
దిశకు హైకోర్టు వద్ద న్యాయవాదుల నివాళులు
షాద్‌నగర్ రూరల్: దిశపై అత్యాచారం, హత్య కేసులో నిందితులకు న్యాయ సహాయం అందించబోమని షాద్‌నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నడికూడ సత్యనారాయణ యాదవ్ మాట్లాడు తూ దిశ హత్య అమానుషమన్నారు. మానవ రూపంలో ఉన్న మృగాల వల్ల ఆడపిల్లలకు స్వేచ్ఛ లేకుండాపోయిందని వాపోయారు. నిందితులకు కఠినతరమైన శిక్ష అమలు చేస్తేనే ఇలాంటి తప్పు చేసేందుకు మరొకరు సాహసించరని అభిప్రాయపడ్డారు. ‘దిశ’మృతికి న్యాయవాదులు వేణుగోపాల్‌రావు, చెంది మహేందర్‌రెడ్డి, గుండుబావి శ్రీనివాస్‌రెడ్డి, పాతపల్లి కృష్ణారెడ్డి, బెన్నూరి చంద్రయ్య, నరేందర్, రమేశ్‌బాబు తదితరులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment