సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదుల ఆందోళన రెండవ రోజుకు చేరింది. బదిలీలకు నిరసనగా బుధవారం తెలంగాణ హెకోర్టు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. శనివారం వరకు రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులను బహిష్కరించాలని హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానించింది. జస్టీస్ సంజయ్ కుమార్‌ను వెంటనే తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, తెలంగాణ జస్టీస్ సంజయ్ కుమార్‌ను పంజాబ్, హర్యానా కోర్ట్‌కు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదుల ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో న్యాయవాదులు తొలి సారి తమ నిరసన గళాన్ని విప్పారు. హైకోర్టులో నెంబర్ టు స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌ను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు జూనియర్ జడ్జిగా బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుపై న్యాయవాదులు మండిపడుతున్నారు.
త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాల్సిన వ్యక్తిని, ఈ విధంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో 12వ స్థానానికి బదిలీ చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిఫారసును వెనక్కి తీసుకోవాలని, ఆయనను ఏదైనా హైకోర్టు సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియంను డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment