మెరిసిన నితిన్, అశ్వద్‌ | Cooch Behar Trophy: Nitin bowls Hyderabad to victory over Sikkim | Sakshi
Sakshi News home page

మెరిసిన నితిన్, అశ్వద్‌

Published Mon, Nov 7 2022 4:25 AM | Last Updated on Mon, Nov 7 2022 4:25 AM

Cooch Behar Trophy: Nitin bowls Hyderabad to victory over Sikkim  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కూచ్‌ బెహర్‌ ట్రోఫీ అండర్‌–19 క్రికెట్‌ టోర్నీలో భాగంగా సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 355 పరుగుల భారీ ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఆల్‌రౌండర్‌ నితిన్‌ సాయి యాదవ్‌ (34 పరుగులు; 11 వికెట్లు) హైదరాబాద్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఓవర్‌నైట్‌ స్కోరు 462/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ 106 ఓవర్లలో 9 వికెట్లకు 541 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సిక్కిం 72 పరుగులకే ఆలౌటైంది. నితిన్‌ సాయి యాదవ్‌ (3/23), అశ్వద్‌ రాజీవ్‌ (4/15) సిక్కిం జట్టును దెబ్బ తీశారు. ఫాలోఆన్‌ ఆడిన సిక్కిం   రెండో ఇన్నింగ్స్‌లో నితిన్‌ సాయి యాదవ్‌ (8/34) స్పిన్‌ మ్యాజిక్‌కు 114 పరుగులకే ఆలౌటైంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement