గాలింపు చర్యలు–న్యాయబద్ధత | opinion on police cumbing by mangari rajendar | Sakshi
Sakshi News home page

గాలింపు చర్యలు–న్యాయబద్ధత

Published Tue, Nov 1 2016 1:25 AM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

గాలింపు చర్యలు–న్యాయబద్ధత - Sakshi

గాలింపు చర్యలు–న్యాయబద్ధత

సందర్భం
ఒక రాష్ట్రానికి చెందిన పోలీసులు వేరే రాష్ట్రాలలో సోదాలు, గాలింపులు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. స్పెషల్‌ పోలీసులు, గ్రేహౌండ్స్‌ బలగాలు ఈ గాలింపు చర్యలు చేపట్టడం మరింత ఆందోళనకరం.

నేరాలను అదుపు చేయడం, నేరాలను కను గొనడం, ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన సమాచా రాన్ని సేకరించడం పోలీ సుల ప్రాథమిక విధి. పోలీసు చట్టం 1861 చెబుతున్నది ఇదే. కానీ కాలక్రమేణా పోలీసుల విధుల్లో మౌలికమైన మార్పు చోటు చేసుకున్నది. వీఐపీల బందోబస్తు ఇప్పుడు ప్రధానమైన పోలీసు విధిగా మారిపోయింది. పోలీసు చట్టం, 1861లోని సె. 23, 24, 31 పోలీసుల విధుల గురించి చెబు తుంది. ఈ విధుల్లో నిర్లక్ష్యం చూపిన అధికారులు అదే చట్టంలోని సె.29 ప్రకారం శిక్షార్హులు. కానీ అలా శిక్ష పడిన సంఘటన ఒక్కటీ కన్పించదు.

కస్టడీలో హింస, మరణాలు, చిత్రహింసలు ‘రూల్‌ ఆఫ్‌ లా’కు చెంపపెట్టులాంటివి. సుప్రీం కోర్టు (డి.కె. బసు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ వెస్ట్‌బెంగాల్, ఏ.ఐ.ఆర్‌. 1997 సుప్రీంకోర్టు 610) కేసులో పోలీ సుల అధికార దుర్వినియోగాన్ని ఏ విధంగా నిరో ధించాలి అన్న ప్రశ్న వేసి రెండు రక్షణలను పేర్కొంది. 1.వారి చర్యల్లో పారదర్శకత. 2. ఆ చర్య లకు జవాబుదారీ వహించమనడం. ఈ రెండు రక్ష ణలు పాటిస్తున్న దాఖలాలు కన్పించడం లేదు.

పోలీస్‌ వ్యవస్థను సేవా సంస్థగా కాకుండా ఒక శక్తిగా మాత్రమే బ్రిటిష్‌ వాళ్లు మనదేశంలో రూపొం దించారు. మన దేశ ప్రజలను, వారి స్వేచ్ఛను అణగ దొక్కడానికి మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగిం చారు. వ్యక్తుల స్వేచ్ఛను, హక్కులను పరిరక్షించవల సిన బాధ్యత పోలీసులపై ఉందని వాళ్లు మన పోలీ సులకు తెలియనివ్వలేదు. స్వాతంత్య్ర పోరాటా లను అణగదొక్కడానికే పోలీసు వ్యవస్థ వాళ్లకు ఉప యోగపడింది. పోలీసు ఉద్యోగాలకు శారీరక దారు ఢ్యం లాంటి అంశాలకే ఎక్కువ ప్రాముఖ్యతని చ్చారు. క్రమశిక్షణ అన్నది పరేడ్‌గ్రౌండ్‌ నుంచి మాత్రమే వస్తుందన్న భ్రమ కల్గించారు. తమకు ఎదురుగా వచ్చిన వ్యక్తి తమ శత్రువు అన్న భావనని వాళ్లకు కల్పించారు. సాయుధ దళాల మాదిరిగా వాళ్లకి ఖాకీ డ్రస్‌ ఇచ్చారు.

తాము కూడా శక్తి అన్న భావననే పోలీసులకి బ్రిటీష్‌ వాళ్లు కల్గించారు. ఆ భావన స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పోలీసుల్లో కొనసాగుతుంది.  ప్రాథమిక, మానవ హక్కుల గురించి, పోలీసులకి శిక్షణని ఇస్తున్నప్పటికీ, తాము చట్టాలకు అతీతుల మన్న భావన పోలీసుల్లో పోలేదు. రాజ్యాంగంలోని వివిధ శాసనాల ద్వారా విపరీతమైన అధికారాలు పోలీసులకు సంక్రమించాయి. నేరం చేశాడన్న సహే తుకమైన అనుమానంతో పోలీసు అధికారులు క్రిమి నల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.41 ప్రకారం ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. అరెస్టు చేసే అధికారం ఒక ఎల్తైతే న్యాయబద్ధత ఉండటం మరొక ఎత్తు.  

పోలీసులు తమ రాష్ట్రాల భూభాగంలోనే అధి కారాలను వినియోగించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల పరిధిలో పోలీసులు ఎలాంటి విధులు నిర్వ ర్తించడానికి వీల్లేదు. అయితే నేర శిక్షాస్మృతిలోని సె. 48 ప్రకారం పోలీస్‌ అధికారి తాను అరెస్టు చేయా ల్సిన వ్యక్తిని దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఏదైనా వస్తువు కోసం, డాక్యుమెంట్‌ కోసం అత్యవసర సందర్భా లలో సె.166 ప్రకారం వేరే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోదా జరుపవచ్చు. అయితే ఈ సోదాని పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి అధికారికి లేక సబ్‌ఇన్‌స్పెక్టర్‌ స్థాయికి తగ్గని అధికారి గానీ ఈ సోదా జరుప  వచ్చు. తమ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఈ అధికారాన్ని ఉపయోగించవచ్చు కానీ వేరే రాష్ట్ర పరిధిలో ఇలాంటి సోదాలు చేయ డానికి వీల్లేదు.

ఇప్పుడు మన దేశంలో ఒక రాష్ట్రానికి చెందిన పోలీసులు వేరే రాష్ట్రాలలో సోదాలు, గాలింపులు జరుపుతున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్న అంశం. అది కూడా కేసులను దర్యాప్తు చేస్తున్న సివిల్‌ పోలీసులు కాదు. స్పెషల్‌ పోలీసులు, గ్రేహౌండ్స్‌ అధికారులు ఈ గాలింపు చర్యలు చేస్తు న్నారన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తు న్నాయి. ఆ గాలింపుల్లో ఎన్‌కౌంటర్లు జరుగుతు   న్నాయి. ఈ నేరాలకు గాను విడుదల చేసే ఎఫ్‌ఐ ఆర్‌లో సాధారణంగా మృతులే ముద్దాయిలుగా ఉంటారు. ఈ గాలింపులు, ఎఫ్‌ఐఆర్‌లు అన్నీ చట్టం లోని నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతున్నవే. ఈ చర్యలు న్యాయపాలన (రూల్‌ ఆఫ్‌ లా)కి విరుద్ధం. రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల పోలీసులు సరే–  రాజ్యాంగ న్యాయస్థానాలు, మానవ హక్కుల కమి షన్లు కూడా ఈ సంఘటనలపై దృష్టి సారించక పోవడం దురదృష్టకరం.

ఈ చర్యలు న్యాయపాలనకి చెంపపెట్టు లాంటివి. అన్ని వ్యవస్థలకి అధికారాలు శాసనం ద్వారా వచ్చినవే. వాటిని నియంత్రించాల్సింది కూడా శాసనమే. న్యాయపాలనను ఎవరూ పట్టిం చుకోకపోతే అరాచకం ప్రబలుతుంది.

(వ్యాసకర్త : మంగారి రాజేందర్‌  మాజీ డైరెక్టర్,
ఎపీ జ్యుడీషియల్‌ అకాడమీ
ఈ–మెయిల్‌ : lopalivarsham@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement