ఎదురులేని భారత్‌ | India continue winning run in T20 World Cup for blind, beat Sri Lanka by nine wickets | Sakshi
Sakshi News home page

ఎదురులేని భారత్‌

Published Sun, Feb 5 2017 1:30 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపాని చేతుల మీదుగా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకుంటున్న ప్రకాశ్‌

గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపాని చేతుల మీదుగా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకుంటున్న ప్రకాశ్‌

అంధుల టి20 ప్రపంచకప్‌
అహ్మదాబాద్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ అంధుల టి20 ప్రపంచకప్‌లో తమ జోరు కొనసాగిస్తోంది. శ్రీలంకతో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కిది ఐదో విజయం కావడం విశేషం. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 186 పరుగులు చేసింది.

చందన దేశప్రియ (62; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... భారత బౌలర్లలో సునీల్‌ మూడు, కెప్టెన్‌ అజయ్‌ కుమార్‌ రెడ్డి రెండు వికెట్లు తీశారు. 187 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్‌ 13.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్‌ కోల్పోయి అధిగమించింది. ఓపెనర్‌ ప్రకాశ్‌ (99 నాటౌట్‌; 20 ఫోర్లు) సెంచరీకి పరుగు దూరంలో నిలువగా... కేతన్‌ (56 నాటౌట్‌) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 142 పరుగులు జోడించారు. పది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్‌ 15 పాయింట్లతో పాక్, బంగ్లాదేశ్‌ జట్లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement