నిత్యం కంప్యూటర్లు, నెట్‌వర్కింగ్ అంటూ రిక్రూట్‌మెంట్ చుట్టూ తిరిగే HR(హెచ్‌ఆర్) ఉద్యోగులు ఇప్పుడు క్రికెట్ మైదానంలో దుమ్ములేపారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ వేదికగా జరిగిన రిక్రూట్‌మెంట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. రిక్రూటర్లు లాప్‌టాప్‌లు పక్కనబెట్టి.. క్రికెట్ బ్యాట్‌లు పట్టుకుని మురిపించారు.
తామూ సిక్సర్లు కొట్టగలమని నిరూపించారు. ఏప్రిల్ 6న ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం 22 నాకౌట్ మ్యాచ్‌లు జరిగాయి. ఎమోనిక్స్, విరాట్ ఛాలెంజర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీకి ఎండ్‌కార్డ్ పడింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో విరాట్ ఛాలెంజర్స్ విజేతగా నిలిచింది. దీంతో సీజన్ 1 టైటిల్‌ను ఛాలెంజర్స్ జట్టు కైవసం చేసుకుంది. ఒక్కో టీంలో 8 మంది ప్లేయర్ల చొప్పున ఆడారు. ఇందులో మహిళలు కూడా ఉండడం విశేషం.
అవార్డులు ఎవరికి అంటే?
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(అన్ని మ్యాచ్‌లకు), బెస్ట్ బ్యాట్స్‌మన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫీల్డర్ ప్రతిష్టాత్మకమైన మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డలను అందజేశారు.
CRI రైడర్స్ ఆటగాడు రోహిత్ బెస్ట్ బ్యాటర్ అవార్డును అందుకోగా.. విరాట్ ఛాలెంజర్స్ ఆటగాడు వెంకట్ ఉత్తమ బౌలర్‌గా నిలిచాడు. అదే విధంగా టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన విరాట్ ఛాలెంజర్ ప్లేయర్.. మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్, నవీన్ బెస్ట్ ఫీల్డర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు.
ఫ్రైజ్ మనీ ఎంతంటే?
విజేతగా నిలిచిన విరాట్ ఛాలెంజర్స్‌కు విన్నర్ కప్‌తో పాటు, రూ.50,000 నగదు బహుమతిని అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన ఎమోనిక్స్ జట్టుకు రూ.30,000 నగదు బహుమతి లభించింది. ఇక రిక్రూటర్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో విజయం సాధించడం పట్ల థ్రిల్‌గా ఉన్నామని టోర్నీ నిర్వాహకుడు రోహిత్ అన్నారు.
"పాల్గొన్న అన్ని జట్లు ప్రదర్శించిన ఉత్సాహం, క్రీడాస్ఫూర్తి నిజంగా అభినందనీయం. ఛాంపియన్‌లుగా అవతరించినందుకు విరాట్ ఛాలెంజర్స్‌కు, అత్యుత్తమ ప్రదర్శన చేసిన అన్ని జట్లకు మా హృదయపూర్వక అభినందనలు. ఈ టోర్నమెంట్ నియామక పరిశ్రమలోని నిపుణుల మధ్య ఐక్యత, స్నేహ భావాన్ని పెంపొందించడానికి దోహదపడిందని "రోహిత్ పేర్కొన్నాడు.ఈ టోర్నమెంట్‌ను లింక్‌డ్ ఇన్, కన్‌రెప్, డిలిజెంట్‌తో పాటు స్టాఫింగ్ రివార్డ్స్ సంస్థలు స్పాన్సర్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment