టీ20 వరల్డ్-2024 ఫైనల్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు ఇప్పటికే తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ 13 ఏళ్ల వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరదించాలని భారత్ భావిస్తుంటే.. మరోవైపు దక్షిణాఫ్రికా తొలిసారి ట్రోఫీని ముద్దాడాలన్న కసితో ఉంది.
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు ఆ జట్టు మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ కీలక సూచనలు చేశాడు. ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కొనేందుకు ప్రోటీస్ బ్యాటర్లు అతిగా ఆలోచించకూడదని మోర్కల్ అభిప్రాయపడ్డాడు.
కాగా ఈ ఏడాది మెగా టోర్నీలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ దుమ్ములేపుతున్నారు. బుమ్రా తన 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ కేవలం 4 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు.
"బుమ్రా అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడిని ఎదుర్కొవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆరంభంలో వికెట్లు తీసే సత్తా బుమ్రాకు ఉంది. అంతేకాకుండా డెత్ ఓవర్లలో కూడా అతడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు.
పవర్ ప్లేలో రెండు ఓవర్లు, తర్వాత మళ్లీ ఆఖరి ఓవర్లలోనే బుమ్రా అటాక్‌లో వస్తాడు. కాబట్టి మా జట్టుకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. మిడిల్ ఓవర్లలో మా బ్యాటర్లు బాగా రాణించి పరుగులు చేపట్టాలి.
అప్పుడే గౌరవప్రదమైన స్కోరును సాధించడానికి అవకాశముంటుంది. అయితే మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లను ఎటాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడొక వికెట్ టేకర్. తన బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తడిలోకి నెట్టగలడు.
కాబట్టి సౌతాఫ్రికా బ్యాటర్లు ఒత్తడికి లోనవ్వకుండా బాల్ టూ బాల్ టూ ఆచితూచి ఆడాలి. అప్పుడే దక్షిణాఫ్రికా గేమ్‌లో ఉటుందని"ఈఎస్పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోర్కల్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment