
కృష్ణ అజేయ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా అండర్-14 క్రికెట్ టోర్నీలో వరంగల్ 170 పరుగుల తేడాతో నల్లగొండపై నెగ్గింది. శనివారం జరి గిన ఈ మ్యాచ్‌లో కృష్ణ (138 నాటౌట్, 18 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకం సాధించాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. తేజ (77 నాటౌట్) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన నల్లగొండ జట్టు 177 పరుగులు చేసి ఆలౌటైంది.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
ఆదిలాబాద్: 214/9 (ప్రణీత్‌సింగ్ 46, హిమతేజ 45; సిద్ధు 3/27, మునీశ్ 3/35), నిజామాబాద్: 200 (రిషబ్ అగర్వాల్ 54, హర్షవర్ధన్ 52; సుచిత్ కుమార్ 4/18)
కరీంనగర్: 226, ఖమ్మం: 104
ఎ-ఇన్‌స్టిట్యూషన్ వన్డే మ్యాచ్ స్కోర్లు
ఈసీఐఎల్: 177 (రోహిత్ 41, సురేశ్ 39; హనుమంతు 4/18), ఎఫ్‌ఎంసీ: 175 (రజనీకాంత్ 50, శేఖర్ 5/42).