Icc World Cup 2023 Qualifying Race: భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే ప్రపంచకప్-2023లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల ఆధారంగా 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తే.. మరో రెండు జట్లు క్వాలిఫియర్ రౌండ్లలో విజయం సాధించి ఈ మెగా ఈవెంట్‌లో అడుగుపెడతాయి. ఇక సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఇప్పటికే తొలి ఏడు స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ప్రపంచకప్ టోర్నీలో అడుగుపెట్టాయి.
ఇక మిగిలిన ఒక్కగానొక్క చివరి స్థానం కోసం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పోటీపడుతున్నాయి. అయితే ఈ ఏడాది మే1 నాటికి పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఏ జట్టు ఉంటుందో ఆ జట్టుకు నేరుగా ప్రపంచకప్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ మూడు జట్లలో ఏ జట్టుకు ఐసీసీ టోర్నీలో డైరెక్ట్‌గా అడుగుపెట్టే ఛాన్స్ ఉందో.. అందుకు గల సమీకరణాలు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం.
వెస్టిండీస్
ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ జట్టు 88 పాయింట్లతో ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. అయితే కరీబియన్ జట్టు ఆడాల్సిన సూపర్ లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి.
కాబట్టి విండీస్ ప్రత్యక్షంగా ప్రపంచకప్‌కు చేరడం కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే విండీస్ తర్వాతి స్థానాల్లో ఉన్న దక్షిణాఫ్రికాకు రెండు మ్యాచ్‌లు, శ్రీలంకకు మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లలో ఏదో ఒకటి సులువగానే విండీస్‌ను అధిగమిస్తుంది.
దక్షిణాఫ్రికా..
ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 79 పాయింట్లతో 9 వస్థానంలో ఉంది. గతేడాది ఆఖరి వరకు 11వ స్థానంలో ఉన్న ప్రోటీస్ జట్టు ఇంగ్లండ్‌పై మూడు వన్డేల సిరీస్‌లో రెండు వరుస విజయాలు సాధించడంతో 9వ స్థానానికి చేరుకుంది. ఇంకా సూపర్ లీగ్‌లో ప్రోటీస్ జట్టుకు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
ఈ ఏడాది మార్చిలో నెదార్లాండ్స్‌తో ప్రోటీస్ రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేస్తే 8వ స్థానానికి చేరుకుంటుంది. అయితే శ్రీలంక నుంచి మాత్రం దక్షిణాఫ్రికాకు ముప్పు పొంచి ఉంది.
ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా శ్రీలంక.. కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపనడుంది. ఈ సిరీస్‌లో లంక కనీసం రెండు మ్యాచ్‌లలోనైనా ఓటమిపాలైతేనే ప్రోటీస్ తన ఎనిమిదవ స్థానాన్ని నిలబెట్టకుంటుంది.
శ్రీలంక
ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో శ్రీలంక ప్రస్తుతం 77 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. ఎటువంటి సమీకరాణాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.
అదే విధంగా దక్షిణాఫ్రికా నెదార్లాండ్స్ చేతిలో రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి.. కివీస్‌పై లంక కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా విజయం సాధించిన చాలు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంటుంది.! అయితే, డచ్ జట్టు వంటి పసికూనతో ప్రొటీస్ పోరు.. పటిష్టమైన కివీస్‌తో అది కూడా న్యూజిలాండ్ గడ్డపై పోటీ నేపథ్యంలో లంక కంటే సౌతాఫ్రికానే ఓ అడుగు ముందుంటుందని చెప్పడంలో సందేహం లేదు.
చదవండి: ENG vs SA: దక్షిణాఫ్రికా గడ్డపై అర్చర్ సరికొత్త చరిత్ర.. 30 ఏళ్ల రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment