బ్యాంకాక్: ఆసియా కప్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. థాయ్‌లాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న థాయ్‌లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 69 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో మానసి జోషి రెండు వికెట్లు, శిఖా పాండే ఒక వికెట్ తీశారు. 70 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 11.1 ఓవర్లలో వికెట్ నష్టపోరుు అందుకుంది. వేద కృష్ణమూర్తి (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన (30 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు), సుష్మా వర్మ (3 నాటౌట్) అజేయంగా నిలిచారు. మంగళవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది.