
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానవ వనరుల నిర్వహణ సంస్థల సమాఖ్య ఎస్‌హెచ్‌ఆర్‌ఎంకి సంబంధించిన ’ఎస్‌హెచ్‌ఆర్‌ఎంటెక్23’ సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కాన్ఫరెన్స్‌లో 120 పైచిలుకు వక్తలు, 4,000 పైగా హెచ్‌ఆర్, టెక్నాలజీ నిపుణులు పాల్గొంటున్నారు. సంబంధిత అంశాలపై 60 పైగా సెషన్లు నిర్వహిస్తున్నారు.
కొత్త ధోరణులు, నవకల్పనల గురించి హెచ్‌ఆర్ నిపుణులు చర్చించుకునేందుకు ఇది వేదికగా ఉపయోగపడగలదని ఎస్‌హెచ్‌ఆర్‌ఎం ఇండియా సీఈవో అచల్ ఖన్నా తెలిపారు. సాంకేతిక పురోగతి, దాని పరిణామాలు మానవ సామరŠాధ్యలపై గణనీయంగా ప్రభావం చూపుతున్నాయని కోవీలింగ్ అండ్ ఫ్రాంక్లిన్‌కోవీ సహ వ్యవస్థాపకుడు స్టీఫెన్ ఎంఆర్ కోవీ తెలిపారు. టెక్నాలజీ వినియోగంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.