technology using
-
Kavita Shukla: అమ్మమ్మ ఇంట్లో వచ్చిన ఐడియా జీవితాన్నే మార్చేసింది!
సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళితే ఏం దొరుకుతుంది? అంతులేని ఆనందం. అయితే అమెరికా నుంచి ఇండియాలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చిన కవితా శుక్లాకు ఆనందంతో పాటు ‘ఐడియా’ కూడా దొరికింది. ఆ ఐడియా ఆమెను ఇన్వెంటర్ని చేసింది. ఆ తరువాత ఎంటర్‌ప్రెన్యూర్‌ను చేసింది. ఇన్వెంటర్, ఎంటర్ప్రెన్యూర్, మోటివేషనల్ స్పీకర్, డిజైనర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది కవితా శుక్లా... చిన్నప్పటి నుంచి సైన్స్, కళలు అంటే కవితకు ఆసక్తి. సైన్స్‌లో రకరకాల ప్రయోగాలు చేసేది. తాను ఇన్నోవేటర్ కావడానికి ఆ ప్రయోగాలు పునాదిగా ఉపయోగపడ్డాయి. పదిహేడు సంవత్సరాల వయసులోనే ఎన్నో పేటెంట్లు తీసుకుంది. ‘ఫ్రెష్‌పేపర్’ రూపంలో ఆహార వ్యర్థాలను తగ్గించే సాంకేతిక ఆవిష్కరణ కవితకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చింది. ఈ ఫ్రెష్ పేపర్ ఆహారం, కూరగాయలలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను నిరోధించి వాటిని ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది. బోస్టన్లోని స్థానిక రైతు మార్కెట్ లో ఫ్రెష్ పేపర్ లాంచ్ చేశారు. మౌత్‌టాక్‌తోనే ఈ పేపర్ పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ ఫ్రెష్‌పేపర్ 180 దేశాల్లో అందుబాటులో ఉంది. ‘యూఎస్‌లో ఆహార వృథా అనేది ఇంత పెద్ద సమస్య అని తెలియదు. ఫ్రెష్పేపర్కు వచ్చిన స్పందన నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. పండ్లు, కూరగాయలు, ఆహారాన్ని తాజాగా ఉంచడానికి తద్వారా ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. లోకల్ఫుడ్ బ్యాంకులకు వీటిని విరాళంగా ఇచ్చాం’ అంటుంది కవిత. ఫుడ్ ప్రిజర్వేషన్‌కు సంబంధించిన ఆసక్తి కవితలో పదమూడు సంవత్సరాల వయసు నుంచే మొదలైంది. సెలవులు వచ్చినప్పుడు ఇండియాలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది కవిత. ఒకరోజు పొరపాటున కలుషితమైన నీరు తాగింది. ఆందోళన పడిన అమ్మమ్మ వెంటనే కవితతో ఏదో కషాయం తాగించింది. దీంతో కవితకు ఏమీ కాలేదు. అమెరికాకు తిరిగిన వచ్చిన తరువాత కషాయంలో అమ్మమ్మ ఉపయోగించిన పదార్థాల గురించి వివరంగా తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆహారపదార్థాలు, కూరగాయలు చెడిపోకుండా సంరక్షించడానికి సంబంధించిన పరిశోధనలు మొదలుపెట్టింది. జర్మనీలో పుట్టిన కవిత ఇలియట్ సిటీ (యూఎస్)లో పెరిగింది. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పుచ్చుకుంది. ‘ సింపుల్ ఐడియాలకు మార్పు తెచ్చే శక్తి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు’ అంటుంది కవిత. ఆహార భద్రత, సంరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కవిత మోటివేషనల్ స్పీకర్ కూడా. ఎన్నో కాలేజీలలో, సమావేశాలలో యువతను ఉద్దేశించి ఉత్తేజకరమైన ప్రసంగాలు చేసింది. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్లు అందుకుంది. ఫోర్బ్స్ ‘30 అండర్ 30: సోషల్ ఎంటర్ ప్రెన్యూర్స్’ టైమ్ మ్యాగజైన్ ‘5 మోస్ట్ ఇనోవేటివ్ ఉమెన్ ఇన్ ఫుడ్’ న్యూస్‌వీక్ ‘125 ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ జాబితాలలో చోటు సంపాదించింది. రెండు సంవత్సరాల క్రితం వర్జీనియాలో జరిగిన వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఇండిపెంటెంట్ ఇన్వెంటర్లు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొఫెషనల్స్ సమావేశంలో కీలక ఉపన్యాసం ఇచ్చింది. ఇన్వెంటర్ అయిన కవిత ‘ఫ్రెష్ గ్లో’ కంపెనీతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా అద్భుత విజయం సాధించింది. ‘మీకు ఏదైనా ఆసక్తిగా అనిపిస్తే దాని గురించి లోతుగా ఆలోచించండి. ఆ తరువాత పరిశోధించండి. ఫలితాలు చేతికి అందేవరకు ప్రయోగాలు చేయండి’ అంటుంది కవిత. ఆలోచించండి... అద్భుతాలు చేయండి కష్టాల దారిలో ప్రయాణించి విజయాలు సాధించిన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ల గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. వారి గురించి సమావేశాల్లో చెబుతుంటాను. వారి విజయగాథలు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తాయి. ఆలోచిస్తే ఐడియాలు వస్తాయి. ఆ ఐడియాలతో ఎన్ని గొప్ప పనులైనా చేయవచ్చు. మన ఐడియాను మొదట ఇతరులతో పంచుకోవడానికి భయంగా అనిపిస్తుంది. ఆ భయాన్ని వదులుకొని ఆత్మవిశ్వాసంతో చెప్పండి. ఆత్మవిశ్వాసం ఉన్న చోటుకి విజయం త్వరగా వస్తుంది. – కవితా శుక్లా, ఫ్రెష్ గ్లో కంపెనీ ఫౌండర్, సీయీవో ∙చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో కవితా శుక్లా -
టెక్నాలజీ అత్యవసరం.. అందిపుచ్చుకోవాల్సిందే
న్యూఢిల్లీ: పలు హైకోర్టుల్లో వర్చువల్ విచారణల శాతం తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు విస్మయం వెలిబుచి్చంది. అన్ని కోర్టులు, దేశంలో ప్రతి జడ్జీ టెక్నాలజీని వీలైనంత త్వరగా అందిపుచ్చుకోవాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. పంజాబ్, హరియాణా హైకోర్టు విచారణల్లో వీడియో కాన్ఫరెన్స్ వాడకాన్ని పూర్తిగా పక్కన పెట్టిందంటూ దాఖలైన పిటిషన్‌పై సీజేఐ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. న్యాయమూర్తులు టెక్నాలజీ వాడకంలో నిష్ణాతులా కాదా అన్నది కాదు సమస్య. కానీ వారికి దాని వాడకం తెలిసి ఉండాలి. లేదంటే అది అలవాటయ్యేలా శిక్షణ తీసుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా ఇది వర్తిస్తుంది. టెక్నాలజీ వాడకం మీద అవగాహన కోసం వాళ్లు ప్రత్యేక కేంద్రాలకు వెళ్లి శిక్షణ తీసుకున్నారు‘ అని పేర్కొంది. నేటి పరిస్థితుల్లో టెక్నాలజీ వాడకం ఇంకెంతమాత్రమూ ఆప్షన్ కాదని, అత్యవసర పనిముట్టుగా మారిందని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఈ మార్పు దిశగా లాయర్లను కూడా సిద్ధం చేయక తప్పదని అభిప్రాయపడ్డారు. బాంబే హైకోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌లకు ఉద్దేశించిన స్క్రీన్స్‌ను తీసేయడం దారుణమన్నారు. ఇకపై మన దేశంలో జడ్జి కావాలంటే టెక్ ఫ్రెండ్లీగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. -
హైదరాబాద్‌లో ఎస్‌హెచ్‌ఆర్‌ఎం సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మానవ వనరుల నిర్వహణ సంస్థల సమాఖ్య ఎస్హెచ్ఆర్ఎంకి సంబంధించిన ’ఎస్హెచ్ఆర్ఎంటెక్23’ సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కాన్ఫరెన్స్‌లో 120 పైచిలుకు వక్తలు, 4,000 పైగా హెచ్ఆర్, టెక్నాలజీ నిపుణులు పాల్గొంటున్నారు. సంబంధిత అంశాలపై 60 పైగా సెషన్లు నిర్వహిస్తున్నారు. కొత్త ధోరణులు, నవకల్పనల గురించి హెచ్ఆర్ నిపుణులు చర్చించుకునేందుకు ఇది వేదికగా ఉపయోగపడగలదని ఎస్‌హెచ్‌ఆర్‌ఎం ఇండియా సీఈవో అచల్ ఖన్నా తెలిపారు. సాంకేతిక పురోగతి, దాని పరిణామాలు మానవ సామరŠాధ్యలపై గణనీయంగా ప్రభావం చూపుతున్నాయని కోవీలింగ్ అండ్ ఫ్రాంక్లిన్కోవీ సహ వ్యవస్థాపకుడు స్టీఫెన్ ఎంఆర్ కోవీ తెలిపారు. టెక్నాలజీ వినియోగంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. -
టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ టాప్
సాక్షి, అమరావతి: అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా గవర్నెన్స్ నౌ–2022 కింద ప్రకటించిన అవార్డుల్లో 14 అవార్డులను కైవసం చేసుకుంది. పోలీస్ ప్రధాన కార్యాలయం నాలుగు, విశాఖపట్నం సిటీ, శ్రీకాకుళం, కాకినాడ, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లా పోలీస్ విభాగాలు ఒక్కొక్కటి చొప్పున, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాలు రెండు అవార్డుల చొప్పున దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం మాట్లాడుతూ.. ఏపీ పోలీస్ శాఖ టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతోందని, స్వల్ప కాలంలోనే మొత్తంగా 189 జాతీయ అవార్డులను దక్కించుకోవడం తమ శాఖ పనితీరుకు నిదర్శనమని చెప్పారు. ఏ టెక్నాలజీని వినియోగించినా వాటి ఫలాలను క్షేత్రస్థాయిలో అందించి ప్రజలకు సత్వర న్యాయం చేసినప్పుడే అది అర్థవంతమవుతుందన్నారు. ఈ విజయం వెనుక సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఏపీ పోలీస్ శాఖను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. అవార్డులు ఇలా.. శ్రీకాకుళం కమ్యూనిటీ పోలీసింగ్, విశాఖపట్నం సిటీ మహిళా భద్రత, కాకినాడ స్ట్రాటజిక్ రెస్పాన్స్ సెంటర్, ఎన్టీఆర్ ఈ–పోలీసింగ్ ఇనిషియేటివ్, రోడ్డు సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ప్రకాశం సర్వేలెన్స్ అండ్ మానిటరింగ్, చిత్తూరు నేరాల గుర్తింపులో టెక్నాలజీ వినియోగం, తిరుపతి మహిళల భద్రత, పోలీసింగ్ ఇనిషియేటివ్ టెక్నాలజీ, కడప కమాండ్ అండ్ కంట్రోల్ విభాగంలోను అవార్డులను దక్కించుకోగా, పోలీస్ ప్రధాన కార్యాలయానికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్‌లో రెండు, పోలీస్ ఆధునికీకరణలో రెండు మొత్తం నాలుగు అవార్డులు దక్కాయి. -
సాగుకు ‘టెక్’ సాయం..!
బెంగళూరు: దేశీయంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం వివిధ స్థాయిల్లో గణనీయంగా పెరుగుతోంది. దీనితో ఇటు దిగుబడులు, అటు రైతాంగానికి రాబడులు మెరుగుపడుతున్నాయి. సాంకేతికత వినియోగంతో వచ్చే రెండు దశాబ్దాల్లో వ్యవసాయంలో గణనీయంగా మార్పులు రాగలవని, సాగు రంగం ముఖచిత్రం మారిపోగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతులు నిత్యం ఎదుర్కొనే పలు సవాళ్ల పరిష్కారానికి అగ్రి–టెక్ సంస్థలు రూపొందిస్తున్న అనేకానేక స్మార్ట్ సొల్యూషన్స్ ఇందుకు దోహదపడనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్లు వంటి మెషీన్ లెర్నింగ్ సొల్యూషన్లు, కచ్చితమైన వ్యవసాయ టెక్నిక్‌లు .. నాట్లు మొదలుకుని పంట రక్షణ, సాగు, కోతల దాకా అన్ని దశల్లోనూ రైతాంగానికి ప్రస్తుతం ఉపయోగపడుతున్నాయి. వాతావరణాన్ని అంచనా వేయడానికి జీఐఎస్ మ్యాప్‌లు, శాటిలైట్ డేటాను ఉపయోగించడం, క్రిమిసంహారకాలను జల్లేందుకు కొత్త విధానాలు పాటించడం మొదలైనవి అమల్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రి–టెక్ స్టార్టప్ సంస్థలకు పుష్కలంగా పెట్టుబడులు కూడా అందుతున్నాయి. అమెరికాకు చెందిన ఫుడ్‌టెక్, అగ్రిటెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అయిన అగ్‌ఫండర్ నివేదిక ప్రకారం 2020లో దేశీ అగ్రి ఫుడ్ స్టార్టప్‌లలోకి 1.1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. కన్సల్టెన్సీ సంస్థ బెయిన్ అండ్ కో అంచనా ప్రకారం 2025 నాటికి అగ్రి–లాజిస్టిక్స్, ఉత్పత్తి కొనుగోళ్ళు, ఎరువులు మొదలైన వాటి వినియోగం విలువ దాదాపు 30–35 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. అర్ధ శతాబ్ద ఫలితాలు.. రెండున్నర దశాబ్దాల్లో జినోమిక్స్ సహాయంతో ఇక్రిశాట్ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్), ఇతర పరిశోధన సంస్థలతో కలిసి .. కరువు, తెగుళ్లను సమర్థంగా ఎదుర్కొనే వినూత్న శనగల వెరైటీలను రూపొందించింది. ప్రయోగాత్మక పరీక్షల్లో ఇవి సాధారణ స్థాయి కన్నా 15–28 శాతం అధిక దిగుబడులు అందించాయి. ఇలాంటి టెక్నాలజీల ఊతంతో వ్యవసాయ రంగంలో గత అర్ధశతాబ్దం పైగా కాలంలో వచ్చిన అభివృద్ధిని .. రాబోయే 25 ఏళ్లలోనే సాధించే అవకాశాలు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ) డైరెక్టర్ జనరల్ రామ్ కౌండిన్య తెలిపారు. సాంకేతికత అనేది రైతుల జీవితాలను సులభతరంగాను, సాగును లాభదాయకంగాను మార్చగలదని, ఆహార ఉత్పత్తిని పెంచగలదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, జన్యు మార్పిడి (జీఎం) పంటలతో వంట నూనెల దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉందని సౌత్ ఏషియా బయోటెక్నాలజీ సెంటర్ వర్గాలు తెలిపాయి. భారత్‌లో ఏటా 2.2–2.3 కోట్ల టన్నుల వంట నూనెల వినియోగం ఉంటోందని, ఇందులో 1.5 కోట్ల టన్నులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నాయి. అదే బయోటెక్నాలజీ తోడ్పాటుతో దేశీయంగా సోయాబీన్, పొద్దుతిరుగుడు పువ్వు, ఆవ గింజల దిగుబడులను పెంచుకోగలిగితే దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గుతుందని వివరించాయి. దిగుమతయ్యే నూనెల్లో సింహభాగం జీఎం పంటల ద్వారా ఉత్పత్తి చేసినవే ఉంటున్నాయని, అయితే దేశీయంగా మాత్రం ఇలాంటి పంటలకు అంతగా ప్రోత్సాహం ఉండటం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెక్నాలజీ వినియోగంపై వ్యవసాయ రంగ నిపుణులు ఆశావహంగా ఉన్నప్పటికీ .. విధానపరమైన, నియంత్రణపరమైన అంశాలతో అవాంతరాలు ఎదురుకావచ్చని, వీటిని అధిగమిస్తే సాగు మరింత లాభసాటిగా మారగలదని అభిప్రాయపడ్డారు. -
సేద్యం బరువై...!
పరిగి: కూలీల ఖర్చులకు కూడా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అల్లాడిపోతున్న తరుణంలో వ్యయాన్ని తగ్గించుకునేందుకు పరిగి మండలంలోని ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. మండలంలోని కొడిగెనహళ్లికి చెందిన కె.ఆదెప్ప అనే రైతు తన పొలంలో కలుపు తీసేందుకు సైకిల్ చక్రానికి చిప్ప గుంటకను తయారు చేసుకొని చేనులో దున్నుతున్నాడు. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నందునే అవి భరించే శక్తి తనకు లేకపోవడంతో ఈ ఆలోచన వచ్చిందని రైతు తెలిపాడు. మొక్కజొన్న వేసిన తన పొలంలో కలుపు తీసేందుకు ఓ సైకిల్ చక్రానికి గుంటకను చేయించి కేవలం రూ.1500 ఖర్చుతో ఈ యంత్రాన్ని తయారు చేయించానన్నాడు. తనకున్న ఎకరా పొలంలో కుమార్తె అరుణ, అల్లుడు చౌడప్ప సహాయంతో ఇలా కలుపును తొలగిస్తున్నానని తెలిపాడు. వినూత్న ఆలోచనతో కలుపు తీస్తున్న ఆదెప్పను పలువురు రైతులు అభినందిస్తున్నారు.