సాక్షి, గుంటూరు: దళితులను అణచివేయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని న్యాయవాదులు మండిపడ్డారు. శనివారం గుంటూరులో జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ న్యాయవాదుల సమావేశంలో వారు టీడీపీ తీరుని దుయ్యబట్టారు. ‘అమరావతిలో దళిత ప్రజా ప్రతినిధులపై దాడులు - ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్న వైనం’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. దళిత ప్రజా ప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని.. దళితులపై దాడి చేయడం దారుణమన్నారు. అమరావతిలో రైతుల ముసుగులో కొంత మంది చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కూడా దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. దళిత ప్రజా ప్రతినిధులను టీడీపీ టార్గెట్ చేస్తోందని విమర్శించారు. టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలని న్యాయవాదులు పేర్కొన్నారు.
దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు..
‘దళిత ప్రజా ప్రతినిధులపై చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆయన నియంతలాగా పాలించారు. గతంలో ఏ ప్రభుత్వం న్యాయవాదులను పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూనియర్ లాయర్లకు స్టైఫండ్ ఇస్తున్నారని’ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. పేద విద్యార్థులకు సీఎం జగన్ నాణ్యమైన విద్య అందిస్తున్నారని న్యాయవాదులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment