళం చోటు చేసుకుందని మండిపడుతున్నారు. కనీసం తమ గోడు విన్పించుకునేందుకూ అవకాశం ఇవ్వడం లేదని వాపోతున్నారు. సోమవారం సుదూర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ఉపాధ్యాయులు హైదరాబాద్‌లోని పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు తరలివచ్చారు. పరిస్థితిని గమనించిన అధికారులు భారీగా పోలీసులను దించారు. దీంతో మహిళలతోసహా టీచర్లను ప్రధాన ద్వారం వద్దే ఆపేశారు. కనీసం తమ విజ్ఞప్తులన్నా తీసుకోవాలంటూ మెయిన్ గేట్ దగ్గర గంటల తరబడి పడిగాపులు కాశారు. వాహనాల్లో లోనికి వెళ్తున్న అధికారులను ప్రాధేయపడేందుకు మహిళలు ప్రయత్నించారు. కానీ అక్కడున్న పోలీసులు వారిని వారించారు. కొంతమంది ఉపాధ్యా య సంఘాల నాయకుల అండతో ఆఫీసులోకెళ్లి అధికారులకు వినతిపత్రాలిచ్చారు. అక్కడే కొంతసేపు ధర్నా చేశారు. ‘మా చేతుల్లో ఏమీ లేదు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందే’ అని ఉన్నతాధికారులు చెప్పడంతో వెనుదిరిగారు. 13 జిల్లాల్లో 2,500 మంది... 317 జీవోతో జరిగిన బదిలీల్లో భార్య, భర్తకు వేరు వేరు జిల్లాలు వచ్చాయంటూ బాధితులు నిరసన వ్యక్తంచేశారు. 13 జిల్లాల్లో 2,500 మంది భార్యాభర్తలు 100 నుంచి 250 కి.మీ. దూరంలో పనిచేస్తూ మనోవేదనకు గురవుతున్నారని, ప్రభుత్వం స్పందించి కుటుంబాలను కలపాలని కోరారు. వారందరినీ ఒకే జిల్లాకు కేటాయించాలన్న కేసీఆర్ ఆదేశాలను 19 జిల్లాల్లోనే అమలుచేశారని, 13 జిల్లాల్లో అమలుచేయలేదని వాపోయారు. విద్యామంత్రి ఇంటి వద్ద ధర్నా ప్రభుత్వ కాలేజీల లెక్చరర్లు జీవో 317కు వ్యతిరేకంగా ఇంటర్ విద్య పరిరక్షణ జేఏసీ చైర్మన్ పి.మ ధుసూదన్రెడ్డి నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు ధర్నా చేశారు. జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తా నియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భార్య ఒక చోట... భర్త మరో చోట ఆయన హెచ్ఎం. మల్టీ జోన్ కిందకొస్తారు. నేను జిల్లా కేడర్. జిల్లా ఆప్షన్లు ఇచ్చేటప్పటికీ మల్టీ జోనల్ కేడర్ కేటాయింపులు కాలేదు. అలాంటప్పుడు కావల్సిన ఆప్షన్ ఎలా ఇవ్వాలి? ఇప్పుడు స్పౌజ్ కేసు అంటే పట్టించుకోవడం లేదు. వనపర్తిలో ఒకరు. నాగర్‌కర్నూల్‌లో ఒకరు.. ఇదేం న్యాయం? – సందె వినీల, వెంకటరమణ(నాగర్‌కర్నూల్) పేర్లు మాయమయ్యాయి జిల్లా నుంచి వచ్చిన జాబితాలో నేను పెట్టుకున్న ఆప్షన్‌కు అంగీకరించారు. కానీ రాష్ట్ర కార్యాలయానికి రాగానే జాబితా మారింది. కామారెడ్డిలో సుదూర ప్రాంతానికి బదిలీ చేశారు. మా దగ్గర 8 మందికి ఇలాగే జరిగింది. – ప్రభాకర్ రెడ్డి (టీచర్, జగిత్యాల) స్పౌజ్ లిస్ట్ తారుమారు స్పౌజ్ అప్పీళ్లను సరిగా పరిష్కరించలే దు. భార్యాభర్తలను చెరొక చోటుకు పంపా రు. జిల్లా కేటాయింపుల్లో ఇద్దరి పేర్లూ ఉన్నా యి. కానీ, రాష్ట్రస్థాయి జాబితాలో ఎగరగొట్టారు. ప్రభుత్వం బ్లాక్ చెయ్యని జిల్లాల్లో అన్నీ ఇలాంటి పొరపాట్లే ఉన్నాయి. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థంకావడం లేదు. – సాయి రమేష్ (ఎస్జీటీ, నల్లగొండ) -
telangana: ‘ఇల్లరికం’ పోలీస్..
సాక్షి, హైదరాబాద్: ఇరు కుటుంబాల స్థితిగతులు, కాబోయే అత్తామామలకు మగ సంతానం లేకపోవడం ఇతరత్రా కారణాలతో కొందరు ఇల్లరికం వెళుతుంటారు. అంటే వివాహానంతరం పెళ్లికూతురు అత్తారింటికి వెళ్లిపోవడం కాకుండా రివర్స్‌లో పెళ్లికొడుకు అత్తారింటికి వెళ్లి అక్కడే స్థిరపడిపోతాడన్నమాట. అచ్చం ఇలాగే కాకపోయినా ఇల్లరికపుటల్లుడు మాదిరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఒకే జిల్లాలో పాతుకుపోతున్నారు. సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం ప్రారంభించిన తర్వాత పదోన్నతులు పొందిన అధికారులు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లాల్సి ఉన్నా అలా జరగడం లేదు. జోన్‌లోని ఇతర జిల్లాల్లో పనిచేసే అవకాశం ఉన్నా వెళ్లకుండా అక్కడక్కడే పోస్టింగ్‌లు చేస్తూ స్థానికంగా లభించిన పట్టుతో అక్రమార్జనకు పాకులాడే నేపథ్యంలో వివాదాస్పదమవుతున్నారు. కొత్తగూడెంలోని పాల్వంచలో జరిగిన వనమా రాఘవేంద్రరావు తరహా వ్యవహారాలకు ఇలాంటి అధికారులే పరోక్ష కారణమన్నది బహిరంగ రహస్యం. సిఫారసులతో ఏళ్లకేళ్లుగా అక్కడే ఉంటున్న వీరు.. తమను సిఫారసు చేసిన ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, కుటుంబీకులు చేసే అరాచకాలకు అందదండలందిస్తున్నారు. 70 శాతం ఇదే రీతి... రాష్ట్రంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ.. ఇలా కమిషరేట్లతో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఇల్లరికపు అధికారులు వందల మంది ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులు జోన్‌లోని తన స్వంత జిల్లా కాకుండా మిగిలిన ఏ జిల్లాలో అయినా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. కానీ అనేకమంది సబ్ ఇన్స్పెక్టర్గా మంచి రెవెన్యూ ఉన్న జిల్లాలను ఎన్నుకోవడం.. అక్కడే రిటైర్మెంట్ దాకా పాతుకుపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలా 70 శాతం మంది పోలీస్ అధికారులు ఒకే జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్/ఇన్స్పెక్టర్ ఆ తర్వాత డీఎస్పీగానూ పదోన్నతి పొంది మళ్లీ అక్కడే పనిచేస్తుండటం గమనార్హం. రాష్ట్ర స్థాయి హోదాలో డీఎస్పీగా తన స్వంత డివిజన్ తప్ప ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉన్నా తాను గతంలో పని చేసిన జిల్లాలోనే తాను ఎస్ఐ, సీఐగా పనిచేసిన సబ్‌డివిజన్ డీఎస్పీగా/ఏసీపీలుగానే పనిచేస్తున్నారు. మరికొంత మంది అధికారులైతే ఏకంగా అదనపు ఎస్పీగా కూడా అదే జిల్లాలో ఉంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదాయంపై గురి.. అక్రమాలకు దన్ను ఇలాంటి అధికారులు టౌన్‌కు గరిష్టంగా 20 కిలోమీటర్లు దూరంలోపే పోస్టింగ్ తీసుకుంటారు. పైగా కనీస ఆదాయం అంటే తమను సిఫారసు చేసినందుకు ఇచ్చిన సొమ్ముకు రెండు, మూడింతలు వచ్చే పోస్టింగ్‌లో మాత్రమే కొనసాగుతారు. కొంతమంది అధికారులు మైనింగ్ కార్యకలాపాలుండే ప్రాంతాల్లో వరుస పోస్టింగ్‌లు తెచ్చుకుంటారు. ఇంకొంత మంది ఇసుక దందా సాగే ప్రాంతాలను ఎంచుకొని మరీ ఆయా ఠాణాల్లోనే పనిచేస్తారు. ఇంకొంత మంది గ్యాబ్లింగ్, వ్యాపార నెలవారీ కమీషన్లు, వైన్స్, బార్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటారు. ఇంకొంత మంది అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, సెటిల్మెంట్ల కేంద్రంగా సాగే ఏరియా ఠాణాలను టార్గెట్ చేసుకొని పోస్టింగ్ పొందుతున్నారు. సైబరాబాద్, రాచకొండ ప్రాంతాల్లో సీఐ పోస్టింగ్‌కు సిఫారసు చేసేందుకు సంబంధిత ప్రజాప్రతినిధులు తక్కువలో తక్కువ రూ.20 లక్షలు తీసుకుంటున్నారంటే, ఆ పోస్టులో చేరి వారెంత అక్రమార్జనకు, ఎన్ని అవకతవకలకు పాల్పడతారో అర్ధం చేసుకోవచ్చు. దెబ్బతింటున్న పోలీసింగ్... ఎప్పటిప్పుడు అధికారుల మార్పు జరిగితే విధులు అంకితభావంతో పాటు పారదర్శకంగా నిర్వర్తించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఒకే అధికారి ఏళ్ల పాటు స్టేషన్లు మార్చిమార్చి పోస్టింగ్‌లు చేయడం, పదోన్నతి తర్వాత మళ్లీ అదే అధికారి సూపర్విజన్ డ్యూటీలోకి రావడం ఇష్టారీతిన జరిగిపోతోంది వనమా రాఘవతో ముడిపడిన ఘటన వంటి ఉదంతాలకు ఇలాంటి అధికారుల వ్యవహారాలే పరోక్షంగా కారణమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్లో 42 మంది సెటిల్ ►ఉమ్మడి కరీంనగర్లో జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ టౌన్ స్టేషన్లలో ఎస్ఐలుగా పనిచేసిన అధికారులే ఇప్పుడు సీఐలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న ఓ ఏసీపీ అధికారి గతంలో అక్కడే టౌన్ ఎస్ఐ, రూరల్ ఎస్ఐ, రూరల్ సీఐగా పనిచేశారు. ఇలా 42 మంది అధికారులు ఈ జిల్లాలోనే సెటిల్ అయిపోయారు. వీరు స్టేషన్ మారడం మినహా మరో జిల్లాకు పోయి పనిచేసింది లేదు. ►ఉమ్మడి వరంగల్‌లోని హన్మకొండ, కాజీపేట, ఎల్కతుర్తి, పరకాల, మామునూర్, జనగాం, ఘన్పూర్, వర్ధన్నపేట మహబూబాబాద్, పాలకుర్తి, భూపాలపల్లి.. ఇలా సబ్ డివిజన్లలో ఎస్ఐగా, సీఐగా పనిచేసిన అధికారులే ప్రస్తుతం ఏసీపీలుగా, క్రైమ్ అధికారులుగా, టాస్క్‌ఫోర్స్, ట్రాఫిక్ విభాగాల్లో అధికారులుగా పనిచేస్తున్నారు. ►ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఖమ్మం టౌన్, కొత్తగూడెం, వైరా, సత్తుపల్లి, మధిర, ఇల్లందు, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు ఆయాసర్కిల్స్/సబ్డివిజన్లలో ఎస్ఐగా పనిచేసిన వారు ఆయా ప్రాంతాల్లోనే సీఐ, డీఎస్పీలుగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 70% మంది ►ఉమ్మడి ఆదిలాబాద్‌లో మంచిర్యాల, బెల్లంపల్లి, నిర్మల్, ఆదిలాబాద్ రూరల్, భైంసా, ఉట్నూర్ సబ్ డివిజన్లలో ఎస్ఐలుగా పనిచేసిన 70 శాతం మంది అధికారులు ఇప్పుడు అవే ప్రాంతాల్లో సీఐగా, ఆపై స్థాయి పోస్టింగుల్లో కొనసాగుతున్నారు. ► ఉమ్మడి నిజామాబాద్‌లో హెడ్‌క్వార్టర్స్‌లోని ఠాణాలు, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, బోధన్, భీమ్‌గల్, డిచ్పల్లి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, బిక్నూర్ సబ్‌డివిజన్, సర్కిల్లో ఎస్ఐలు, సీఐలుగా పనిచేసిన అధికారులు అక్కడే సీఐలు, డీఎస్పీ/ఏసీపీలుగా పనిచేస్తున్నారు. ► ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో నల్లగొండ హెడ్‌క్వార్టర్‌లోని ఠాణాలు, కోదాడ, సూర్యాపేట, సాగర్, మాల్, చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు, హుజూర్నగర్, చిట్యాల, మిర్యాలగూడ, దేవరకొండ, తుంగతుర్తి.. ఇలా పలు ఠాణాల్లో ఎస్ఐలుగా పనిచేసినవారు ఇప్పుడు సీఐలుగా, మరికొంత మంది డీఎస్పీలుగా అక్కడే పాతుకుపోయారు. ►ఉమ్మడి మహూబూబ్‌నగర్‌లో హెడ్‌క్వార్టర్స్‌లోని ఠాణాలతో పాటు జడ్చర్ల, నారాయణపేట్, మక్తల్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అమన్‌గల్, అమ్రాబాద్, వనపర్తి, గద్వాల్, దేవరకద్ర.. ఇలా సర్కిల్/సబ్డివిజన్లలో 60 శాతం అధికారులు ఇంతకుముందు అక్కడక్కడ పనిచేసిన వారే. ►ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్, పటాన్చెరు, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్ తదితర సర్కిల్, సబ్డివిజన్లలో ఎస్ఐగా పనిచేసిన వారు ఇప్పుడు అక్కడే సీఐగా, సీఐగా చేసిన వారు డీఎస్పీలుగా పనిచేస్తున్నారు. ► ఇక సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండలో ఒక పోలీస్‌స్టేషన్‌నుంచి మరో పోలీస్‌స్టేషన్‌కు మార్పు చెందుతున్నారు కానీ కమిషనరేట్‌ను వదిలీ మరో కమిషనరేట్ లేదా జిల్లాకు మాత్రం బదిలీ కావడం లేదు. ఇలా ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో 90 శాతం అధికారులు తొలినాళ్లలో అక్కడే పనిచేసి, పదోన్నతి తర్వాత కూడా అక్కడే పనిచేస్తుండటం గమనార్హం. -
దేశ్‌ముఖ్, పరబ్‌లకు 40 కోట్లు ఇచ్చారు
ముంబై: బదిలీ ఉత్తర్వులను నిలిపివేసేందుకు మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్, మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు 10 మంది డీసీపీలు కలసి రూ. 40 కోట్ల రూపాయలు ముట్టజెప్పారని మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ఆరోపించారు. ముంబై పోలీసు కమిషనర్‌గా ఉన్న పరమ్ బీర్ సింగ్ జారీ చేసిన బదిలీ ఉత్తర్వుల్ని వెనక్కి తీసుకోవడానికి ఈ సొమ్ములు ముట్టజెప్పినట్టుగా వాజే ఈడీతో చెప్పారు. దేశ్‌ముఖ్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పలాండే, వ్యక్తిగత సహాయకుడు కుందన్‌లపై నమోదైన కేసుకి సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీటులో వాజే చేసిన ఆరోపణల్ని ప్రస్తావించారు. జులై 2020లో ముంబైలో 10 మంది డీసీపీలను బదిలీ చేస్తూ పరమ్ బీర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులపై అప్పటి హోంమంత్రి దేశ్‌ముఖ్, రవాణా మంత్రి పరబ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని వాజే పేర్కొన్నారు. -
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఇంతియాజ్ మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఉన్న జె. నివాస్ కృష్ణా జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇక శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా ఎల్ఎస్ బాలాజీరావు, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా నాగలక్ష్మి, చిత్తూరు జిల్లా హౌసింగ్ జేసీగా వెంకటేశ్వర్, అనంతపురం జిల్లా హౌసింగ్ జేసీగా నిశాంతి, పాడేరు ఐటీడీఏ పీవోగా గోపాలకృష్ణ, ప్రకాశం జిల్లా హౌసింగ్ జేసీగా కేఎస్ విశ్వనాథన్, వైఎస్ఆర్ కడప జిల్లా హౌసింగ్ జేసీగా ధ్యానచంద్ర, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ జేసీగా జాహ్నవి, కర్నూలు జిల్లా హౌసింగ్ జేసీగా మౌర్య, కృష్ణా జిల్లా హౌసింగ్ జేసీగా అజయ్‌కుమార్, గుంటూరు జిల్లా హౌసింగ్ జేసీగా అనుపమ అంజలి, నెల్లూరు జిల్లా హౌసింగ్ జేసీగా విధే ఖారే, పశ్చిమగోదావరి జిల్లా హౌసింగ్ జేసీగా సూరజ్ ధనుంజయ్, విశాఖ జిల్లా హౌసింగ్ జేసీగా కల్పనకుమారి, విజయనగరం జిల్లా హౌసింగ్ జేసీగా మయూర్ అశోక్, శ్రీకాకుళం జిల్లా హౌసింగ్ జేసీగా హిమాన్షు కౌశిక్ , ఏపీ ఆగ్రోస్ ఎండీగా కృష్ణమూర్తి బదిలీ అయ్యారు. -
నలుగురు అడిషనల్ ఎస్పీల బదిలీ
సాక్షి, హైదరాబాద్ : పోలీసుశాఖలో అడిషనల్ ఎస్పీలు (నాన్‌కేడర్)గా విధులు నిర్వర్తిస్తున్న పలువురు అధికారులు బదిలీ అయ్యారు. రా మగుండం అడిషనల్ డీసీపీ (ఆపరేషన్స్)గా ఉన్న పి.శోభన్‌కుమార్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న కె.సురేశ్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయమన్నారు. వరంగల్‌లో అడిషనల్ డీసీపీ (క్రైమ్స్ అండ్ ఆపరేషన్స్)గా వి.తిరుపతిని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా బదిలీ చేశారు. అక్కడున్న అట్ల రమణారెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా ఆదేశాలు జారీ చేశారు. -
న్యాయమూర్తుల అనవసర బదిలీలు
ఉద్యోగస్తులకి బదిలీలు సర్వ సామాన్యం. ఆరోపణలు వచ్చినా, మూడు సంవత్సరాలు గడిచినా ఆ ఉద్యోగిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతా నికి బదిలీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకన్నా న్యాయమూర్తుల బదిలీలు క్రమబద్ధంగా జరు గుతూ ఉంటాయి. ప్రతి సంవ త్సరం ఏప్రిల్, మే నెలల్లో ఈ బదిలీలు తప్పక జరుగు తాయి. కోవిడ్–19 వచ్చిన తరువాత ఈ బదిలీల విష యంలో ప్రభుత్వాలు వెనుకంజ వేశాయి. కేంద్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థలు ఈ వార్షిక బదిలీలని నిలిపివేశాయి. మనదేశంలోని చాలా హైకోర్టులు కూడా ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించాయి. అందులో ముఖ్యమైనవి తెలంగాణ, బాంబే, అలహా బాద్, మద్రాస్, మధ్యప్రదేశ్, కేరళ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. కరోనా తీవ్రత లేని రాష్ట్రాలు కూడా ఈ సంవత్సరం సాధారణ బదిలీలను నిలిపివేశాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం న్యాయమూర్తులను బదిలీలు చేసింది. ఆ హైకోర్టు ఇన్చార్జ్ న్యాయ మూర్తులను బదిలీలు చేసింది. ఆ హైకోర్టు ఇన్చార్జ్ రిజిస్ట్రార్ జనరల్ బి.రాజశేఖర్ ఈ మధ్య గుండెపోటుతో మరణించారు. పని ఒత్తిడి వల్ల మరణించినాడని, కోవిడ్ వల్ల మర ణించాడని వార్తలు విన్పిస్తున్నాయి. అందులో ఏది వాస్తవమో మనకు తెలియదు. కరోనా విజృంభిస్తున్నవేళ, కోర్టులే వర్చువల్ కోర్టులుగా పనిచేస్తున్న సందర్భంలో న్యాయమూర్తుల బదిలీలు అవసరమా అన్న ప్రశ్నని చాలామంది న్యాయమూర్తులు, న్యాయవాదులు, వెలి బుచ్చుతున్నారు. కొన్ని మాసాలపాటు కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు వున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి. లాక్‌డౌన్‌వల్ల, కొత్త పద్ధతులకి, న్యాయ మూర్తులు, సిబ్బంది అలవాటు పడే పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త వాతావరణానికి న్యాయమూర్తులు, సిబ్బంది ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ఈ వాతావర ణంలో కోర్టులో కేసుల పరిష్కారం, కుటుంబ బాధ్యత, పిల్లల చదువు, ఆరోగ్యం లాంటి అంశాలతో న్యాయ మూర్తులు తల్లడిల్లుతున్నారు. ఈ దశలో న్యాయమూర్తులకి బదిలీలు వాళ్లని తెలియని ఒత్తిడికి గురిచేస్తాయి. కరోనా కాలంలో కొత్త ప్రాంతానికి వెళ్లడం, అక్కడ సర్దుబాటు కావడం సులువైన విషయం కాదు. సామాను సర్దుకోవడం చాలా కష్టమైన పని. దానికి పనివాళ్ళ సహాయం కావాలి. ప్యాకర్స్, మూవర్స్ అవసరం ఏర్పడుతుంది. కూరగాయలనే కడు గుతున్న కాలంలో సామానుని ఒక ఊరి నుంచి మరో ఊరికి తరలించడం కష్టసాధ్యమైన పని. లగేజీకి, అంటు వ్యాధి సంక్రమించకుండా చూసుకోవడం చాలా కష్టమైన పని. పిల్లల చదువూ, ఆరోగ్యం, తల్లిదండ్రుల బాధ్యత మధ్య న్యాయమూర్తులు సతమతమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత ఒత్తిడిలో ఉన్న న్యాయమూర్తులు తన విధు లని ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్నని చాలామంది విజ్ఞులు లేవనెత్తుతున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా న్యాయ మూర్తులు నోరు విప్పరు. అలాంటి క్రమశిక్షణ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళ అసోసియేషన్స్ కూడా మాట్లాడటానికి జంకుతారు. మిగతా ఉద్యోగులు వేరు. న్యాయమూర్తులు వేరు. కిందికోర్టు న్యాయమూర్తులని అనవసర బదిలీల ద్వారా, అసౌకర్య బదిలీల ద్వారా బలిపశువులని చేస్తూ ఉంటారని సుప్రీంకోర్టు మింటూ మాలిక్ కేసులో (హైకోర్టు ఆఫ్ కలకత్తా వర్సెస్ మింటూ మాలిక్ మరియు ఇతరులు, స్పెషల్ లీవ్ పిటిషన్ (సివిల్) నెం. 24240/2019, తీర్పు తేదీ నవంబర్ 15, 2019) అభిప్రా యపడింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, బి.ఆర్. గవాయ్‌లు ఈ తీర్పుని వెలువరించారు. న్యాయమూర్తులని బలిపశువులు చేసే విషయంలో సుప్రీంకోర్టు తన ఆందోళనని ఈ తీర్పులో వెలువ రించింది. ఈ కేసులో ఒక రైల్వే మేజిస్ట్రేట్‌ని నిర్బంధంగా పదవీ విరమణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులని ఆ న్యాయమూర్తి కలకత్తా హైకోర్టులో సవాలు చేశాడు. ఆ న్యాయమూర్తిని తిరిగి విధుల్లో చేర్చుకోవా లని హైకోర్టులోని డివిజన్ బెంచ్ హైకోర్టుని ఆదేశిం చింది. అతను చేసిన చర్యలో చెడు నడవడిక లేదని సదు ద్దేశంతో అతను ఆ చర్యను చేశాడని హైకోర్టు అభి ప్రాయపడింది. ఆ మేజిస్ట్రేట్ ప్రయాణం చేసే రైలు తరచూ ఆల స్యంగా రావడానికి కారణం అనవసరంగా కొన్ని ప్రదే శాల్లో ఆపి, చట్ట వ్యతిరేకంగా కొన్ని వస్తువులని దింపడం. తన అధికార పరిధిలో చట్ట వ్యతిరేక పనులు జరగడం పట్ల ఆందోళన చెంది అతను ఆ రైల్వే ఉద్యోగుల మీద చర్య తీసుకుంటాడు. ఈ విషయం మీద హైకోర్టు విచా రణ జరిపి అతన్ని సస్పెండ్ చేసి, నిర్బంధంగా పదవీ విరమణకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ ఆదేశాలను అతను హైకోర్టులో సవాలు చేస్తే, అతన్ని తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని అదేవిధంగా లక్ష రూపాయలు అతనికి ఖర్చుల కింద ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ హైకోర్టునే ఆదేశించింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ఇలా అభిప్రాయపడింది. ఈ రోజుల్లో న్యాయమూర్తులని బలిచేసే ట్రెండ్ ఒకటి మొదలైంది. అనవసర బదిలీల ద్వారా మరో విధమైన చర్యల ద్వారా న్యాయమూర్తుల మీద చర్యలు తీసుకుంటున్నారు. న్యాయమూర్తులకి వ్యతిరేకంగా న్యాయవాదులు గానీ, ఇతరులు కానీ ధర్నాలు చేస్తే చాలు.. వారిని బది లీలు చేస్తున్నారు. అదేవిధంగా చర్యలు తీసుకుంటు న్నారు. న్యాయమూర్తుల తప్పు ఎంతవుందన్న ఆ విష యాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. సాధారణ బదిలీల విషయంలో మింటూ మాలిక్ కేసులో మాదిరిగా చెడు నడవడిక, ధర్నాల ప్రస్తావన వుండదు. అలాంటి కేసులు ఒకటి అరా ఉండవచ్చేమో తెలియదు. కానీ, ఇవి ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగే ప్రక్రియ. ఈ కోవిడ్–19 కాలంలో అన్ని హైకోర్టుల మాదిరిగా బదిలీలను నిలిపివేస్తే న్యాయమూర్తులు అసౌక ర్యానికి, వేదనకి గురికాకుండా ఉంటారు. వ్యాసకర్త, మంగారి రాజేందర్ -
ఈ పోలీసుల లెక్కే వేరు..!
సాక్షి, ఆదిలాబాద్ : తామున్న ఠాణా వదిలేది లేదంటూ ఆ పోలీసులు తమ ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. క్రమశిక్షణకు పెద్దపీట వేసే పోలీసుశాఖలో ఇప్పుడీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గత నెలలోనే బదిలీలు జరిగినప్పటికీ తమ స్థానాల నుంచి కదలడం లేదు. పోలీసులు బదిలీలకు విముఖత చూపుతుండడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. బదిలీలకు ఆదేశాలు.. గత నెల 21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సివిల్ పోలీసులైన పోలీస్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల బదిలీలకు ఆదేశాలు వెలవడ్డాయి. అంతకుముందు ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఎస్పీలు, మంచిర్యాల జిల్లా కిందకు వచ్చే రామగుండం సీపీలు ఆయా జిల్లాల్లోని పీసీలు, హెచ్‌సీలు, ఏఎస్సైల నుంచి బదిలీలకు దరఖాస్తులు ఆహ్వానించారు. అందులో ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు బదిలీపై వెళ్లేందుకు ప్రాధాన్యత క్రమంలో దరఖాస్తు చేసుకోవాలని అప్పట్లో పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆయా ఠాణాల్లో పోలీసు అధికారులకు దరఖాస్తులను మరుసటి రోజులోగా సమర్పించాలని ఆదేశాలు రావడంతో అప్పట్లోనే పోలీసు సిబ్బందిలో హైరానా వ్యక్తమైంది. ఆ తర్వాత రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటీవ్ గ్రౌండ్స్‌లో ఉమ్మడి జిల్లాలో సుమారు 70 మంది వరకు బదిలీలు జరిగాయి. దీనికి సంబంధించి ఆయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుంచి ఇతర జిల్లాలకు పలువురిని బదిలీ చేశారు. ఈ మేరకు ఆయా పోలీసులను సంబంధిత డీఎస్పీలు, ఎస్‌హెచ్‌వోలు, సీఐలు, ఎస్సైలు తక్షణం సంబంధిత పోలీసుస్టేషన్ నుంచి రిలీవ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన వారు సంబంధిత పోలీసు ఉన్నతాధికారికి జాయినింగ్ లెటర్ ఇవ్వాలని సూచించారు. ఇది జరిగి సుమారు 20 రోజులవుతున్నా ఇప్పటి వరకూ పోలీసులు తమ స్థానాల నుంచి రిలీవ్ కాలేదు. ఇప్పుడీ వ్యవహారం ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖలో చర్చనీయాశంగా మారింది. అసలు ఏం జరుగుతోంది..? పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారంలో ప్రస్తుతం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీ వ్యవహారంలో పోలీసులు పట్టువీడనట్లు తెలుస్తోంది. ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటి పోయినందున తాము వెళ్లలేమని పేర్కొన్నారని సమాచారం. 2016లో జిల్లా విభజన జరిగినప్పటికీ ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాలకు పలువురు పోలీసులను ఆర్డర్ టు సర్వ్ ద్వారా బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత మరో రెండు సార్లు బదిలీలు జరిగాయి. అయితే ఆర్డర్ టు సర్వ్ ద్వారా ఉమ్మడి జిల్లాలోనే బదిలీ అయిన వారు ప్రస్తుతం సొంత జిల్లాలకు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులను కలిసి మొరపెట్టుకుంటున్నారు. అయితే గత నెల జరిగిన బదిలీలకు సంబంధించి ఆదేశాలు వెలువడినా పోలీసులు బేఖాతరు చేయడం మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్న చర్చ జరుగుతోంది. పరిశీలన జరిగిందా..! జిల్లాల విభజనకు ముందే పలువురు పోలీసులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకున్నారు. ప్రధానంగా కొన్నేళ్లుగా ఒకే దగ్గర పోస్టింగ్ ఉండడంతో ఆ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకుని స్థిరపడ్డారు. అయితే 2016లో జిల్లాల విభజనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలుగా మారాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖకు సంబంధించి జిల్లా పోలీసు అధికారి (డీపీవో) కార్యాలయాలు జిల్లా కేంద్రాల్లో ఏర్పాడ్డాయి. మంచిర్యాలకు సంబంధించి రామగుండం కమిషనరేట్ నుంచి కార్యకలాపాలు జరుగుతున్నాయి. అప్పట్లోనే పోలీసులకు సంబంధించి సర్వీస్ బుక్‌లను ఆయా జిల్లాల వారీగా డీపీవో కార్యాలయాలకు తరలించారు. ప్రస్తుతం బదిలీల్లో సదరు పోలీసులు చదువుకున్న ప్రాంతానికి సంబంధించి బోనాఫైడ్ సర్టిఫికెట్, పోలీసు శాఖలో అతని సర్వీసుకు సంబంధించిన బుక్‌ను పరిశీలించి వారు ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతానికి చెందినవారైతే ఆ ప్రాంతానికి బదిలీ చేయాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏళ్లుగా తమ సొంత ప్రాంతాన్ని విడిచి ప్రస్తుతం వేరే చోట స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారు బదిలీపై వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలుస్తోంది. మరో పక్క ఆర్డర్ టు సర్వ్ ద్వారా కొంత మంది ఇతర జిల్లాలకు వెళ్లిన వారు మూడు సంవత్సరాలైనా తమ సొంత జిల్లాకు బదిలీ చేయకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. -
నన్ల బదిలీ ఉత్తర్వుల నిలిపివేత
తిరువనంతపురం: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన తెలిపిన నన్ల బదిలీ ఉత్తర్వులను జలంధర్ డయోసిస్ నిలిపివేసింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నందున విచారణ పూర్తయ్యే దాకా వారిని మరో చోటుకు పంపబోమంటూ హామీ ఇచ్చింది. బిషప్ ములక్కల్ 2014–16 సంవత్సరాల్లో కొట్టాయంలోని కురువింగలద్ కాన్వెంట్కు చెందిన ఓ నన్‌పై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ బిషప్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత ఏడాది బాధితురాలితోపాటు మరికొందరు నిరసన తెలిపారు. ఆందోళనకు దిగిన నలుగురు నన్లను వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తూ మిషనరీస్ ఆఫ్ జీసస్కు చెందిన నన్ల కాంగ్రిగేషన్ హెడ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విషయాన్ని బాధితులు డయాసిస్తోపాటు కేరళ ముఖ్యమంత్రి విజయన్ దృష్టికి తీసుకెళ్లారు. తన జీవితం ప్రమాదంలో పడిందని, ఒంటరి చేసి, వేధించాలంటూ చూస్తున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారంతా కాన్వెంట్ వద్ద నిరసనకు దిగగా మరికొందరు వ్యక్తులు బాధితులకు వ్యతిరేక నినాదాలు చేస్తూ అక్కడ బైఠాయించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. ఈ పరిణామాలపై స్పందించిన జలంధర్ డయాసిస్.. ఆ నలుగురు నన్ల బదిలీ ఉత్తర్వులను రద్దు చేసింది. బిషప్ ములక్కల్‌పై ఆరోపణల కేసు తేలేదాకా సిస్టర్ ఆల్ఫీ, సిస్టర్ అనుపమ, సిస్టర్ జోసెఫైన్, సిస్టర్ అన్సితలను అక్కడి నుంచి బదిలీ చేయబోమంటూ హామీ ఇచ్చింది. వారు ప్రస్తుతం పనిచేస్తున్న చోటే యథావిధిగా విధులకు హాజరు కావొచ్చని తెలిపింది. -
ఏసీబీకి చిక్కిన బీసీ కార్పొరేషన్ ఈడీ
- రూ.15వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం - వేములపూడి బాధితుల ఫిర్యాదుతో దాడి - రిలీవ్‌కు ముందు రోజే పట్టివేత విశాఖపట్నం : బదిలీ ఉత్తర్వులు అందుకుని రిలీవ్ అవ్వడానికి ముందు రోజే లంచం తీసుకుంటూ బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కె.జీవన్‌బాబు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కారు. నర్సీపట్నంలోని వేములపూడికి చెందిన సుర్ల ఆదినారాయణ, సుర్ల ఎర్రినాయుడు, కర్రినాయుడుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వల పన్ని మంగళవారం ఈడీని పట్టుకున్నారు. ఈ ఏడాది మార్చిలో ఆన్లైన్ ద్వారా బీసీ రుణం కోసం ఫిర్యాదుదారులు దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటే దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు మంజూరవడంతో వీరంతా ఈడీని సంప్రదించారు. ఒక్కొక్కరు రూ.5వేలు చొప్పున రూ.15 వేలు లంచమిస్తేనే రుణాలు మంజూరవుతాయని చెప్పడంతో వారంతా ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ సూచన మేరకు బాధితులు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం ఎంవీపీ కాలనీలోని బీసీ కార్పొరేషన్ ఈడీ జీవన్‌బాబుకి నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆది నుంచీ లంచావతారమే! బీసీ కార్పొరేషన్ ఈడీ జీవన్‌బాబుపై గతంలో కూడా పలు ఆరోపణలు వున్నాయి. రుణాల కోసం ఎవరు వచ్చినా లంచాల కోసం పీడించేవారని సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. రెండేళ్ల కిందట జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)కి ఐఎఫ్‌సీ కోడ్ నెంబర్ లేకపోవడంతో సదరు బ్యాంక్ రుణాలు చెక్కుల రూపంలోనే ఇచ్చేది. దీనిని అనుకూలంగా మార్చుకున్న జీవన్‌బాబు లబ్ధిదారులకు చెక్కు ఇవ్వాలంటే రూ.3వేల నుంచి రూ.4వేల వంతున లంచాలు తీసుకునేవారని ఆరోపణలు ఉన్నాయి. బాధితులెవరూ ధైర్యంగా ఏసీబీకి ఫిర్యాదు చేయకపోవడంతో జీవన్‌బాబు ఆడింది ఆట పాడింది పాట చందంగా సాగిపోయిందని సిబ్బంది అంటున్నారు. ఈయన బీసీ కార్పొరేషన్‌కి వచ్చి రెండేళ్ల పదినెలలు కావస్తోంది. డిప్యుటేషన్‌పై వచ్చి ఏడాది పూర్తయ్యాక హైదరాబాద్ వెళ్లి బీసీ కార్పొరేషన్లోనే ఉండేందుకు డిప్యుటేషన్‌ను పొడిగించుకున్నారు. జీవన్‌బాబు బీసీ కార్పొరేషన్ ఈడీగా వచ్చినప్పటి నుంచి ఇక్కడి సిబ్బందితో సత్సంబంధాలు లేవని, ఆ అంతర్గత విబేధాలే ఏసీబీ వలలో చిక్కేలా చేశాయని పలువురు చర్చించుకుంటున్నారు. డిప్యుటేషన్ పూర్తికావడంతో ఆయనకు సోమవారమే బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. దీంతో ఆయన ఏఈఓ ప్రసాద్‌కి బాధ్యతలు అప్పగించి రాష్ట్ర వికలాంగుల సంక్షేమశాఖలో రిపోర్టు చేయాల్సి ఉంది. మాతృశాఖ వికలాంగుల సంక్షేమ శాఖలోనూ వివాదాస్పదుడనే పేరుంది. -
నాడు విమర్శలు...నేడు ఇష్టారాజ్యంగా బదిలీలు
శ్రీకాకుళం: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రస్థాయిలో జరిగిన ఉపాధ్యాయ బదిలీల సందర్భంలో అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు విమర్శలు చేసి అధికారంలోనికి వచ్చిన తరువాత ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయులను బదిలీ చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. జిల్లా విద్యాశాఖాధికారులు పలువురికి బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు సోమవారం అందాయి. జిల్లాకు చెందిన 17 మంది వరకు బదిలీలు జరిగినట్టు తెలియవచ్చింది. ఈ బదిలీ ఉత్తర్వులు విద్యాశాఖ అధికారుల నుంచి కాకుండా ప్రజాప్రతినిధుల ప్రత్యేక కార్యదర్శుల ద్వారా విద్యాశాఖాధికారులకు రావడంపై ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అంతర్జిల్లా బదిలీలను కూడా రాష్ట్రస్థాయిలో చేయడంపై ఉపాధ్యాయ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో ఉపాధ్యాయుల బదిలీలు జరిగితే తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన అప్పటి ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సమయంలో బదిలీలు కౌన్సెలింగ్ ద్వారానే జరుపుతామని దొడ్డిదారిన బదిలీలు ఉండవని చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. వీటిని రద్దు చేయకుంటే ఆందోళన చేస్తామని పలు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కొందరు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించాలని కూడా యోచిస్తున్నారు. ఈ వ్యవహారం ఎటువంటి మలుపులకు దారితీస్తుందో వేచిచూడాలి. -
డీఈఓ బదిలీ ?
విద్యారణ్యపురి : జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ బదిలీ అరుునట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత బదిలీ ఫైల్‌పై విద్యాశాఖ మంత్రి సంతకమైనట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని విద్యాశాఖ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లా విద్యాశాఖాధికారిగా విజయ్‌కుమార్ ఇక్కడికి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. తనిఖీలతో హడలెత్తించిన ఆయన... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం రాకుంటే సంబంధిత ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. అయితే డీఈఓ కార్యాలయ ఆధునికీకరణ, సీసీ కెమెరాల ఏర్పాటుపై విమర్శలు వెల్లువెత్తాయి. నిధులను సమీకరణలో అవకతవకలకు పాల్పడ్డారని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పలు ఉపాధ్యాయుల సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉపాధ్యాయుల సస్పెన్షన్లు సరికాదని... నోటీస్‌లు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. కలెక్టర్‌తోపాటు ఉన్నత విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీఈఓపై విచారణ కూడా జరిగింది. కానీ.. ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో కొందరు ఉపాధ్యాయులు మళ్లీ ఆందోళనకు దిగారు. మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం డీఈఓకు సానుకూలంగా ఉంటూవచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో నలుగురు డీఈఓలపై ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడం.. ఇందులో వరంగల్ జిల్లా డీఈఓ విజయ్కుమార్పైనా ఫిర్యాదుల నేపధ్యంలో ఆయన బదిలీకి రంగం సిద్ధమైనట్లు సమాచారం. అయనను మహబూబ్‌నగర్‌కు గానీ,రంగారెడ్డి జిల్లాకు గాని డీఈఓగా బదిలీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
బదిలీ గోల!
ఫెవికాల్ వీరులకు విద్యాశాఖ అధికారుల అండదండలు! సాక్షి ప్రతినిధి, కడప : ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు...మారుమూల ప్రాంతంలో నియమించినా వెళ్లి పనిచేయడానికి సిద్ధమని అంటారు. తీరా ఉద్యోగం వచ్చాక జిల్లా కేంద్రంలో అయితే బాగుంటుందని అనుకుంటారు. ఒకవేళ అది సాధ్యంకాకపోయినా కనీసం ప్రక్క మండలంలో పోస్టింగ్ ఇచ్చినా సరిపెట్టుకుందామని భావిస్తారు. బదిలీల విషయంలో కూడా ఉద్యోగుల వైఖరి ఇలాగే ఉంటోంది. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, ఉద్యోగసంఘాల నాయకులను ఆశ్రయించడం, డబ్బులతో పై అధికారులను మేనేజ్ చేసేందుకు చేయని ప్రయత్నాలు ఉండవు. ఉపాధ్యాయ వర్గాల్లో ఇవి మరీ అధికం. ప్రస్తుతం కడప, చింతకొమ్మదిన్నె మండలాల్లోని కొందరు ఉపాధ్యాయులు బదిలీ అయినప్పటికీ అక్కడే ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం. ఎనిమిదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న కడప మండలంలోని 31 మంది, చింతకొమ్మదిన్నె మండలంలోని 10 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం గతంలో బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే వీరు 2011లో ఆంధ్రపదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి బదిలీ ఉత్తర్వులను అడ్డుకున్నారు. కాగా, గత సంవత్సరం నవంబరు 27వ తేదీ కడప, విశాఖ జిల్లాల 60 ఓఏలకు సంబంధించి ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. ఉపాధ్యాయులందరినీ బదిలీ చేయాలని ట్రిబ్యునల్ అందులో పేర్కొంది. దీంతో గత సంవత్సరం నవంబరు 30వ తేదీ విశాఖ డీఈఓ ఆ జిల్లాలోని ఉపాధ్యాయులను బదిలీ చేశారు. అయితే, కడప డీఈఓ మాత్రం డిసెంబరు 12వ తేది 41 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. బదిలీ చేసిన ప్రాంతాలకు వెళ్లి జాయిన్ కావాలని, లేనిపక్షంలో సీసీఏ రూల్స్ మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు. జాయిన్ అయ్యే దాకా మెడికల్, క్యాజువల్ లీవులు వర్తింపజేయబోమని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో కడప ఎంఈఓ తన పరిధిలోని 31 మంది ఉపాధ్యాయులను రిలీవ్ చేస్తున్నట్లు గత డిసెంబరు 14న ఉత్తర్వులు ఇచ్చారు. అయినా తమ మొండిపట్టు వీడని ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. గత డిసెంబరు 16వ తేదిన కోర్టు స్టేటస్ కో జారీ చేసింది. దీన్ని అడ్డుపెట్టుకుని తాము బదిలీపై వెళ్లేది లేదని వారు భీష్మించారు. కోర్టు ఉత్తర్వులు రాకమునుపే రిలీవ్ చేస్తూ విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు ఇచ్చినందున బదిలీ అయిన కేంద్రాలకు వెళ్లి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అలా వెళ్లకుండా ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లోనే ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా చాలా ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జిల్లా కేంద్రానికి బదిలీ కావాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే బదిలీలపై వెళ్లకుండా మొండి కేస్తున్న ఉపాధ్యాయుల వైఖరిపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. ఫెవికాల్ వీరులకు ఓ ఉపాధ్యాయ సంఘ నాయకుడు మద్దతుగా నిలిచారని అంటున్నారు. ఈ వ్యవహారం కలెక్టర్ దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన విద్యాశాఖ అధికారులను తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రానికి రావాలనుకుంటున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి ఒక మెమోను తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలో ఖాళీలు ఉంటే వీరికి అవకాశం కల్పించాలని, లేకపోతే సమీప మండలాల్లో నియమించాలంటూ ప్రభుత్వం మెమోలో పేర్కొంది. దీంతో సోమవారం డీఈఓ కార్యాలయంలో హడావుడిగా బదిలీల కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. అయితే జిల్లా కేంద్రంలో 31 మందిని రిలీవ్ చేసినట్లు గతంలో స్వయంగా ఆదేశాలు జారీ చేసిన డీఈఓ ప్రస్తుతం ఆ ఖాళీలను చూపకుండా ఇతర మండలాలకు వెళ్లండంటూ తమపై ఒత్తిడి తెస్తున్నట్లు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఖాళీలు చూపకపోవడం ద్వారా డీఈఓ పరోక్షంగా ఫెవికాల్ వీరులకు వత్తాసుగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే కోర్టులో కేసు తెగేంత వరకు తాము చేయగలిగేది ఏమీ లేదని ఆయన అంటున్నట్లు సమాచారం. ఉపాధ్యాయులను ముందే రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినందు వల్ల హైకోర్టు జారీ చేసిన స్టేటస్కో ఈ విషయంలో ఎలా వర్తిస్తుందని ఉపాధ్యాయులు ప్రశ్నించగా, డీఈఓ నుంచి సరైన సమాధానం లేదంటున్నారు. -
రండి బాబూ.. రండి!
పలువురు తహశీల్దార్ల చేతివాటం బదిలీల నేపథ్యంలో అక్రమార్జన ఎడాపెడా భూమి మార్పిడి ఫైళ్లపై చకచకా ఆఖరి సంతకం జిల్లాలో 42 మంది తహశీల్దార్లకు బదిలీ ఉత్తర్వులు రానున్నాయి. వారిలో చాలామంది గిట్టుబాటవుతాయనుకున్న పాత అర్జీలకు బూజు దులిపే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా పాస్‌పుస్తకాలు వారికి కాసుల పంట పండిస్తున్నాయి. మార్పులు, చేర్పులకు సంతకాలు చేయాలంటే వారు అడిగినంత సమర్పించుకోక తప్పని దయనీయ పరిస్థితి రైతులది. అసైన్డ్ భూములను సైతం పాస్‌పుస్తకాల్లో చేర్చేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఈ తరహా అక్రమాల్లో లక్షలాది రూపాయల సొమ్ము చేతులు మారుతోంది. దీనికితోడు భూమి మార్పిడి (ల్యాండ్ కన్వర్షన్) విషయంలోనూ వారు తమకు అనుకూలంగా మలుచుకుని లక్షలు గడించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కొల్లేరు, అసైన్డ్ భూములు, సీఆర్‌జెడ్ భూముల్లో అనధికార చెరువులు తవ్వుకునేందుకు, కొన్నిచోట్ల చెరువులకు అనుమతులిస్తూ భారీగా సొమ్ము దండుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు ఇసుక క్వారీల వ్యవహారాల్లోని లోపాలను చూసీచూడనట్టు వదిలేయడానికి రేట్లు విధించారు. గతంలో పక్కన పెట్టిన ఫైళ్లను మళ్లీ బయటకు తీసి కొత్తగా ఒప్పందాలు చేసుకుని పాత తేదీలతో సంతకాలు చేసే పనిలో కొందరు తహశీల్దార్లు తలమునకలయ్యారు. ఒక్కమాటల్లో చెప్పాలంటే అక్రమాలను సక్రమాలుగా చేయడానికి.. ప్రతి పనికీ విలువను నిర్ణయించేశారు. రేపటిలోగా బదిలీలు.. ఇప్పటికే ఇతర జిల్లాల నుంచి 24 మంది తహశీల్దార్లు జిల్లాకు బదిలీ అయ్యారు. వారు ఇక్కడికి వచ్చాక జిల్లా నుంచి 42 మంది తహశీల్దార్లు బదిలీ కాక తప్పదు. ఇందుకు సంబంధించి భూ పరిపాలన ప్రధాన అధికారి (సీసీఎల్ఏ) నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. సోమవారం నాటికి జిల్లాలోని తహశీల్దార్ల బదిలీకి మార్గం సుగమం అవుతుందని అంటున్నారు. బదిలీ సమయం దగ్గర పడడంతో పలువురు తమదైన రీతిలో కౌంటర్లు తెరిచినా.. డివిజనల్ స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం కొసమెరుపు. తహశీల్దార్ల మామూళ్ల దందా ఇలా.. పాస్బుక్కు రూ.2 వేలు నుంచి రూ. 5 వేలు. ల్యాండ్ కన్వర్షన్ ఎకరాకు రూ.10 వేలు. అక్రమంగా చేపల చెరువు తవ్వుకునేందుకు ఎకరాకు రూ.6 వేలు నుంచి రూ. 10 వేలు. కాస్త అవినీతిపాళ్లు ఎక్కువైన తహశీల్దార్లయితే చెరువు తవ్వుకునే ఆసాముల నుంచి ఒక్కో ట్రాక్టర్‌కు రోజుకు రూ.300 చొప్పున వసూలు చేస్తూ అక్రమార్జనకు పరాకాష్టగా నిలుస్తున్నారు. అసైన్డ్, సీఆర్‌జెడ్, మడఅడవుల్లో చెరువుల తవ్వకానికి ఎకరాకు రూ.50 వేలు నుంచి రూ. లక్ష. ఇసుక క్వారీల్లో అక్రమ తరలింపు కోసం రూ.50 నుంచి రూ. లక్ష. -
బదిలీల జ్వరం
ఏలూరు, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులకు బదిలీల జ్వరం పట్టుకుంది. ఎన్నికల నిర్వహణతో సంబంధమున్న అధికారులు మూడేళ్లుగా ఇదే జిల్లాలో పనిచేస్తుంటే బదిలీ చేయూలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈనెల 10వ తేదీ నాటికి అధికారులకు బదిలీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఈఆర్వో)గా వ్యవహరిస్తున్న జిల్లాస్థారుు అధికారులకు బదిలీలు ఉంటాయూ, ఉండవా అన్న విషయం చర్చనీయూంశంగా మారింది. జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఈఆర్వోలుగా వ్యవహరిస్తున్న అధికారులు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశం లేకపోలేదని కలెక్టరేట్ వర్గాలు భావిస్తున్నారుు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ఎస్డీసీ డీవీఆర్ఎల్ఆర్ఎం యల్లారమ్మ (నిడదవోలు ఈఆర్వో), ఇందిరాసాగర్ యూనిట్-2 ఎస్డీసీ జీవీఎస్ఎస్ నాగలక్ష్మి (పాలకొల్లు ఈ ఆర్వో), డ్వామా అదనపు ప్రాజెక్టు డెరైక్టర్ సీహెచ్.వెంకటేశ్వరరావు (భీమవరం ఈ ఆర్వో), జంగారెడ్డిగూడెం ఆర్డీవో వి.నాన్‌రాజు (గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల ఈఆర్వో), డీఆర్డీఏ పీడీ వై.రామకృష్ణ(చింతలపూడి ఈఆర్వో)లకు బదిలీ ఉండొచ్చంటున్నారు. ఈ ఐదుగురిలోనూ యల్లారమ్మ, వి.నాన్‌రాజు, సీహెచ్ వెంకటేశ్వరరావు ఈ జిల్లాకు చెందిన వారే. ఇటీవల మైక్రో ఇరిగేషన్ పీడీ ఆర్వీ సూర్యనారాయణను ఐటీడీఏ పీవోగా బదిలీ చేశారు. ఇదే సందర్భంలో ఆయనను గోపాలపురం ఈఆర్వోగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విధుల్లో చేరటానికి సాంకేతిక ఇబ్బందులు రావడంతో ఆయన అక్కడి బాధ్యతలను స్వీకరించలేదని తెలిసింది. వీరికీ బదిలీలుంటాయా? డ్వామా పీడీగా వ్యవహరిస్తున్న నరాల రామచంద్రారెడ్డికి ఇక్కడ మూడేళ్ల సర్వీసు పూర్తరుు్యంది. ఆయన తొలుత హౌసింగ్ పీడీగా పనిచేశారు. రెండేళ్లుగా డ్వామా పీడీగా పనిచేస్తున్నారు. మరోైవె పు జిల్లాకు చెందిన ఎన్వీవీ సత్యనారాయణ కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆయన జిల్లాలోనే ఎస్డీసీగా, అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్డీవోగా పనిచే శారు. ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పని చేస్తున్నారు. ఆయనది సొంత జిల్లా కావడంతో బదిలీ తప్పనిసరి అని భావిస్తున్నారు. నరసాపురం ఆర్డీవోగా పనిచేస్తున్న జె.వసంతరావు (నరసాపురం ఈఆర్వో)కు ఇక్కడ రెండున్నరేళ్ల సర్వీసు పూర్తరుు్యంది. ఆయన ఈ ఏడాది జూన్ నాటికి పదవీ విరమణ చేయనున్నారు. -
బదిలీల బెంగ!
ఎంపీడీవో, తహసీల్దార్లలో కలవరం తాజాగా సెక్షన్ సూపరింటెండెంట్లకూ వర్తింపు కోరుకున్న చోటకు బదిలీకి ఉన్నతస్థాయిలో లాబీయింగ్ కాసులు కురిపించే మండలాలపై ఇతర జిల్లాల అధికారుల కన్ను మరో నాలుగైదు రోజుల్లో బదిలీల పర్వానికి తె ర సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికారులకు బదిలీల బెంగ పట్టుకుంది. మూడేళ్ల పైబడి జిల్లాలో పనిచేస్తున్న పంచాయతీ, రెవెన్యూ అధికారులను కదపాలనే ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు.. వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రెండు రోజులుగా విధులకు డుమ్మా కొడుతున్న అధికారులు... మంత్రుల పేషీలు, కలెక్టరేట్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎన్నికలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్న 21మంది ఎంపీడీవోలు, తహసీల్దార్లను బదిలీ చేయడానికి జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను అటు సీసీఎల్ఏ, ఇటు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు పంపింది. దీంతో సీను ఆయా కార్యాలయాలకు మారింది. కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకునేందుకు తహసీల్దార్లు, ఎంపీడీఓలు లాబీయింగ్ నెరుపుతున్నారు. జోన్‌లోని ఏవేని మూడు జిల్లాలను ఆప్షన్‌గా ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ నిర్దేశించింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో అనువైన మండలాల వె తుకులాటలో పడ్డారు. కమిషనరేట్ కేవలం సంబంధిత జిల్లాకు మాత్రం అధికారులను కేటాయిస్తుంది. సదరు జిల్లా కలెక్టర్ తన విచక్షణాధికారం మేరకు మండలాలకుబదిలీ చేస్తారు. ఈ క్రమంలోనే సచివాలయంలో పైరవీలకు తెరలేచింది. తమకు అనువుగా ఉండే మండలానికి వెళ్లేందుకు తమ పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో బదిలీల ప్రక్రియకు తెరపడే అవకాశమున్న నేపథ్యంలో...తహసీల్దార్లు, ఎంపీడీ వో లు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరోవైపు జిల్లాలో ‘హాట్‌సీట్’లుగా పేరున్న పోస్టులను దక్కిం చుకునేందుకు మన జిల్లాను ఆప్షన్‌గా ఎంచుకు న్న ఇత ర జిల్లాల అధికారులు లాబీయింగ్ జరుపుతున్నారు. గాడ్ఫాదర్ల సహకారంతో లాభసాటి మండలానికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు కోసం సచివాలయ స్థాయిలో పైరవీలు సాగుతున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడి సిఫార్సుతో సీటు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే సరూర్‌నగర్ ఆర్డీవో, శంషాబాద్, మహేశ్వరం, కీసర, మేడ్చల్ మండలాల తహసీల్దార్ల పోస్టులు మంచి రేటు పలుకుతున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా.. సుదీర్ఘకాలంగా జిల్లాలో పనిచేస్తున్న ఎంపీడీవోలు తొలిసారి ఎన్నికల నేపథ్యంలో బదిలీలు అనివార్యం కావడంతో రాజధానికి చేరువలోని జిల్లాల్లో తమకు అనుకూలమైన మండలాల అన్వేషణలో పడ్డారు. కాగా, రెవెన్యూ శాఖలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్లను కూడా బదిలీ చేయాలని ఈసీ నిర్దేశించడంతో ఆయా సెక్షన్ల సూపరింటెండెంట్లు లబోదిబోమంటున్నారు. తమను బదిలీల నుంచి మినహాయించేలా ఈసీకి విన్నవించాలని శనివారం జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్‌ను కలిసి వేడుకున్నారు. ఒకవేళ బదిలీలు అనివార్యమైతే తహసీల్దార్లతో పాటే తమను కూడా ట్రాన్స్ఫర్ చేయాలని కోరారు. ఏకకాలంలో బదిలీలు చేయకపోతే పట్టణ, అనువైన మండలాలు వారి నియామకంతో భర్తీ అవుతాయని, తమకు మారుమూల మండలాలే మిగులుతాయనే ఆవేదనను వ్యక్తం చేశారు. ఏది ఏమైనా అధికారయంత్రాంగానికి బదిలీల జ్వరం పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బదిలీలు తప్పవని తెలిసినప్పటికీ,ఈ సారి ఈసీ మార్గదర్శకాలు కఠినంగా ఉండడం.. కొత్త అధికారులకు వర్తింపజేయడమే యం త్రాంగంలో కలవరానికి దారితీసిందని చెప్పవచ్చు. -
బదిలీలకు రంగం సిద్ధం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో మూడేళ్లు ఒకేచోట పనిచేస్తున్న అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. రెవెన్యూ, పోలీస్‌శాఖ అధికారులతోపాటు ఎంపీడీవోలను కూడా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు జీవో ఎంఎస్ నంబర్ 18న విడుదలైంది. సొంత జిల్లా అధికారులైతే బదిలీపై వచ్చి ఒక్కరోజు విధులు నిర్వర్తించినా ఇతర జిల్లాల అధికారులను నియమించాలని జీవోలో పేర్కొన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు బదిలీకి అవకాశం ఉన్న అధికారుల వివరాలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 66 మంది బదిలీ అయ్యే అవకాశం జిల్లా నుంచి దాదాపు 66 మంది అధికారులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని 31 మంది తహశీల్దార్లతోపాటు జిల్లాలోని ఆయా ప్రధాన హోదాలో ఉన్న 10 మంది పరిపాలన అధికారులు కూడా బదిలీ కానున్నారు. సస్పెన్షన్‌లో ఉన్న నలుగురు తహశీల్దార్ల వివరాలు కూడా ప్రభుత్వానికి పంపారు. అయితే ప్రభుత్వం జోన్ పరిధిలో ఏదో ఒక జిల్లాకు అధికారులను బదిలీ చేయాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 29 మంది ఎంపీడీవోలు ఉన్నారు. వీరిలో ఇద్దరు వచ్చే రెండు నెలల్లో రిటైర్మెంట్ కావాల్సి ఉండగా, మరో ఇద్దరు ఎంపీడీవోలు నూతనంగా విధుల్లో చేశారు. ఆ నలుగురిని మినహాయిస్తే మిగతా 25 మంది ఎంపీడీవోల వివరాలను ప్రభుత్వానికి పంపించారు. జిల్లా నుంచి 41 మంది రెవెన్యూ అధికారులు, 25 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు జిల్లా అధికారుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు రెండు రోజుల్లో వెలువడనున్నట్లు సమాచారం. అధికారుల బదిలీలు ఫిబ్రవరి 10లోగా పూర్తి చేయాలని ఇటీవల ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే జిల్లా నుంచి వేరే జిల్లాకు బదిలీ అయినా తరువాత ఎన్నికల అనంతరం ఇదే జిల్లాకు బదిలీ చేయించుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. -
తప్పదు బదిలీ!
మూడేళ్లు పైబడి పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దీర్ఘకాలికంగా జిల్లాలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మూడేళ్లకు పైబడి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న రెవెన్యూ, పోలీసు యంత్రాంగాన్ని కదలించేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఈ మేరకు రెండు రోజులుగా ఏళ్లుగా పనిచే స్తున్న అధికారుల జాబితాను జిల్లా యంత్రాంగం రూపొందించింది. ఎన్నికల విధులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులనే బదిలీలకు పరిమితం చేసిన ఎన్నికల సంఘం ఈ సారి మాత్రం క్షేత్రస్థాయి అధికారులకు కూడా స్థానచలనం కలిగించాలని ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లపై ఇదివరకే మార్గదర్శకాలు జారీచేసిన ఈసీ.. తాజాగా సబ్ ఇన్స్పెక్టర్లను కూడా బదిలీల జాబితాలో చేర్చింది. ఈ మేరకు రెండు రోజుల్లో జాబితాను పంపాలని నిర్దేశించింది. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ భన్వర్‌లాల్ నిర్ణయాన్ని వెల్లడించడంతో బదిలీల ప్రక్రియకు తెరలేచింది. వేర్వేరు పోస్టింగ్‌ల్లో పనిచేసినప్పటికీ, జిల్లాలో మూడేళ్లు పనిచేసినవారిపై బదిలీ వేటు వేయాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 17 మంది తహసీల్దార్లను ఎన్నికల వేళ ఇతర ప్రాంతాలకు సాగనంపేందుకు రంగం సిద్ధమైంది. రాజేంద్రనగర్ డిప్యూటీ కలెక్టర్ ముకుందరెడ్డి, సరూర్‌నగర్ ఆర్డీఓ సూర్యారావు కూడా బదిలీల జాబితాలో ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ) బదిలీ వ్యవహారంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎంపీడీఓల వ్యవహారంలో ఎలా నడుచుకోవాలనే అంశంపై ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీచేస్తామని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకనుగుణంగా నడుచుకోవాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల క్రతువు మొదలుకానుందనే సంకేతాల నేపథ్యంలో అధికారులు వడివడిగా ఎన్నికల ఏర్పాట్లను చేపడుతున్నారు. రెవెన్యూ అధికారుల బదిలీల జాబితాను కొలిక్కి తెచ్చిన యంత్రా ంగం.. పోలీసుల జాబితాను పంపాలని హోంశాఖకు సూచించింది. జిల్లా యూ నిట్ ప్రామాణికంగా బదిలీల పరంపర కొనసాగిస్తున్నందున.. సైబరాబాద్ కమిషనరేట్, రంగారెడ్డి గ్రామీణ ఎస్పీ పరిధిలో మూడో వంతు అధికారులకు స్థానభ్రంశం కలుగనుంది. బదిలీల జాబి తాలో సీఐ, ఎస్ఐలు కూడా ఉండడంతో సైబరాబాద్, రూరల్ ఎస్పీ పరిధిలోని సింహాభాగం పోలీసు అధికారుల కుర్చీలకు ఎసరు వచ్చింది. ఎన్నికల సంఘం తొలిసారి సబ్ ఇన్స్పెక్టర్లను చేర్చడంతో పోలీసుశాఖలో కలవరం మొదలైంది. -
కరెంట్ ఆఫీస్‌లో రచ్చ
=నిషేధ సమయంలో బదిలీల ఉత్తర్వులు =అత్యవసరం లేకున్నా నలుగురు ఏఈలకు స్థానచలనం =నిబంధనలకు విరుద్ధమంటున్న యూనియన్ల నేతలు =హెచ్ఆర్డీ విభాగం అధికారులతో వాగ్వాదం =సీఎండీకి ఫిర్యాదు చేయూలని నిర్ణయం వరంగల్, న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో బదిలీలాట నడుస్తోంది. సాధారణ బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ... విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం హన్మకొండలోని కంపెనీ కార్యాలయంలో ‘రచ్చ’కు తెరలేపింది. అత్యవసరం కాకున్నప్పటికీ... నలుగురు ఏఈలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఇంజినీరింగ్ అసోసియేషన్‌తో సంబంధాలున్న యూనియన్లు మండిపడ్డారుు. గురువారం నుంచి విడతల వారీగా శుక్రవారం రాత్రి వరకు యూనియన్ల నేతలు పలువురు కంపెనీ కార్యాలయ హెచ్ఆర్డీ విభాగం అధికారులతో వాగ్వాదానికి దిగారు. హెచ్ఆర్డీ సీజీఎం సురేందర్ ఎదుట బైఠాయించారు. పలు ఆరోపణలతో కంపెనీ కార్యాలయానికి సరెండర్ చేసిన ఓ ఏఈని ఆరు నెలలు గడవక ముందే మళ్లీ ఆపరేషన్ సర్కిల్‌కు బదిలీ చేయడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎండీ లేని సమయంలో... వారం రోజుల పాటు ఫైల్‌ను దగ్గర పెట్టుకుని హెచ్ఆర్డీ విభాగం అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పించారు. ఓ అసోసియేషన్ నేత ఒత్తిడికి భయపడి... ఈ బదిలీలు చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ బదిలీలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. సీజీఎం సురేందర్ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో సీఎండీకి ఫిర్యాదు చేయూలని నిర్ణరుుంచుకున్నారు. ఇదిలా ఉండగా... ఈ అంశం విద్యుత్ శాఖ ఉద్యోగుల జేఏసీ దాకా వెళ్లింది. దీనిపై వారు శనివారం ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు సమాచారం. అసలేం జరిగిందంటే... విద్యుత్ శాఖలో నలుగురు ఏఈలను ఆకస్మికంగా బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యూరుు. ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలోని ప్రాజెక్ట్ వింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏఈ మహేందర్‌రెడ్డిని వరంగల్ ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈకి, పీఅండ్ ఓఎన్ఎం విభాగంలో ఉన్న కిరణ్ చైతన్యను వరంగల్ ఆపరేషన్ సర్కిల్‌కు, ఎస్ఈ కార్యాలయంలో కమర్షియల్ సెక్షన్లో పనిచేస్తున్న శైలేంద్ర కుమార్‌ను అక్కడ నుంచి తొలగించి ఆపరేషన్ సర్కిల్ (రూరల్ వింగ్)కు, ఆదిలాబాద్ ఎస్ఈ కమర్షియల్ సెక్షన్ ఏఈని ఆపరేషన్ సర్కిల్‌కు బదిలీ చేస్తూ ఫ్యాక్స్ ఉత్తర్వులిచ్చారు. అరుుతే గతంలో ఆరోపణలు రుజువు కావడంతో ఆరు నెలల క్రితం కార్పొరేట్ కంపెనీ కార్యాలయానికి సరెండర్ చేసిన ఏఈని... ఆపరేషన్ సర్కిల్‌కు మార్చడం వివాదాస్పదంగా మారింది. నిబంధనల ప్రకారం సరెండర్ చేసిన ఏఈ... అధికారుల పర్యవేక్షణలో కంపెనీ కార్యాలయంలో విధులు నిర్వర్తించాలి. కానీ.. ఆరు నెలలు కూడా కాకముందే మరో సర్కిల్‌కు బదిలీ చేయడంపై పలు యూనియన్ల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వరంగల్ ఆపరేషన్ సర్కిల్లో రూరల్ పోస్టు అప్పగించే ప్రయత్నాల్లో భాగంగా ఈ బదిలీ చేసినట్లు ఆరోపిస్తున్నారు. 18న ఫైల్... 26న బదిలీ ఉత్తర్వులు ఏఈల బదిలీ కోసం హెచ్ఆర్డీ విభాగం అంతకు ముందు సీఎండీ కార్తికేయ మిశ్రాకు ఫైల్ పెట్టారు. ఈ నెల 18న పరిశీలించిన ఆయన దీనికి సంబంధిత కార్యాలయాల నుంచి ఎలాంటి నోట్ ఫైల్ లేకపోవడం... బదిలీ చేయాల్సిన విషయాలపై స్పష్టత లేకపోవడంతో పెండింగ్ పెట్టారు. ఆ తర్వాత హెచ్ఆర్డీ డెరైక్టర్, ఉన్నతాధికారులకు ఈ ఫైల్‌ను పంపించారు. అప్పటినుంచి సీఎండీ పలు కారణాలతో అందుబాటులో లేరు. ఈ క్రమంలో 26వ తేదీన హెచ్ఆర్డీ విభాగం నుంచి ఏఈల బదిలీ ఫైల్ కదిలింది. బదిలీ అరుున ఏఈలంతా విద్యుత్ సంస్థలోని ఆయూ యూనియన్లలో కీలకంగా ఉన్న వారే. వారి బదిలీ వెనుక ఓ ఆసోసియేషన్ నేత బలంగా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. కాగా, ఈ అంశానికి సంబంధించి ఎన్పీడీసీఎల్ హెచ్ఆర్డీ డెరైక్టర్ జాన్ ప్రకాష్‌రావును సంప్రదించగా... ‘ఆపరేషన్ సర్కిల్లో ఖాళీలుండడంతోనే కంపెనీ కార్యాలయం నుంచి ఏఈలను బదిలీ చేశాం. వారిని ఎక్కడ వినియోగించుకోవాలనేది ఎస్ఈ నిర్ణరుుస్తారు.’ అని అన్నారు.