Ranji Trophy 2024: ముంబై 224 ఆలౌట్‌ | Ranji Trophy 2024: Shardul Thakur the last man to depart as Mumbai are bowled out for 224 | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2024: ముంబై 224 ఆలౌట్‌

Published Mon, Mar 11 2024 4:49 AM | Last Updated on Mon, Mar 11 2024 4:49 AM

Ranji Trophy 2024: Shardul Thakur the last man to depart as Mumbai are bowled out for 224 - Sakshi

రాణించిన శార్దుల్‌ ఠాకూర్‌  

ముంబై: విదర్భ జట్టుతో ఆదివారం మొదలైన రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 64.3 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు పృథ్వీ షా (46; 5 ఫోర్లు), భూపేన్‌ లాల్వాని (37; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. భూపేన్‌ అవుటయ్యాక ముంబై పతనం మొదలైంది.

ముంబై 111/6తో ఇబ్బందుల్లో పడిన దశలో శార్దుల్‌ ఠాకూర్‌ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) విదర్భ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన శార్దుల్‌ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. విదర్భ బౌలర్లలో హర్‌‡్ష దూబే, యశ్‌ ఠాకూర్‌ 3 వికెట్ల చొప్పున తీయగా... ఉమేశ్‌ యాదవ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విదర్భ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement