హాంగ్‌కాంగ్‌ సిక్సర్స్‌ టోర్నీలో పాల్గొననున్న టీమిండియా | India Set To Play In Hong Kong Cricket Sixes | Sakshi
Sakshi News home page

హాంగ్‌కాంగ్‌ సిక్సర్స్‌ టోర్నీలో పాల్గొననున్న టీమిండియా

Oct 8 2024 4:10 PM | Updated on Oct 8 2024 4:25 PM

India Set To Play In Hong Kong Cricket Sixes

భారత క్రికెట్‌ జట్టు హాంగ్‌కాంగ్‌ క్రికెట్‌ సిక్సర్స్‌ టోర్నీలో పాల్గొననుంది. ఈ విషయాన్ని క్రికెట్‌ హాంగ్‌కాంగ్‌ అధికారికంగా ధృవీకరించింది. హాంగ్‌కాంగ్‌ క్రికెట్‌ సిక్సర్స్‌ టోర్నీ  ఈ ఏడాది నవంబర్‌ 1న ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు సాగే ఈ టోర్నీలో భారత్‌, పాక్‌ సహా 12 జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ లాంటి పెద్ద జట్లతో పాటు హాంగ్‌కాంగ్‌, నేపాల్‌, ఒమన్‌, యూఏఈ లాంటి చిన్న జట్లు ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

హాంగ్‌కాంగ్‌ క్రికెట్‌ సిక్సర్స్‌ టోర్నీ 1992లో తొలిసారి నిర్వహించబడింది. అప్పటి నుంచి 2017 వరకు ప్రతి ఏటా నిర్వహించబడిన ఈ టోర్నీ.. ఆతర్వాత వేర్వేరు కారణాల చేత గతేడాది వరకు నిర్వహించబడలేదు. తిరిగి ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీ అభిమానులను అలరించేందుకు ముందుకు రానుంది. 

ఈ టోర్నీలో సచిన్‌ టెండూల్కర్‌, ఎంఎస్‌ ధోని, షేన్‌ వార్న్‌, వాసిం అక్రమ్‌, సనత్‌ జయసూర్య లాంటి దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ టోర్నీలో పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా జట్లు సక్సెస్‌ఫుల్‌ జట్లుగా ఉన్నాయి. భారత్‌ 2005 ఎడిషన్‌లో ఈ టోర్నీ విజేతగా నిలిచింది. శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ సైతం తలో ఏడాది విజేతలుగా నిలిచాయి.

హాంగ్‌కాంగ్‌ క్రికెట్‌ సిక్సర్స్‌ టోర్నీ రూల్స్‌ ఇలా ఉంటాయి..

ఈ టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టులో ఆరుగురు సభ్యులు ఉంటారు.
ఈ టోర్నీలో ప్రతి జట్లు ఐదు ఓవర్లు వేయాల్సి ఉంటుంది. 
ఒక్కో ఓవర్‌లో ఎనిమిది బంతులు ఉంటాయి. 
వికెట్‌కీపర్‌ మినహా ప్రతి ఆటగాడు తలో ఓవర్‌ బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. 
వైడ్‌ మరియు నో బాల్స్‌కు రెండు పరుగులు కేటాయిస్తారు.
ఆరుగురు బ్యాటర్లు ఔటయ్యేంత వరకు ప్రతి మ్యాచ్‌ కొనసాగుతుంది. 
ప్రతి గేమ్‌లో బ్యాటర్‌ 31 పరుగుల తర్వాత రిటైర్డ్‌ అవుతాడు. 
ఒకవేళ ఐదుగురు ఔటైతే అతను తిరిగి బరిలోకి దిగుతాడు. 

చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement