=నిషేధ సమయంలో బదిలీల ఉత్తర్వులు
=అత్యవసరం లేకున్నా నలుగురు ఏఈలకు స్థానచలనం
=నిబంధనలకు విరుద్ధమంటున్న యూనియన్ల నేతలు
=హెచ్‌ఆర్‌డీ విభాగం అధికారులతో వాగ్వాదం
=సీఎండీకి ఫిర్యాదు చేయూలని నిర్ణయం
వరంగల్, న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో బదిలీలాట నడుస్తోంది. సాధారణ బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ... విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం హన్మకొండలోని కంపెనీ కార్యాలయంలో ‘రచ్చ’కు తెరలేపింది. అత్యవసరం కాకున్నప్పటికీ... నలుగురు ఏఈలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఇంజినీరింగ్ అసోసియేషన్‌తో సంబంధాలున్న యూనియన్లు మండిపడ్డారుు.
గురువారం నుంచి విడతల వారీగా శుక్రవారం రాత్రి వరకు యూనియన్ల నేతలు పలువురు కంపెనీ కార్యాలయ హెచ్‌ఆర్‌డీ విభాగం అధికారులతో వాగ్వాదానికి దిగారు. హెచ్‌ఆర్‌డీ సీజీఎం సురేందర్ ఎదుట బైఠాయించారు. పలు ఆరోపణలతో కంపెనీ కార్యాలయానికి సరెండర్ చేసిన ఓ ఏఈని ఆరు నెలలు గడవక ముందే మళ్లీ ఆపరేషన్ సర్కిల్‌కు బదిలీ చేయడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సీఎండీ లేని సమయంలో... వారం రోజుల పాటు ఫైల్‌ను దగ్గర పెట్టుకుని హెచ్‌ఆర్‌డీ విభాగం అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పించారు.
ఓ అసోసియేషన్ నేత ఒత్తిడికి భయపడి... ఈ బదిలీలు చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ బదిలీలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. సీజీఎం సురేందర్ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో సీఎండీకి ఫిర్యాదు చేయూలని నిర్ణరుుంచుకున్నారు. ఇదిలా ఉండగా... ఈ అంశం విద్యుత్ శాఖ ఉద్యోగుల జేఏసీ దాకా వెళ్లింది. దీనిపై వారు శనివారం ఉన్నతాధికారులతో చర్చించనున్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే...
విద్యుత్ శాఖలో నలుగురు ఏఈలను ఆకస్మికంగా బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యూరుు. ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలోని ప్రాజెక్ట్ వింగ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏఈ మహేందర్‌రెడ్డిని వరంగల్ ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈకి, పీఅండ్ ఓఎన్‌ఎం విభాగంలో ఉన్న కిరణ్ చైతన్యను వరంగల్ ఆపరేషన్ సర్కిల్‌కు, ఎస్‌ఈ కార్యాలయంలో కమర్షియల్ సెక్షన్‌లో పనిచేస్తున్న శైలేంద్ర కుమార్‌ను అక్కడ నుంచి తొలగించి ఆపరేషన్ సర్కిల్ (రూరల్ వింగ్)కు, ఆదిలాబాద్ ఎస్‌ఈ కమర్షియల్ సెక్షన్ ఏఈని ఆపరేషన్ సర్కిల్‌కు బదిలీ చేస్తూ ఫ్యాక్స్ ఉత్తర్వులిచ్చారు. అరుుతే గతంలో ఆరోపణలు రుజువు కావడంతో ఆరు నెలల క్రితం కార్పొరేట్ కంపెనీ కార్యాలయానికి సరెండర్ చేసిన ఏఈని... ఆపరేషన్ సర్కిల్‌కు మార్చడం వివాదాస్పదంగా మారింది.
నిబంధనల ప్రకారం సరెండర్ చేసిన ఏఈ... అధికారుల పర్యవేక్షణలో కంపెనీ కార్యాలయంలో విధులు నిర్వర్తించాలి. కానీ.. ఆరు నెలలు కూడా కాకముందే మరో సర్కిల్‌కు బదిలీ చేయడంపై పలు యూనియన్ల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వరంగల్ ఆపరేషన్ సర్కిల్‌లో రూరల్ పోస్టు అప్పగించే ప్రయత్నాల్లో భాగంగా ఈ బదిలీ చేసినట్లు ఆరోపిస్తున్నారు.
18న ఫైల్... 26న బదిలీ ఉత్తర్వులు
ఏఈల బదిలీ కోసం హెచ్‌ఆర్‌డీ విభాగం అంతకు ముందు సీఎండీ కార్తికేయ మిశ్రాకు ఫైల్ పెట్టారు. ఈ నెల 18న పరిశీలించిన ఆయన దీనికి సంబంధిత కార్యాలయాల నుంచి ఎలాంటి నోట్ ఫైల్ లేకపోవడం... బదిలీ చేయాల్సిన విషయాలపై స్పష్టత లేకపోవడంతో పెండింగ్ పెట్టారు. ఆ తర్వాత హెచ్‌ఆర్‌డీ డెరైక్టర్, ఉన్నతాధికారులకు ఈ ఫైల్‌ను పంపించారు. అప్పటినుంచి సీఎండీ పలు కారణాలతో అందుబాటులో లేరు. ఈ క్రమంలో 26వ తేదీన హెచ్‌ఆర్‌డీ విభాగం నుంచి ఏఈల బదిలీ ఫైల్ కదిలింది. బదిలీ అరుున ఏఈలంతా విద్యుత్ సంస్థలోని ఆయూ యూనియన్లలో కీలకంగా ఉన్న వారే. వారి బదిలీ వెనుక ఓ ఆసోసియేషన్ నేత బలంగా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. కాగా, ఈ అంశానికి సంబంధించి ఎన్పీడీసీఎల్ హెచ్‌ఆర్‌డీ డెరైక్టర్ జాన్ ప్రకాష్‌రావును సంప్రదించగా... ‘ఆపరేషన్ సర్కిల్‌లో ఖాళీలుండడంతోనే కంపెనీ కార్యాలయం నుంచి ఏఈలను బదిలీ చేశాం. వారిని ఎక్కడ వినియోగించుకోవాలనేది ఎస్‌ఈ నిర్ణరుుస్తారు.’ అని అన్నారు.
కరెంట్ ఆఫీస్‌లో రచ్చ
Published Sat, Dec 28 2013 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement