
స్వదేశంలో ఈ ఏడాది డిసెంబర్ 6 నుంచి 17 వరకు జరిగే అంధుల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. 17 మంది సభ్యులుగల టీమిండియాకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన వెంకటేశ్వర రావును వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ మెగా ఈవెంట్‌కు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. గతంలో భారత జట్టు రెండుసార్లు (2012, 2017) ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది.
భారత జట్టు: అజయ్ కుమార్ రెడ్డి (కెప్టెన్), వెంకటేశ్వర రావు (వైస్ కెప్టెన్), దుర్గా రావు, ఎ.రవి (ఆంధ్రప్రదేశ్), లలిత్ మీనా (రాజస్తాన్), ప్రవీణ్, దీపక్ (హరియాణా), సుజీత్ (జార్ఖండ్), నీలేశ్ యాదవ్, , ఇర్ఫాన్ (ఢిల్లీ), సోనూ (మధ్యప్రదేశ్), సొవేందు (బెంగాల్), నకులా (ఒడిశా), లోకేశ, సునీల్, ప్రకాశ్ (కర్ణాటక), దినగర్ (పాండిచ్చేరి).