సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తాజాగా న్యాయవాదులకు కేటాయించిన ఫండ్ పిటిషన్‌పై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం న్యాయవాదులకు విడుదల చేసిన రూ.25 కోట్లు ప్రతి ఒక్కరికీ చెందాలని కోర్టుకు తెలిపారు. సీనియారిటీని ప్రాతిపదికలోకి తీసుకోకుండా ప్రతి ఒక్క న్యాయవాదికి డబ్బు చెల్లించాలని కోర్టును కోరారు. న్యాయవాదులకు రూ.25 కోట్లను ఏ ప్రాతిపదికన ఎంత ఇస్తున్నారో తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీనికి సమాధానంగా ఏడు సంవత్సరాల లోపు అనుభవం ఉన్న న్యాయవాదులతో పాటు 20 వేల మంది క్లర్క్‌లకు అందజేయాలని భావిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. అయితే రిటైర్మెంట్ అయిన న్యాయవాదులకు కూడా వెల్ఫేర్ ఫండ్ ఇవ్వాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. (రూ.100 కోట్లుకు వడ్డీని చెల్లించాలని పిల్)
Comments
Please login to add a commentAdd a comment