mangari rajendar
-
న్యాయమూర్తుల అనవసర బదిలీలు
ఉద్యోగస్తులకి బదిలీలు సర్వ సామాన్యం. ఆరోపణలు వచ్చినా, మూడు సంవత్సరాలు గడిచినా ఆ ఉద్యోగిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతా నికి బదిలీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకన్నా న్యాయమూర్తుల బదిలీలు క్రమబద్ధంగా జరు గుతూ ఉంటాయి. ప్రతి సంవ త్సరం ఏప్రిల్, మే నెలల్లో ఈ బదిలీలు తప్పక జరుగు తాయి. కోవిడ్–19 వచ్చిన తరువాత ఈ బదిలీల విష యంలో ప్రభుత్వాలు వెనుకంజ వేశాయి. కేంద్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థలు ఈ వార్షిక బదిలీలని నిలిపివేశాయి. మనదేశంలోని చాలా హైకోర్టులు కూడా ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించాయి. అందులో ముఖ్యమైనవి తెలంగాణ, బాంబే, అలహా బాద్, మద్రాస్, మధ్యప్రదేశ్, కేరళ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. కరోనా తీవ్రత లేని రాష్ట్రాలు కూడా ఈ సంవత్సరం సాధారణ బదిలీలను నిలిపివేశాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం న్యాయమూర్తులను బదిలీలు చేసింది. ఆ హైకోర్టు ఇన్చార్జ్ న్యాయ మూర్తులను బదిలీలు చేసింది. ఆ హైకోర్టు ఇన్చార్జ్ రిజిస్ట్రార్ జనరల్ బి.రాజశేఖర్ ఈ మధ్య గుండెపోటుతో మరణించారు. పని ఒత్తిడి వల్ల మరణించినాడని, కోవిడ్ వల్ల మర ణించాడని వార్తలు విన్పిస్తున్నాయి. అందులో ఏది వాస్తవమో మనకు తెలియదు. కరోనా విజృంభిస్తున్నవేళ, కోర్టులే వర్చువల్ కోర్టులుగా పనిచేస్తున్న సందర్భంలో న్యాయమూర్తుల బదిలీలు అవసరమా అన్న ప్రశ్నని చాలామంది న్యాయమూర్తులు, న్యాయవాదులు, వెలి బుచ్చుతున్నారు. కొన్ని మాసాలపాటు కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు వున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి. లాక్‌డౌన్‌వల్ల, కొత్త పద్ధతులకి, న్యాయ మూర్తులు, సిబ్బంది అలవాటు పడే పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త వాతావరణానికి న్యాయమూర్తులు, సిబ్బంది ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ఈ వాతావర ణంలో కోర్టులో కేసుల పరిష్కారం, కుటుంబ బాధ్యత, పిల్లల చదువు, ఆరోగ్యం లాంటి అంశాలతో న్యాయ మూర్తులు తల్లడిల్లుతున్నారు. ఈ దశలో న్యాయమూర్తులకి బదిలీలు వాళ్లని తెలియని ఒత్తిడికి గురిచేస్తాయి. కరోనా కాలంలో కొత్త ప్రాంతానికి వెళ్లడం, అక్కడ సర్దుబాటు కావడం సులువైన విషయం కాదు. సామాను సర్దుకోవడం చాలా కష్టమైన పని. దానికి పనివాళ్ళ సహాయం కావాలి. ప్యాకర్స్, మూవర్స్ అవసరం ఏర్పడుతుంది. కూరగాయలనే కడు గుతున్న కాలంలో సామానుని ఒక ఊరి నుంచి మరో ఊరికి తరలించడం కష్టసాధ్యమైన పని. లగేజీకి, అంటు వ్యాధి సంక్రమించకుండా చూసుకోవడం చాలా కష్టమైన పని. పిల్లల చదువూ, ఆరోగ్యం, తల్లిదండ్రుల బాధ్యత మధ్య న్యాయమూర్తులు సతమతమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత ఒత్తిడిలో ఉన్న న్యాయమూర్తులు తన విధు లని ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్నని చాలామంది విజ్ఞులు లేవనెత్తుతున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా న్యాయ మూర్తులు నోరు విప్పరు. అలాంటి క్రమశిక్షణ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళ అసోసియేషన్స్ కూడా మాట్లాడటానికి జంకుతారు. మిగతా ఉద్యోగులు వేరు. న్యాయమూర్తులు వేరు. కిందికోర్టు న్యాయమూర్తులని అనవసర బదిలీల ద్వారా, అసౌకర్య బదిలీల ద్వారా బలిపశువులని చేస్తూ ఉంటారని సుప్రీంకోర్టు మింటూ మాలిక్ కేసులో (హైకోర్టు ఆఫ్ కలకత్తా వర్సెస్ మింటూ మాలిక్ మరియు ఇతరులు, స్పెషల్ లీవ్ పిటిషన్ (సివిల్) నెం. 24240/2019, తీర్పు తేదీ నవంబర్ 15, 2019) అభిప్రా యపడింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, బి.ఆర్. గవాయ్‌లు ఈ తీర్పుని వెలువరించారు. న్యాయమూర్తులని బలిపశువులు చేసే విషయంలో సుప్రీంకోర్టు తన ఆందోళనని ఈ తీర్పులో వెలువ రించింది. ఈ కేసులో ఒక రైల్వే మేజిస్ట్రేట్‌ని నిర్బంధంగా పదవీ విరమణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులని ఆ న్యాయమూర్తి కలకత్తా హైకోర్టులో సవాలు చేశాడు. ఆ న్యాయమూర్తిని తిరిగి విధుల్లో చేర్చుకోవా లని హైకోర్టులోని డివిజన్ బెంచ్ హైకోర్టుని ఆదేశిం చింది. అతను చేసిన చర్యలో చెడు నడవడిక లేదని సదు ద్దేశంతో అతను ఆ చర్యను చేశాడని హైకోర్టు అభి ప్రాయపడింది. ఆ మేజిస్ట్రేట్ ప్రయాణం చేసే రైలు తరచూ ఆల స్యంగా రావడానికి కారణం అనవసరంగా కొన్ని ప్రదే శాల్లో ఆపి, చట్ట వ్యతిరేకంగా కొన్ని వస్తువులని దింపడం. తన అధికార పరిధిలో చట్ట వ్యతిరేక పనులు జరగడం పట్ల ఆందోళన చెంది అతను ఆ రైల్వే ఉద్యోగుల మీద చర్య తీసుకుంటాడు. ఈ విషయం మీద హైకోర్టు విచా రణ జరిపి అతన్ని సస్పెండ్ చేసి, నిర్బంధంగా పదవీ విరమణకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ ఆదేశాలను అతను హైకోర్టులో సవాలు చేస్తే, అతన్ని తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని అదేవిధంగా లక్ష రూపాయలు అతనికి ఖర్చుల కింద ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ హైకోర్టునే ఆదేశించింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ఇలా అభిప్రాయపడింది. ఈ రోజుల్లో న్యాయమూర్తులని బలిచేసే ట్రెండ్ ఒకటి మొదలైంది. అనవసర బదిలీల ద్వారా మరో విధమైన చర్యల ద్వారా న్యాయమూర్తుల మీద చర్యలు తీసుకుంటున్నారు. న్యాయమూర్తులకి వ్యతిరేకంగా న్యాయవాదులు గానీ, ఇతరులు కానీ ధర్నాలు చేస్తే చాలు.. వారిని బది లీలు చేస్తున్నారు. అదేవిధంగా చర్యలు తీసుకుంటు న్నారు. న్యాయమూర్తుల తప్పు ఎంతవుందన్న ఆ విష యాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. సాధారణ బదిలీల విషయంలో మింటూ మాలిక్ కేసులో మాదిరిగా చెడు నడవడిక, ధర్నాల ప్రస్తావన వుండదు. అలాంటి కేసులు ఒకటి అరా ఉండవచ్చేమో తెలియదు. కానీ, ఇవి ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగే ప్రక్రియ. ఈ కోవిడ్–19 కాలంలో అన్ని హైకోర్టుల మాదిరిగా బదిలీలను నిలిపివేస్తే న్యాయమూర్తులు అసౌక ర్యానికి, వేదనకి గురికాకుండా ఉంటారు. వ్యాసకర్త, మంగారి రాజేందర్ -
జీరో ఎఫ్ఐఆర్ ఎప్పుడు, ఎలా?
‘దిశ’ సంఘటన తరువాత ‘జీరో’ ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) గురించిన చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతోంది. తమకు అధికార పరిధి లేదన్న కారణంగా పోలీసులు ఎఫ్ఐఆర్ని తీసుకోలేదని ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో జీరో ఎఫ్ఐఆర్ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. నేర సమాచారం అందిన వెంటనే చట్టప్రకారం కేసు నమోదు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలు పోలీసులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం ఈ విషయం గురించి సర్క్యులర్ని కూడా జారీ చేసింది. తమకు కేసుని దర్యాప్తు చేసే అధికార పరిధి లేకున్నా ఎఫ్ఐఆర్ని విడుదల చేయాలన్నది ‘జీరో ఎఫ్ఐఆర్’ సారాంశం. నేర తీవ్రత ఎక్కువగా ఉండి, వారెంట్ అవసరం లేకుండానే అరెస్టు చేయగలిగే కేసుల్లో (కాగ్నిజబుల్) నేర సమాచారం అందుకున్న తరువాత పోలీసులు తమ అధికార పరిధితో నిమిత్తం లేకుండా ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాలని, ఆ విధంగా చేయకపోతే వాళ్లపై భారతీయ శిక్షాస్మృతి లోని సె.166ఏ ప్రకారం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సెప్టెంబర్ 19, 2019 రోజున కర్ణాటక పోలీసులని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కాగ్నిజబుల్ నేర సమాచారం అందినప్పుడు పోలీసులు (155లోని) తమ అధికార పరిధితో నిమిత్తం లేకుండా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. పోలీసులు తమ కోర్టు అధికార పరిధిలోని కేసులనే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.156(1) చెబుతుంది. అందుకని తమ అధికార పరిధిలేని కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ విడుదల చేసిన తరువాత, మొత్తం కేసు డైరీని తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత పోలీసులకి పంపించాల్సి ఉంటుంది. జీరో ఎఫ్ఐఆర్ భావన డిసెంబర్ 2012 సంవత్సరంలో ఢిల్లీలో నిర్భయ సంఘటన తరువాత ఈ జీరో ఎఫ్ఐఆర్ అన్న పదబంధం తెరమీదికి వచ్చింది. ఆ సంఘటన జరిగిన తరువాత నియమించిన జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికలో ఈ భావనని ప్రతిపా దించింది. కేసుని దర్యాప్తు చేసే అధికార పరిధి లేని పోలీసు అధికారి కాగ్నిజబుల్ నేర సమాచారం అందుకుని ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయడాన్ని ఇప్పుడు కొత్తగా జీరో ఎఫ్ఐఆర్ అని అంటున్నారు. నేరం ఎక్కడ జరిగినా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో పోలీసులు ప్రథమ సమాచారాన్ని ఇవ్వవచ్చు. బాధితుల సౌకర్యం కోసం ఈ భావ నని తీసుకొని వచ్చారు. ఇది చట్టంలో ఉన్న విష యమే. లైంగిక నేరాలకు సంబంధించిన సమా చారం అందుకుని పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ విడుదల చేయకపోతే వాళ్లు భారతీయ శిక్షాస్మృతిలోని సె.166ఏ ప్రకారం నేరం చేసినట్లు అవుతుంది. అది కాగ్నిజబుల్ నేరం. మహిళల మీద నేరాలు జరిగినప్పుడు వాళ్లు తమకు దగ్గరలో ఉన్న స్టేషన్లో ప్రథమ సమాచారం ఇచ్చే వీలు చిక్కుతుంది. అదే విధంగా హత్య, ఆక్సిడెంట్ లాంటి నేరాలు జరిగినప్పుడు జీరో ఎఫ్ఐఆర్ విడుదల చేయడంవల్ల సాక్షులను కాపాడటానికి వీలుపడుతుంది. క్రిమినల్ ప్రొసీ జర్ కోడ్‌లోని సె.156(1) ప్రకారం తన అధికార పరిధిలోని కేసులనే దర్యాప్తు చేసే అధికారం పోలీ సులకి ఉంటుంది. అదే నిబంధనలోని సబ్ సెక్షన్ (2) ప్రకారం–పోలీసులు దర్యాప్తు చేయడానికి అధికార పరిధి లేదన్న కారణంగా, ప్రశ్నించే అవ కాశం లేదు. సె.156(3) ప్రకారం నేరాన్ని సె.190 ప్రకారం గుర్తించే అధికారం ఉన్న మేజిస్ట్రేట్ దర్యాప్తుని ఆదేశించవచ్చు. దర్యాప్తు తరువాత తనకి అధికార పరిధి లేదన్న అభిప్రాయానికి పోలీసు అధికారి వచ్చిన ప్పుడు కేసు డైరీని సంబంధిత పోలీసులకి పంపిం చవచ్చు. అంతేకానీ ఎఫ్ఐఆర్ని నమోదు చేయ డానికి నిరాకరించకూడదు. దిశ కేసులో పోలీసులు అధికార పరిధి లేదన్న కారణంగా ఎఫ్ఐఆర్ని విడుదల చేయకపోవడంతో వాళ్లని సస్పెండ్ చేశా రని పత్రికల్లో చూశాం. ఒకవేళ ఆ ఆరోపణ నిజ మైతే వాళ్లు శాఖాపరమైన చర్యలకే కాదు.. భార తీయ శిక్షాస్మృతిలోని సె.166ఏ ప్రకారం కూడా శిక్షార్హులే. జీరో ఎఫ్ఐఆర్వల్ల ఉపయోగాలతో బాటూ నష్టాలూ ఉన్నాయి. కొంతమంది ఈ భావ నని దుర్వినియోగం చేయడంవల్ల బాధితులకి నష్టం కలుగుతుంది. కొంతమంది దురుద్దేశంతో తమ ప్రయోజనాలకి అనుగుణంగా కేసు విషయా లను ప్రథమ సమాచార నివేదికలో పొందుపరిచి, తమకు అనుకూలంగా ఉన్న పోలీసులతో కుమ్మక్కై బాధితులకి నష్టం కలుగజేసే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితిని పై అధికారులు సరిచేసే అవ కాశం ఉంది. కోర్టులు కూడా సరిచేయవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ భావనని తీసుకొని తమకు అనుకూ లంగా పోలీసు స్టేషన్లలో కేసులని నమోదు చేయిం చుకొని దుర్వినియోగంచేసే అవకాశం ఉంది. హత్య, అత్యాచారం లాంటి కేసుల విష యంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. మిస్సింగ్ కేసులని కూడా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. జీరో ఎఫ్ఐఆర్ చట్టబద్ధం. 1976లోనే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పకుండా అధికార పరిధితో నిమిత్తం లేకుండా విడుదల చేయాలని చెప్పింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.154 ఇదే విష యాన్ని చెబుతుంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా పోలీసులు ఈ విషయాన్ని గుర్తించకపోవడం బాధని కలుగజేస్తుంది. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా వాళ్లకే తెలి యాలి. కనీసం నిర్భయ ఘటన తరువాతైనా ఈ విషయాన్ని పట్టించుకోక పోవడం శోచనీయం. దిశ సంఘటన తరువాత అలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగవని ఆశిద్దాం. వ్యాసకర్త, మంగారి రాజేందర్, మొబైల్ : 94404 83001 -
గాలింపు చర్యలు–న్యాయబద్ధత
సందర్భం ఒక రాష్ట్రానికి చెందిన పోలీసులు వేరే రాష్ట్రాలలో సోదాలు, గాలింపులు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. స్పెషల్ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు ఈ గాలింపు చర్యలు చేపట్టడం మరింత ఆందోళనకరం. నేరాలను అదుపు చేయడం, నేరాలను కను గొనడం, ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన సమాచా రాన్ని సేకరించడం పోలీ సుల ప్రాథమిక విధి. పోలీసు చట్టం 1861 చెబుతున్నది ఇదే. కానీ కాలక్రమేణా పోలీసుల విధుల్లో మౌలికమైన మార్పు చోటు చేసుకున్నది. వీఐపీల బందోబస్తు ఇప్పుడు ప్రధానమైన పోలీసు విధిగా మారిపోయింది. పోలీసు చట్టం, 1861లోని సె. 23, 24, 31 పోలీసుల విధుల గురించి చెబు తుంది. ఈ విధుల్లో నిర్లక్ష్యం చూపిన అధికారులు అదే చట్టంలోని సె.29 ప్రకారం శిక్షార్హులు. కానీ అలా శిక్ష పడిన సంఘటన ఒక్కటీ కన్పించదు. కస్టడీలో హింస, మరణాలు, చిత్రహింసలు ‘రూల్ ఆఫ్ లా’కు చెంపపెట్టులాంటివి. సుప్రీం కోర్టు (డి.కె. బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్‌బెంగాల్, ఏ.ఐ.ఆర్. 1997 సుప్రీంకోర్టు 610) కేసులో పోలీ సుల అధికార దుర్వినియోగాన్ని ఏ విధంగా నిరో ధించాలి అన్న ప్రశ్న వేసి రెండు రక్షణలను పేర్కొంది. 1.వారి చర్యల్లో పారదర్శకత. 2. ఆ చర్య లకు జవాబుదారీ వహించమనడం. ఈ రెండు రక్ష ణలు పాటిస్తున్న దాఖలాలు కన్పించడం లేదు. పోలీస్ వ్యవస్థను సేవా సంస్థగా కాకుండా ఒక శక్తిగా మాత్రమే బ్రిటిష్ వాళ్లు మనదేశంలో రూపొం దించారు. మన దేశ ప్రజలను, వారి స్వేచ్ఛను అణగ దొక్కడానికి మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగిం చారు. వ్యక్తుల స్వేచ్ఛను, హక్కులను పరిరక్షించవల సిన బాధ్యత పోలీసులపై ఉందని వాళ్లు మన పోలీ సులకు తెలియనివ్వలేదు. స్వాతంత్య్ర పోరాటా లను అణగదొక్కడానికే పోలీసు వ్యవస్థ వాళ్లకు ఉప యోగపడింది. పోలీసు ఉద్యోగాలకు శారీరక దారు ఢ్యం లాంటి అంశాలకే ఎక్కువ ప్రాముఖ్యతని చ్చారు. క్రమశిక్షణ అన్నది పరేడ్‌గ్రౌండ్ నుంచి మాత్రమే వస్తుందన్న భ్రమ కల్గించారు. తమకు ఎదురుగా వచ్చిన వ్యక్తి తమ శత్రువు అన్న భావనని వాళ్లకు కల్పించారు. సాయుధ దళాల మాదిరిగా వాళ్లకి ఖాకీ డ్రస్ ఇచ్చారు. తాము కూడా శక్తి అన్న భావననే పోలీసులకి బ్రిటీష్ వాళ్లు కల్గించారు. ఆ భావన స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పోలీసుల్లో కొనసాగుతుంది. ప్రాథమిక, మానవ హక్కుల గురించి, పోలీసులకి శిక్షణని ఇస్తున్నప్పటికీ, తాము చట్టాలకు అతీతుల మన్న భావన పోలీసుల్లో పోలేదు. రాజ్యాంగంలోని వివిధ శాసనాల ద్వారా విపరీతమైన అధికారాలు పోలీసులకు సంక్రమించాయి. నేరం చేశాడన్న సహే తుకమైన అనుమానంతో పోలీసు అధికారులు క్రిమి నల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.41 ప్రకారం ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. అరెస్టు చేసే అధికారం ఒక ఎల్తైతే న్యాయబద్ధత ఉండటం మరొక ఎత్తు. పోలీసులు తమ రాష్ట్రాల భూభాగంలోనే అధి కారాలను వినియోగించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల పరిధిలో పోలీసులు ఎలాంటి విధులు నిర్వ ర్తించడానికి వీల్లేదు. అయితే నేర శిక్షాస్మృతిలోని సె. 48 ప్రకారం పోలీస్ అధికారి తాను అరెస్టు చేయా ల్సిన వ్యక్తిని దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఏదైనా వస్తువు కోసం, డాక్యుమెంట్ కోసం అత్యవసర సందర్భా లలో సె.166 ప్రకారం వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో సోదా జరుపవచ్చు. అయితే ఈ సోదాని పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అధికారికి లేక సబ్ఇన్స్పెక్టర్ స్థాయికి తగ్గని అధికారి గానీ ఈ సోదా జరుప వచ్చు. తమ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఈ అధికారాన్ని ఉపయోగించవచ్చు కానీ వేరే రాష్ట్ర పరిధిలో ఇలాంటి సోదాలు చేయ డానికి వీల్లేదు. ఇప్పుడు మన దేశంలో ఒక రాష్ట్రానికి చెందిన పోలీసులు వేరే రాష్ట్రాలలో సోదాలు, గాలింపులు జరుపుతున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్న అంశం. అది కూడా కేసులను దర్యాప్తు చేస్తున్న సివిల్ పోలీసులు కాదు. స్పెషల్ పోలీసులు, గ్రేహౌండ్స్ అధికారులు ఈ గాలింపు చర్యలు చేస్తు న్నారన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తు న్నాయి. ఆ గాలింపుల్లో ఎన్కౌంటర్లు జరుగుతు న్నాయి. ఈ నేరాలకు గాను విడుదల చేసే ఎఫ్ఐ ఆర్‌లో సాధారణంగా మృతులే ముద్దాయిలుగా ఉంటారు. ఈ గాలింపులు, ఎఫ్ఐఆర్లు అన్నీ చట్టం లోని నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్నవే. ఈ చర్యలు న్యాయపాలన (రూల్ ఆఫ్ లా)కి విరుద్ధం. రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల పోలీసులు సరే– రాజ్యాంగ న్యాయస్థానాలు, మానవ హక్కుల కమి షన్లు కూడా ఈ సంఘటనలపై దృష్టి సారించక పోవడం దురదృష్టకరం. ఈ చర్యలు న్యాయపాలనకి చెంపపెట్టు లాంటివి. అన్ని వ్యవస్థలకి అధికారాలు శాసనం ద్వారా వచ్చినవే. వాటిని నియంత్రించాల్సింది కూడా శాసనమే. న్యాయపాలనను ఎవరూ పట్టిం చుకోకపోతే అరాచకం ప్రబలుతుంది. (వ్యాసకర్త : మంగారి రాజేందర్ మాజీ డైరెక్టర్, ఎపీ జ్యుడీషియల్ అకాడమీ ఈ–మెయిల్ : lopalivarsham@gmail.com)