ఏలూరు, న్యూస్‌లైన్:
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులకు బదిలీల జ్వరం పట్టుకుంది. ఎన్నికల నిర్వహణతో సంబంధమున్న అధికారులు మూడేళ్లుగా ఇదే జిల్లాలో పనిచేస్తుంటే బదిలీ చేయూలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈనెల 10వ తేదీ నాటికి అధికారులకు బదిలీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఈఆర్‌వో)గా వ్యవహరిస్తున్న జిల్లాస్థారుు అధికారులకు బదిలీలు ఉంటాయూ, ఉండవా అన్న విషయం చర్చనీయూంశంగా మారింది. జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఈఆర్‌వోలుగా వ్యవహరిస్తున్న అధికారులు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యే అవకాశం లేకపోలేదని కలెక్టరేట్ వర్గాలు భావిస్తున్నారుు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ఎస్డీసీ డీవీఆర్‌ఎల్‌ఆర్‌ఎం యల్లారమ్మ (నిడదవోలు ఈఆర్‌వో), ఇందిరాసాగర్ యూనిట్-2 ఎస్డీసీ జీవీఎస్‌ఎస్ నాగలక్ష్మి (పాలకొల్లు ఈ ఆర్‌వో), డ్వామా అదనపు ప్రాజెక్టు డెరైక్టర్ సీహెచ్.వెంకటేశ్వరరావు (భీమవరం ఈ ఆర్‌వో), జంగారెడ్డిగూడెం ఆర్డీవో వి.నాన్‌రాజు (గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల ఈఆర్‌వో), డీఆర్‌డీఏ పీడీ వై.రామకృష్ణ(చింతలపూడి ఈఆర్‌వో)లకు బదిలీ ఉండొచ్చంటున్నారు. ఈ ఐదుగురిలోనూ యల్లారమ్మ, వి.నాన్‌రాజు, సీహెచ్ వెంకటేశ్వరరావు ఈ జిల్లాకు చెందిన వారే. ఇటీవల మైక్రో ఇరిగేషన్ పీడీ ఆర్‌వీ సూర్యనారాయణను ఐటీడీఏ పీవోగా బదిలీ చేశారు. ఇదే సందర్భంలో ఆయనను గోపాలపురం ఈఆర్‌వోగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విధుల్లో చేరటానికి సాంకేతిక ఇబ్బందులు రావడంతో ఆయన అక్కడి బాధ్యతలను స్వీకరించలేదని తెలిసింది.
వీరికీ బదిలీలుంటాయా?
డ్వామా పీడీగా వ్యవహరిస్తున్న నరాల రామచంద్రారెడ్డికి ఇక్కడ మూడేళ్ల సర్వీసు పూర్తరుు్యంది. ఆయన తొలుత హౌసింగ్ పీడీగా పనిచేశారు. రెండేళ్లుగా డ్వామా పీడీగా పనిచేస్తున్నారు. మరోైవె పు జిల్లాకు చెందిన ఎన్‌వీవీ సత్యనారాయణ కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆయన జిల్లాలోనే ఎస్డీసీగా, అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్డీవోగా పనిచే శారు. ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పని చేస్తున్నారు. ఆయనది సొంత జిల్లా కావడంతో బదిలీ తప్పనిసరి అని భావిస్తున్నారు. నరసాపురం ఆర్డీవోగా పనిచేస్తున్న జె.వసంతరావు (నరసాపురం ఈఆర్‌వో)కు ఇక్కడ రెండున్నరేళ్ల సర్వీసు పూర్తరుు్యంది. ఆయన ఈ ఏడాది జూన్ నాటికి పదవీ విరమణ చేయనున్నారు.
బదిలీల జ్వరం
Published Sat, Feb 8 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement