
బెంగళూరు: అంధుల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 207 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
గుంటూరు జిల్లాకు చెందిన అజయ్ 81 పరుగులు సాధించడంతోపాటు 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మరో ప్లేయర్ సునీల్ రమేశ్ (110) సెంచరీ చేశాడు. ముందుగా భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు సాధించగా... దక్షిణాఫ్రికా 19.5 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. శనివారం జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ ఆడుతుంది.
చదవండి: IND Vs BAN: కోహ్లి సైగ చేశాడు.. సిరాజ్ అనుకరించాడు; ఒళ్లు మండినట్టుంది
Comments
Please login to add a commentAdd a comment