blind T20 World Cup
-
టీ20 వరల్డ్‌కప్-2022 గెలిచిన టీమిండియా.. ఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయం
T20 World Cup For Blind: భారత అంధుల క్రికెట్ టీమ్ వరుసగా మూడసారి టీ20 వరల్డ్‌కప్ కైవసం చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (డిసెంబర్ 17) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్.. బంగ్లాదేశ్‌ను 120 తేడాతో ఓడించి జగజ్జేతగా అవతరించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. సునీల్ రమేశ్ (63 బంతుల్లో 136), అర్జున్ కుమార్ రెడ్డి (50 బంతుల్లో 100 నాటౌట్) సెంచరీలతో రెచ్చిపోవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 278 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో లలిత్ మీనా, అజయ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. Many congratulations to team India for winning the T20 World Cup for blind. pic.twitter.com/fbLge7UQVi — Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2022 కాగా, టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ గెలవడం ఇది వరుసగా మూడసారి. 2012లో జరిగిన ఇనాగురల్ టోర్నీలో భారత్ పాకిస్తాన్‌ను ఖంగుతినిపించి, తొలిసారి ఈ ఫార్మాట్లో ఛాంపియన్‌గా నిలిచింది. అనంతరం 2017లో జరిగిన రెండో ఎడిషన్‌లోనూ భారత్ ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. తాజాగా జరిగిన టోర్నీలో గెలవడం ద్వారా భారత్ హ్యాట్రిక్ వరల్డ్‌కప్‌లు సాధించింది. హ్యాట్రిక్ వరల్డ్‌కప్‌లు సాధించిన టీమిండియా వన్డే ఫార్మాట్లో జరిగే వరల్డ్‌కప్‌లను కూడా రెండుసార్లు (2014, 2018) కైవసం చేసుకుంది. ఈ రెండుసార్లు కూడా భారత్.. ఫైనల్లో పాకిస్తాన్‌పైనే విజయం సాధించింది. -
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. సెమీస్‌లో దక్షిణాఫ్రికా చిత్తు
బెంగళూరు: అంధుల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 207 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. గుంటూరు జిల్లాకు చెందిన అజయ్ 81 పరుగులు సాధించడంతోపాటు 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మరో ప్లేయర్ సునీల్ రమేశ్ (110) సెంచరీ చేశాడు. ముందుగా భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు సాధించగా... దక్షిణాఫ్రికా 19.5 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. శనివారం జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ ఆడుతుంది. చదవండి: IND Vs BAN: కోహ్లి సైగ చేశాడు.. సిరాజ్ అనుకరించాడు; ఒళ్లు మండినట్టుంది -
Blind T20 World Cup 2022: భారత జట్టు కెప్టెన్‌గా అజయ్
స్వదేశంలో ఈ ఏడాది డిసెంబర్ 6 నుంచి 17 వరకు జరిగే అంధుల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. 17 మంది సభ్యులుగల టీమిండియాకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన వెంకటేశ్వర రావును వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ మెగా ఈవెంట్‌కు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. గతంలో భారత జట్టు రెండుసార్లు (2012, 2017) ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది. భారత జట్టు: అజయ్ కుమార్ రెడ్డి (కెప్టెన్), వెంకటేశ్వర రావు (వైస్ కెప్టెన్), దుర్గా రావు, ఎ.రవి (ఆంధ్రప్రదేశ్), లలిత్ మీనా (రాజస్తాన్), ప్రవీణ్, దీపక్ (హరియాణా), సుజీత్ (జార్ఖండ్), నీలేశ్ యాదవ్, , ఇర్ఫాన్ (ఢిల్లీ), సోనూ (మధ్యప్రదేశ్), సొవేందు (బెంగాల్), నకులా (ఒడిశా), లోకేశ, సునీల్, ప్రకాశ్ (కర్ణాటక), దినగర్ (పాండిచ్చేరి). -
ఎదురులేని భారత్
అంధుల టి20 ప్రపంచకప్ అహ్మదాబాద్: డిఫెండింగ్ చాంపియన్ భారత్ అంధుల టి20 ప్రపంచకప్‌లో తమ జోరు కొనసాగిస్తోంది. శ్రీలంకతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కిది ఐదో విజయం కావడం విశేషం. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 186 పరుగులు చేసింది. చందన దేశప్రియ (62; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... భారత బౌలర్లలో సునీల్ మూడు, కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీశారు. 187 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 13.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి అధిగమించింది. ఓపెనర్ ప్రకాశ్ (99 నాటౌట్; 20 ఫోర్లు) సెంచరీకి పరుగు దూరంలో నిలువగా... కేతన్ (56 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 142 పరుగులు జోడించారు. పది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్ 15 పాయింట్లతో పాక్, బంగ్లాదేశ్ జట్లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది.