ఖమ్మం హవేలి: రాజీవ్ యువశక్తి పథకం (2014-15) ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిం చేందుకు రుణాల మంజూరుకు సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సెట్‌కం సీఈఓ అజయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం సెట్‌కం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2వ తేదీన చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు, 3న ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, 4న చంద్రుగొండ, ఏన్కూర్, జూలూరుపాడు, వైరా, తల్లాడ, కొణిజర్ల, 5న అశ్వారావుపేట, దమ్మపేట, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, 9న అశ్వాపురం, కొత్తగూడెం రూరల్, మణుగూరు రూరల్, ములకలపల్లి, పినపాక, పాల్వంచ రూరల్, 10న గార్ల, బయ్యారం, గుండాల, కామేపల్లి, సింగరేణి, టేకులపల్లి, ఇల్లెందు రూరల్, 11న బోనకల్, చింతకాని, మధిర, ముదిగొండ, రఘునాథపాలెం, ఎర్రుపాలెం, 12న కొత్తగూడెం మున్సిపాలిటీ, మధిర మున్సిపాలిటీ, మణుగూరు మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీ, సత్తుపల్లి మున్సిపాలిటీ, ఇల్లెందు మున్సిపాలిటీ, 16న ఖమ్మం కార్పొరేషన్, 17న భద్రాచలం, బూర్గంపాడు, చింతూరు, కుక్కునూరు, కూనవరం, వరరామచంద్రాపురం, వేలేరుపాడులో ఇంట ర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మండలాల్లో ఎంపిక కమిటీలకు ఎంపీడీవో కన్వీనర్‌గా, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు కన్వీనర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు.
అశ్వారావుపేట నియోజకవర్గానికి 42, భద్రాచలం నియోజకవర్గానికి 41, ఖమ్మం నియోజకవర్గానికి 42, కొత్తగూడెం నియోజకవర్గానికి 42, మధిర నియోజకవర్గానికి 37, పాలేరు నియోజకవర్గానికి 38, పినపాక నియోజకవర్గానికి 25, సత్తుపల్లి నియోజకవర్గానికి 39, వైరా నియోజకవర్గానికి 32, ఇల్లెందు నియోజకవర్గానికి 36 వ్యక్తిగత యూనిట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత యూనిట్ల కింద సేవలు, పరిశ్రమల రంగాలకు యూనిట్లకు సంబంధించి గరిష్టంగా రూ. లక్ష రుణం మంజూరు ఇస్తామన్నారు. సబ్సిడీ గరిష్టంగా రూ.30 వేలు ఉంటుందన్నారు. 18-35సంవత్సరాల వయస్సు కలిగి, రూ. 50వేల లోపు వార్షిక ఆదాయం, టెన్త్ పాస్ లేదా ఫెయిల్ అయినవారు అర్హులన్నారు.
ఐదో తరగతి చదివిన ఎస్సీ, ఎస్టీ, వికలాంగ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపీడీవో, మున్సిపాలిటీ కార్యాలయాల్లో దరఖాస్తులు ఉచితంగా లభిస్తాయన్నారు. ఆయా మండలాలు, మున్సిపాలిటీల్లో అధికారులు నిర్ణయించిన గడువు తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. దరఖాస్తుదారులు గతంలో ఏ ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి లబ్ధి పొంది ఉండకూడదని తెలిపారు. మండలాలు, మున్సిపాలిటీల ఎంపిక కమిటీలు ఎంపిక చేసిన ప్రకారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎంపిక కమిటీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
సెప్టెంబర్ 2 నుంచి రాజీవ్ యువశక్తి ఇంటర్వ్యూలు
Published Fri, Aug 15 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM
Advertisement