South africa: Batsman Martin Coetzee Hit Century Just 21 Balls - Sakshi
Sakshi News home page

Martin Coetzee: 21 బంతుల్లోనే సెంచరీ.. టీమిండియా బతికిపోయింది

Published Tue, Dec 14 2021 2:34 PM | Last Updated on Tue, Dec 14 2021 5:20 PM

South africa Batsman Martin Coetzee Hit Century Just 21 Balls - Sakshi

South Africa Batsman Martin Coetzee Century In 21 Balls.. డిసెంబర్‌ 26 నుంచి టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ ఆరంభానికి ముందు దక్షిణాఫ్రికా క్రికెటర్‌ మార్టిన్‌ కోయెట్జ్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 21 బంతుల్లోనే సెంచరీ బాదిన కోయెట్జ్‌ ఓవరాల్‌గా 120 బంతుల్లో 13 ఫోర్లు..  8 సిక్సర్ల సాయంతో 157 పరుగులు చేశాడు. అయితే కోయెట్జ్‌ ఈ ఇన్నింగ్స్‌ దక్షిణాఫ్రికా తరపున ఆడాడనుకుంటే పొరపాటే. అసలు మార్టిన్‌ కోయెట్జ్‌ ఇంతవరకు దక్షిణాఫ్రికా తరపున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడలేదు. కేవలం ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన కోయెట్జ్‌ ప్రస్తుతం ప్రైవేట్‌ లీగ్‌ల్లో బిజీగా గడుపుతున్నాడు. దీంతో కోయెట్జ్‌ దక్షిణాఫ్రికా జట్టులో లేకపోవడంతో టీమిండియా బతికిపోయిందంటూ కొందరు అభిమానులు కామెంట్స్‌ చేయడం వైరల్‌గా మారింది.

చదవండి: India Tour Of South Africa: దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ.. టెస్ట్‌లకు స్టార్‌ ప్లేయర్‌ దూరం

ఇక మార్టిన్‌ కోయెట్జ్‌ ఇన్నింగ్స్‌ విషయానికి వస్తే... హాంకాంగ్‌ ఆల్‌ స్టార్స్‌ 50 ఓవర్ల సిరీస్‌లో ఈ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కోవ్‌లూన్‌ లయన్స్‌, హాంకాంగ్‌ ఐలాండ్స్‌ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోవ్‌లూన్‌ లయన్స్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. వకాస్‌ ఖాన్‌ 122, ఎజాజ్‌ ఖాన్‌ 104 సెంచరీలు బాదడంతో ఈ స్కోరు నమోదైంది. అనంఆలతరం 300 పరుగుల లక్ష్యతో బరిలోకి దిగిన హాంకాంగ్‌ ఐలాండర్స్‌ మార్టిన్‌ కోయెట్జ్‌ విధ్వంసంతో 44 ఓవర్లలోనే చేధించింది. మార్టిన్‌ కోయెట్జ్‌కు జతగా.. కెప్టెన్‌ బాబార్‌ హయత్‌ 67 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు.  

చదవండి: Shane Warne Test Batsmen List: 'కెప్టెన్సీ పోతే పోయింది.. నా టాప్‌-5లో నువ్వు ఒకడివి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement