Ajaykumar
-
Blind T20 World Cup 2022: భారత జట్టు కెప్టెన్‌గా అజయ్
స్వదేశంలో ఈ ఏడాది డిసెంబర్ 6 నుంచి 17 వరకు జరిగే అంధుల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. 17 మంది సభ్యులుగల టీమిండియాకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన వెంకటేశ్వర రావును వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ మెగా ఈవెంట్‌కు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. గతంలో భారత జట్టు రెండుసార్లు (2012, 2017) ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది. భారత జట్టు: అజయ్ కుమార్ రెడ్డి (కెప్టెన్), వెంకటేశ్వర రావు (వైస్ కెప్టెన్), దుర్గా రావు, ఎ.రవి (ఆంధ్రప్రదేశ్), లలిత్ మీనా (రాజస్తాన్), ప్రవీణ్, దీపక్ (హరియాణా), సుజీత్ (జార్ఖండ్), నీలేశ్ యాదవ్, , ఇర్ఫాన్ (ఢిల్లీ), సోనూ (మధ్యప్రదేశ్), సొవేందు (బెంగాల్), నకులా (ఒడిశా), లోకేశ, సునీల్, ప్రకాశ్ (కర్ణాటక), దినగర్ (పాండిచ్చేరి). -
వనజీవి రామయ్యకు యాక్సిడెంట్.. ‘కేసు వద్దు.. మొక్కలు నాటించండి’
ఖమ్మం వైద్యవిభాగం: తన వాహనాన్ని ఢీకొట్టిన వాహనదారుడిపై ఎలాంటి కేసులు నమోదు చేయొద్దని, ఆయనతో 100 మొక్కలు నాటించాలని బుధవారం రెడ్డిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ‘పద్మశ్రీ’ గ్రహీత వనజీవి రామయ్య రాష్ట్ర మంత్రులను కోరారు. మొక్కలు నాటించడమే ఆయనకు శిక్షగా పరిగణించాలని రామయ్య విజ్ఞప్తి చేశారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామయ్యను మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రామయ్య పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లును ఆదేశించారు. రామయ్యను పరామర్శించిన వారిలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్ గౌతమ్ తదితరులు ఉన్నారు. -
దమ్ముంటే మిలియన్ మార్చ్ ఢిల్లీలో పెట్టు: హరీశ్‌రావు
కొత్తగూడెం అర్బన్ /సత్తుపల్లి/సూర్యాపేట: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ చేస్తామని చెబుతున్నారు. ఆయనకు దమ్ముంటే ఢిల్లీలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తే దేశవ్యాప్తంగా నిరుద్యోగులు తరలివచ్చి పోరాటం చేస్తారు’ అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించిన ఆయన సత్తుపల్లిలో 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు పాల్వంచ నర్సింగ్, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. విలేకరుల సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. ఇచ్చిందెవరు.. ఇవ్వనిదెవరు? బీజేపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని, ఉద్యోగాలు ఇచ్చిందెవరు, ఇవ్వనిదెవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం ఎంత పెరి గిందో, నిరుద్యోగ యువత ఎంత బాధ పడుతుం దో బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం నియామకాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని, వివిధ శాఖల్లో 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేయగా, మరో 60 వేల పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోందని తెలిపారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు లభించేలా కొత్త జోనల్ విధానాన్ని తీసుకొచ్చి, 317 జీవోను విడుదల చేస్తే దాన్ని కూడా అడ్డుకునేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నారని.. తద్వారా తెలంగాణలో స్థానిక యువత కు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ఆర్బీ ద్వారా రైల్వేలో 1.03 లక్షల పోస్టుల భర్తీకి 2019 ఫిబ్రవరిలో కేంద్రం నోటిఫికేషన్ ఇస్తే దాదాపు కోటి మంది నిరుద్యో గులు దరఖాస్తు చేసుకున్నారని, అయితే మూడేళ్లయినా ఇంతవరకు పరీక్ష నిర్వహించలేదని హరీశ్ విమర్శించారు. ఆర్మీ, రైల్వే, ప్రభుత్వరంగ బ్యాంకు ల్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సంజయ్‌కు హితవు పలికారు. ఇప్పటికే అనేక ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసిన కేంద్రం, ఎయిరిండియాను సైతం టాటాలకు అప్పగించిందని.. ఇలాంటి పనులతో దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని తెలిపారు. బీజేపీ నేతలు చిల్లర రాజకీయా లు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, నిబంధనలు పాటిస్తే థర్డ్‌వేవ్ నుంచి బయటపడతామని అన్నారు. కాంగ్రెస్‌తో ఒరిగిందేమీ లేదు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్దపెద్ద కాంగ్రెస్ నేత లున్నారని.. అయినా ఫలితం శూన్యమని, వారు జిల్లాకు చేసింది ఏమీ లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సమైక్య పాలనలో మెడికల్ కాలేజీల కోసం ఆందోళనలు, ధర్నాలు చేసినా మంజూరు కాలేదని, కానీ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన కొద్ది కాలంలోనే జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందడమే కాకుండా.. మెడికల్ కళాశాలలు వచ్చాయన్నారు. శనివారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి 20 పడకల నవజాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ నల్లగొండకు ఐదు, సూర్యాపేటకు మరో ఐదు డయాలసిస్ మిషన్లు మంజూరు చేస్తామన్నారు. ఇక నుంచి 3 షిఫ్ట్‌లలో 24 గంటలూ కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తామని చెప్పారు. -
మొదటిరోజే.. చివరి రోజైంది..
మానవపాడు: పలకా, బలపంతో పాఠశాలకు వెళ్లిన బాలుడికి మొదటి రోజే స్కూల్ బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. మూడేళ్ల ప్రాయంలోనే నూరేళ్లు నిండిపోయాయి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో సోమవారం ఈ హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. చంద్రశేఖర్‌నగర్ గ్రామం శ్రీనగర్ కాలనీకి చెందిన మహేశ్, సూర్యబాయి దంపతులకు ఇద్దరు కుమారులు. మహేశ్ ఏపీలోని కర్నూలులో కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. తమ ఇద్దరు కొడుకులు అభి, అజయ్‌కుమార్ (3)లను పాఠశాలలో చేర్పించేందుకు రెండు రోజుల క్రితం వడ్డేపల్లి మండలం శాంతినగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో రూ.4 వేలు ఫీజు కట్టి వచ్చారు. సోమవారం ఇద్దరు పిల్లలను పాఠశాలకు పంపారు. తరగతులు పూర్తయ్యాక బస్సులో అజయ్ ఇంటి వద్దకు వచ్చాడు. బస్సు దిగి రోడ్డుకు ఆవలివైపు ఉన్న ఇంట్లోకి వెళ్లేందుకు వస్తుండగా తల్లి గమనించి ‘బస్సు ముందు బాబు ఉన్నాడు’ ఆపమని కేకలు వేస్తున్నా.. గమనించని డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో అజయ్ బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారీ కాగా.. న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాన్ని తరలించకుండా రాత్రి 8 గంటల వరకు సంఘటనాస్థలంలోనే ఉంచారు. పోలీసులు శాంతింపజేయడంతో మృతదేహాన్ని అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మన్యంలో జూనియర్ సివిల్ జడ్జి పర్యటన
బుట్టాయగూడెం : మండలంలోని మారుమూల గ్రామమైన దండిపూడిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొనేందుకు వెళ్లిన జంగారెడ్డిగూడెం కోర్టు జూనియర్ సివిల్ జడ్జి డి.అజయ్‌కుమార్ నక్సల్స్ ప్రభావిత అటవీ కొండ ప్రాంతంలో సుమారు కిలోమీటరున్నర నడుచుకుంటూ వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో పర్యటించిన తొలి న్యాయమూర్తి కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన పర్యటనలో ఆ ప్రాంత కొండరెడ్డి గిరిజనుల పోడు వ్యవసాయం, వారు పండించే పంటలు, వారి స్థితిగతులు, సంస్కతి సంప్రదాయాల గురించి అక్కడవారిని అడిగి తెలుసుకున్నారు. మారుమూల కుగ్రామమైన దండిపూడిలో మెడికల్ క్యాంపుకు జడ్జి పాల్గొంటున్నారని సమాచారం అందుకున్న పోలీసులు తొలుత అభ్యంతరం తెలిపారు. అయినా న్యాయవాదులు అంగీకరించలేదు. వైద్య శిబిరంలో పాల్గొన్న జడ్జి ఆ కొండ ప్రాంత వాతావరణం చూసిన వెంటనే అటువైపు పర్యటించారు. మధ్యాహ్న సమయానికి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకొని జడ్జి వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
డివిజన్.. డీల్
ఆగస్టు 10న కౌన్సిల్‌కు నిర్ణయం ప్రతీ డివిజన్‌కు రూ.30లక్షల నుంచి రూ.50లక్షలకు పెంపు మూడు నెలలకోసారి రూ.లక్ష అత్యవసర నిధులు పాత పనులకు నో చెప్పిన కార్పొరేటర్లు అధికారులు, కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సమీక్ష ఖమ్మం : విమర్శలు.. ప్రతి విమర్శలు.. అలక సీన్లు, బుజ్జగింపులు.. నిధులు కేటాయింపుపై పెదవి విరుపు.. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అంతరం.. అంతలోనే అధికారుల తీరుపై రహస్య సమావేశాలు.. స్పందించిన నాయకులు.. కమిషనర్ బదిలీ.. వంటి సంఘటనలతో ముడిపడి ఉన్న ఖమ్మం కార్పొరేషన్ పాలక మండలి సమావేశం ఓ కొలిక్కి వచ్చింది. కార్పొరేటర్లకు అనుకూలంగా తీర్మానాలు ఉండేలా ఆగస్టు 10వ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సమాలోచనకు వచ్చినట్లు తెలిసింది. కౌన్సిల్ సమావేశం, ఖమ్మం నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో మేయర్ పాపాలాల్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, విద్యుత్, రెవెన్యూ శాఖలతోపాటు కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్షించారు. సమావేశపు తేదీ, నిధుల కేటాయింపు తీర్మానాలు మొదలైన విషయాలపై చర్చించారు. ఆగస్టు 10న కౌన్సిల్ సమావేశం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారు పలు వివాదాలకు దారి తీసింది. తీర్మానాలపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం.. కమిషనర్‌పై నాయకులకు ఫిర్యాదు చేయడం.. వారు స్పందించి కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డిని పట్టుబట్టి బదిలీ చేయించారనే వార్తలొచ్చాయి. ఇటువంటి పరిస్థితిలో తిరిగి సమావేశం ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడ్డారు. ఏకపక్ష నిర్ణయం ఎందుకనే ఆలోచనతోపాటు స్థానిక ఎమ్మెల్యేతో సమావేశం విషయం ప్రస్తావించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే బుధవారం సమావేశం ఏర్పాటు చేసి.. అందరు కార్పొరేటర్లతో చర్చించి ఆగస్టు 10న కౌన్సిల్ సమావేశం ఏర్పాటు, తీర్మానాలపై సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలిసింది. కార్పొరేటర్లకు బొనాంజా కార్పొరేటర్లందరినీ మెప్పించే విధంగా ఎమ్మెల్యే సూచనలు చేయడంతో అధికారులు, కార్పొరేటర్ల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిసింది. గతంలో డివిజన్ అభివృద్ధికి రూ.30లక్షలు, మొత్తం రూ.15కోట్లతో చేపట్టే పనులకు తీర్మానాలు తయారు చేశారు. అయితే రూ.30లక్షలు సరిపోవని కార్పొరేటర్లు కోరగా.. వీటిని రూ. 50లక్షలకు పెంచి మొత్తం రూ.25కోట్ల పనులకు తీర్మానాలు చేసేలా అంగీకరించారు. ఆయా డివిజన్లలో అత్యవసర పనులు చేపట్టేందుకు కార్పొరేటర్వద్ద డబ్బులు ఉండాలని, ప్రతీ మూడు నెలలకోమారు రూ.లక్ష కేటాయించి వాటిని పారిశుద్ధ్య, తాగునీటి సరఫరా, ఇతర కార్యక్రమాలకు ఉపయోగించేలా అవకాశం కల్పించనున్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత కార్పొరేటర్లకు అప్పగించడంతోపాటు డివిజన్‌కు 100 చొప్పున టీగార్డులు కొనుగోలు చేసి ఇవ్వాలనే అంశాన్ని పొందుపరిచారు. కార్పొరేటర్లు వ్యతిరేకించిన రూ.4.5కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద చేపట్టిన పనులకు జనరల్ ఫండ్ నుంచి నిధులు కేటాయించాలనే నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లు తెలిసింది. రూ.100కోట్లపై చర్చ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా ప్రతీ కార్పొరేషన్‌కు రూ.100కోట్ల కేటాయింపు జరిగితే వాటిని ఎలా ఖర్చు చేయాలనే అంశంపై చర్చ జరిగింది. ఈ నిధులతో గోళ్లపాడు చానల్ పనులు, నగరంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్డు, కొత్తబస్టాండ్ సెంటర్‌తోపాటు కూరగాయల మార్కెట్, గాంధీచౌక్ సెంటర్ సుందరీకరణ, వాటర్ ఫౌంటేన్ ఏర్పాటుతోపాటు గాంధీచౌక్ నుంచి ట్రంక్‌రోడ్డు మీదుగా కాల్వొడ్డు వరకు ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న షాదీఖానా మరమ్మతులు, కొత్త షాదీఖానా, కబేళా నిర్మాణాలు, దంసలాపురం, బల్లేపల్లి ప్రాంతాల్లో కొత్తగా రెండు శ్మశాన వాటికల కోసం స్థలం కేటాయింపునకు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కార్పొరేషన్ పరిధిలో ఉండి..lఆర్అండ్బీ రోడ్లకు అనుసంధానంగా ఉన్న రోడ్లను ఆర్‌అండ్‌బీకి కేటాయించాలని, వీటికి ఆధునికీకరణ పనులు చేపట్టేలా మంత్రి తుమ్మలను కోరేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చేసిన సూచనలకు కార్పొరేటర్లు, అధికారులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
పుణ్యస్నానాల్లో విషాదం
ఒకరు మృతి.. మరొకరు గల్లంతు దిమిలి శివారు వాడపాలెం తీరంలో ఘటన రాంబిల్లి: మాఘపౌర్ణమి పుణ్యస్నానాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రాంబిల్లి శివారు వాడపాలెం తీరంలో పుణ్యస్నానాలు చేస్తుండగా కెరటాల ధాటికి ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. దీంతో విషాదం చోటుచేసుకుంది. తీరంలో లోపలికి వెళ్లి పుణ్యస్నానాలు చేస్తుండగా అలల్లో చిక్కుకుని మండలంలోని దిమిలికి చెందిన జనపరెడ్డి శ్రీనివాసరావు(37) మృతి చెందాడు. ఇదే మండలం కొత్తూరుకు చెందిన తురగలపూడి అజయ్‌కుమార్(19) కెరటాల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. వాడపాలెం తీరానికి పుణ్యస్నానాలకు దిమిలికి చెందిన జనపరెడ్డి శ్రీనివాసరావు భార్య నూకరత్నం, ముగ్గురు పిల్లలతో మంగళవారం వచ్చాడు. వికలాంగుడైన ఇతడు పుణ్యస్నానం చేస్తుండగా అలల్లో చిక్కుకుపోయాడు. గమనించిన యువకులు అతికష్టం మీద కొన ఊపిరితో ఉన్న అతడ్ని ఒడ్డుకు చేర్చారు. సపర్యలు చేశారు. కొద్ది సేపటికి చనిపోయాడు. శ్రీనివాసరావు దిమిలిలో చిన్న టిఫిన్ సెంటరును నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, రెండేళ్ల పాప ఉన్నారు. మంగళవారం ఉదయం 8 గంటల వరకు టిఫిన్ సెంటర్లో అమ్మకాలు జరిపారు. అనంతరం ఆటోలో వాడపాలెం పుణ్యస్నానాలకు వచ్చారు. ఇక తమ జీవనోపాధి ఎలాగంటూ భార్య నూకరత్నం విలపిస్తున్న తీరు పలువురిని కంట తడిపెట్టించింది. శ్రీనివాసరావు మృతదేహానికి యలమంచిలి ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులుకు అప్పగించారు. కాగా కొత్తూరుకు చెందిన తురగలపూడి అజయ్‌కుమార్ స్నేహితులతో కలిసి పుణ్యస్నానాలకు వచ్చి కెరటాల ఉధృతికి గల్లంతయ్యాడు. ఇతడు అచ్యుతాపురంలో ఐటిఐ చేస్తున్నాడు. గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. ఎస్ఐ కె. మల్లేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రెండు సంఘటనలతో వాడపాలెం, దిమిలి, కొత్తూరు గ్రామాల్లో విషాదం అలుముకుంది. -
సెప్టెంబర్ 2 నుంచి రాజీవ్ యువశక్తి ఇంటర్వ్యూలు
ఖమ్మం హవేలి: రాజీవ్ యువశక్తి పథకం (2014-15) ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిం చేందుకు రుణాల మంజూరుకు సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సెట్‌కం సీఈఓ అజయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం సెట్‌కం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2వ తేదీన చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు, 3న ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, 4న చంద్రుగొండ, ఏన్కూర్, జూలూరుపాడు, వైరా, తల్లాడ, కొణిజర్ల, 5న అశ్వారావుపేట, దమ్మపేట, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, 9న అశ్వాపురం, కొత్తగూడెం రూరల్, మణుగూరు రూరల్, ములకలపల్లి, పినపాక, పాల్వంచ రూరల్, 10న గార్ల, బయ్యారం, గుండాల, కామేపల్లి, సింగరేణి, టేకులపల్లి, ఇల్లెందు రూరల్, 11న బోనకల్, చింతకాని, మధిర, ముదిగొండ, రఘునాథపాలెం, ఎర్రుపాలెం, 12న కొత్తగూడెం మున్సిపాలిటీ, మధిర మున్సిపాలిటీ, మణుగూరు మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీ, సత్తుపల్లి మున్సిపాలిటీ, ఇల్లెందు మున్సిపాలిటీ, 16న ఖమ్మం కార్పొరేషన్, 17న భద్రాచలం, బూర్గంపాడు, చింతూరు, కుక్కునూరు, కూనవరం, వరరామచంద్రాపురం, వేలేరుపాడులో ఇంట ర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మండలాల్లో ఎంపిక కమిటీలకు ఎంపీడీవో కన్వీనర్‌గా, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు కన్వీనర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గానికి 42, భద్రాచలం నియోజకవర్గానికి 41, ఖమ్మం నియోజకవర్గానికి 42, కొత్తగూడెం నియోజకవర్గానికి 42, మధిర నియోజకవర్గానికి 37, పాలేరు నియోజకవర్గానికి 38, పినపాక నియోజకవర్గానికి 25, సత్తుపల్లి నియోజకవర్గానికి 39, వైరా నియోజకవర్గానికి 32, ఇల్లెందు నియోజకవర్గానికి 36 వ్యక్తిగత యూనిట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత యూనిట్ల కింద సేవలు, పరిశ్రమల రంగాలకు యూనిట్లకు సంబంధించి గరిష్టంగా రూ. లక్ష రుణం మంజూరు ఇస్తామన్నారు. సబ్సిడీ గరిష్టంగా రూ.30 వేలు ఉంటుందన్నారు. 18-35సంవత్సరాల వయస్సు కలిగి, రూ. 50వేల లోపు వార్షిక ఆదాయం, టెన్త్ పాస్ లేదా ఫెయిల్ అయినవారు అర్హులన్నారు. ఐదో తరగతి చదివిన ఎస్సీ, ఎస్టీ, వికలాంగ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపీడీవో, మున్సిపాలిటీ కార్యాలయాల్లో దరఖాస్తులు ఉచితంగా లభిస్తాయన్నారు. ఆయా మండలాలు, మున్సిపాలిటీల్లో అధికారులు నిర్ణయించిన గడువు తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. దరఖాస్తుదారులు గతంలో ఏ ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి లబ్ధి పొంది ఉండకూడదని తెలిపారు. మండలాలు, మున్సిపాలిటీల ఎంపిక కమిటీలు ఎంపిక చేసిన ప్రకారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎంపిక కమిటీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. -
‘జీనోమిక్స్’తో కేన్సర్ నిర్ధారణ ఉత్తమం
హెచ్‌సీజీ వైద్య సంస్థల చైర్మన్ అజయ్‌కుమార్ సాక్షి, బెంగళూరు : కేన్సర్ నిర్ధారణలో సంప్రదాయ పద్ధతి కన్నా జీనోమిక్స్ ఆధారిత విధానం ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుందని హెచ్‌సీజీ వైద్య సంస్థల చైర్మన్ బి.ఎస్.అజయ్‌కుమార్ తెలిపారు. కేన్సర్ రోగ నిర్ధారణ పరిశోధనల పరంగా ప్రముఖ లాబోరేటరీ స్టాండర్డ్ లైఫ్ సైన్స్, హెచ్‌సీజీ సంస్థల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా స్టాండర్డ్ లైఫ్ సైన్స్ చైర్మన్ విజయ్ చంద్రుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సంప్రదాయ రోగ నిర్ధారణలో కేన్సర్ ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్‌లో ఉంది అనే విషయాన్ని గుర్తించేందుకు వీలవుతుందని అన్నారు. అయితే జీనోమిక్స్ ఆధారిత రోగ నిర్ధారణలో రోగికి ఏ స్థితిలో కేన్సర్ కారకం ఉందనే విషయంతో పాటు కుటుంబసభ్యులో ఎవరికైనా ఇదే విధమైన కేన్సర్ వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని కూడా గుర్తించవచ్చునని వివరించారు. కేన్సర్ కణం పరిమాణంతో పాటు ఎంత వేగంగా ఏ దిశలో విస్తరిస్తోందో కచ్చితంగా తెలుసుకునే అవకాశం కూడా ఉందన్నారు. దీని వల్ల రోగికి చికిత్స ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. దేశంలో తొలిసారిగా బెంగళూరులోని హెచ్‌సీజీ కేంద్ర కార్యాలయంలో ఈ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 60 మందికి జీనోమిక్స్ విధానంలో రోగ నిర్ధారణ చేసినట్లు చెప్పారు. ఈ విధానానికి రెండు వారాల సమయం పడుతుందని, ఉత్తమ ఫలితాలు ఉన్నాయని పేర్కొన్నారు. రోగితో పాటు సంబంధీకులు ఎంతమందికి పరీక్షలు చేయాలనే విషయం కేన్సర్ రకం, స్టేజ్‌పై ఆధాపడి ఉంటుందని అన్నారు. కాగా, ప్రస్తుతం బ్రెస్ట్, ఓవరీ, లంగ్ కేన్సర్లకు జీనోమిక్ ఆధారిత రోగనిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని రకాల కేన్సర్ పరీక్షలకు వీటిని ఉపయోగిస్తామని అజయ్‌కుమార్ వివరించారు. -
‘డీడీఏ’ స్కాంలో మరో ముగ్గురి అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) ప్లాట్ల కుంభకోణంలో మరో ముగ్గురిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. డీడీఏ ప్లాట్లు ఇస్తామంటూ అమాయకుల నుంచి రూ.3.83 కోట్ల దండుకున్న కేసులో ఇప్పటికే నలుగురు కటకటాలపాలైన విషయం తెలిసిందే . బుధవారం అరెస్టయిన ముగ్గురిలో ఇద్దరు డీడీఏ ఉద్యోగులు ఉన్నట్లు క్రైం బ్రాంచి అడిషనల్ కమిషనర్ అరవిందర్ యాదవ్ తెలిపారు. పోలీసులు పేర్కొన్న ప్రకారం.. ప్రేమ్ శంకర్ ముఠాకి చెందిన నిందితులంతా ఈ కుంభకోణానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ముఖర్జీనగర్కి చెందిన కన్వల్సాహ్ని అనే వ్యక్తికి డీడీఏ కార్యాలయం నుంచి డీడీఏ ప్లాట్ కేటాయించినట్టు ఓ లెటర్ వచ్చింది. ఇందుకు సంబంధించి అతడు డీడీఏ కార్యాలయం పేరుతో కొంత మొత్తాన్ని డీడీ రూపంలో అందులో ఉన్న నంబర్లో జమ చేశాడు. తర్వాత కొన్నాళ్లకి తనకు ఇచ్చిన ధ్రువపత్రాలు నకిలీవని తెలియడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును క్రైం బ్రాంచికి అప్పగించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీనిలో డీడీఏకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర సైతం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. బుధవారం నవీన్‌కుమార్, అజయ్‌కుమార్, శైలేందర్ భాటియాలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం ముఠాకి ప్రేమ్‌శంకర్ శర్మ నాయకుడని పోలీసులు గుర్తిం చారు. అతడి ఆధ్వర్యంలోనే బాధితులకు నకిలీ అలాట్మెంట్ లెటర్లు పంపినట్టు గుర్తించారు. నిందితులంతా కలిసి రూ.3.83 కోట్ల రూపాయలు దండుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందతులందరినీ అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వారు పేర్కొన్నారు.