Cooch Behar Trophy
-
తృటిలో ట్రిపుల్ సెంచరీ చేజార్చుకున్న సెహ్వాగ్ తనయుడు
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తృటిలో ట్రిపుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. బీసీసీఐ ఆథ్వర్యంలో నడిచే కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్ 309 బంతుల్లో 51 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 297 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్యవీర్ మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ స్కోర్ చేశాడు. ఆర్యవీర్ ఔట్ కాగానే ఢిల్లీ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ (623/5) చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 98 పరుగుల వద్ద ఉండిన ధన్య నక్రా ఈ రోజు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నక్రా 122 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 130 పరుగులు చేసి ఔటయ్యాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అర్నవ్ బుగ్రా (114) కూడా సెంచరీతో చెలరేగాడు. మూడో రోజు లంచ్ సమయానికి మేఘాలయ రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి సెకెండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. మంధన్ (32), నర్లెంగ్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు మేఘాలయ ఇంకా 293 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకే ఆలౌటైంది.తండ్రి బాటలోనే తనయుడుఆర్యవీర్ సెహ్వాగ్ బాటలోనే నడుస్తున్నాడు. ఆర్యవీర్ సైతం తండ్రిలాగే వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఎదురుచూడలేదు. ఏ స్కోర్ వద్ద ఉన్న దూకుడే మంత్రంగా ఆడాడు. అందుకే ఈ మ్యాచ్‌లో ఆర్యవీర్ ట్రిపుల్ సెంచరీని లెక్క చేయలేదు. వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్లో చాలా సందర్భాల్లో సెంచరీలు, డబుల్, ట్రిపుల్ సెంచరీలు మిస్ అయ్యాడు. 2009లో సెహ్వాగ్ ఓ టెస్ట్ మ్యాచ్‌లో 293 స్కోర్ వద్ద ఔటయ్యాడు. సెహ్వాగ్ కెరీర్లో అప్పటికే రెండు ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి. ఆర్యవీర్ ఇప్పుడిప్పుడే క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడు. అతని నుంచి కూడా తండ్రి లాంటి ఇన్నింగ్స్‌లే ఆశించవచ్చు. ఆర్యవీర్ ఈ ఏడాది అక్టోబర్‌లో వినూ మన్కడ్ ట్రోఫీతో ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే ఆర్యవీర్ 49 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
మెరిసిన నితిన్, అశ్వద్
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నీలో భాగంగా సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 355 పరుగుల భారీ ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఆల్‌రౌండర్ నితిన్ సాయి యాదవ్ (34 పరుగులు; 11 వికెట్లు) హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవర్‌నైట్ స్కోరు 462/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 106 ఓవర్లలో 9 వికెట్లకు 541 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సిక్కిం 72 పరుగులకే ఆలౌటైంది. నితిన్ సాయి యాదవ్ (3/23), అశ్వద్ రాజీవ్ (4/15) సిక్కిం జట్టును దెబ్బ తీశారు. ఫాలోఆన్ ఆడిన సిక్కిం రెండో ఇన్నింగ్స్‌లో నితిన్ సాయి యాదవ్ (8/34) స్పిన్ మ్యాజిక్కు 114 పరుగులకే ఆలౌటైంది. -
శతక్కొట్టిన బ్యాటర్లు.. భారీ స్కోర్ దిశగా హైదరాబాద్
Under 19 Cooch Behar Trophy 2022-23: కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నీలో భాగంగా సిక్కిం జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు అదరగొట్టారు. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 90 ఓవర్లలో 6 వికెట్లకు 462 పరుగులు సాధించింది. ఓపెనర్ అమన్ రావు (113; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు), రితీశ్ రెడ్డి (110; 8 ఫోర్లు) సెంచరీలతో ఆకట్టుకున్నారు. అరవెల్లి అవినాశ్ (92; 8 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ కోల్పోగా... ధీరజ్ గౌడ్ (68; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), విఘ్నేశ్ రెడ్డి (39; 4 ఫోర్లు) కూడా రాణించారు. అమన్, అవినాశ్ తొలి వికెట్‌కు 206 పరుగులు జోడించడం విశేషం. -
Ben Vs Hyd: 5 వికెట్లతో చెలరేగిన పృథ్వీ రెడ్డి..
Cooch Behar Trophy: బెంగాల్‌తో జరుగుతున్న కూచ్‌బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్ ఎలైట్ గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో హైదరాబాద్ పేస్ బౌలర్ పృథ్వీ రెడ్డి 5 వికెట్లతో చెలరేగాడు. పృథ్వీ (5/54) ధాటికి మ్యాచ్ తొలి రోజు సోమవారం బెంగాల్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ అభిషేక్ పొరేల్ (145 బంతుల్లో 104; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా... మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. బెంగాల్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ తౌఫీకుద్దీన్, అభిషేక్ పొరేల్, ఇర్ఫాన్ ఆఫ్తాబ్, సిద్ధార్థ్ సింగ్, శశాంక్ సింగ్‌లను పృథ్వీ రెడ్డి అవుట్ చేశాడు. ఓవరాల్‌గా పృథ్వీ రెడ్డి 14 ఓవర్లు వేయగా అందులో మూడు మెయిడెన్లు ఉన్నాయి. ఇతర హైదరాబాద్ బౌలర్లలో శశాంక్, అభిషేక్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. చదవండి: Ashes: 77 బంతుల్లో 12 ... 207 బంతుల్లో 26 పరుగులు.. స్టోక్స్, బట్లర్ పాపం.. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! -
వరుణ్ గౌడ్ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ బ్యాట్స్‌మన్ వరుణ్ గౌడ్ (263 బంతుల్లో 238; 38 ఫోర్లు) డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. వరుణ్‌తో పాటు బౌలింగ్‌లో అజయ్ దేవ్ గౌడ్ (5/26), సంకేత్ (5/59) చెలరేగడంతో హైదరాబాద్ గెలుపు ముంగిట నిలిచింది. ఉప్పల్ మైదానంలో ఏ అండ్ ఏ జట్టుతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు ఒకేరోజు 14 వికెట్లు నేలకూల్చడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 311/5తో రెండోరోజు సోమవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 129 ఓవర్లలో 7 వికెట్లకు 527 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 114 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట ప్రారంభించిన వరుణ్ 245 బంతుల్లో ద్విశతకాన్ని సాధించాడు. అలంకృత్ (111 బంతుల్లో 51; 6 ఫోర్లు), టి. సంతోష్ గౌడ్ (59 బంతుల్లో 65; 4 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధసెంచరీలతో రాణించారు. అలంకృత్తో కలిసి ఆరో వికెట్‌కు 157 పరుగుల్ని జోడించిన వరుణ్, సంతోష్ గౌడ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రత్యర్థి బౌలర్లలో అల్ఫ్రెడ్ 2 వికెట్లు పడగొట్టగా, సాబీర్ ఖాన్, అభిషేక్ ఆనంద్, తహ్మీద్ తలా వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఏ అండ్ ఏ జట్టు 33.3 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో హైదరాబాద్‌కు 497 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అభిషేక్ ఆనంద్ (54; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సోను కుమార్ గుప్తా (30; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. తర్వాత ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఏ అండ్ ఏ జట్టు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 4 వికెట్లకు 22 పరుగులతో నిలిచింది. హైదరాబాద్ బౌలర్ అజయ్ దేవ్ గౌడ్ (4/10) ధాటికి నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్గానే పెవిలియన్ చేరారు. -
‘ప్లేట్’ నాకౌట్‌కు హైదరాబాద్
జింఖానా, న్యూస్‌లైన్: కూచ్ బెహర్ ట్రోఫీలో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 11 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. ఈ గెలుపుతో హైద రాబాద్ ప్లేట్ నాకౌట్ దశకు అర్హత దక్కించుకుంది. అగర్తలాలో మూడు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 108 ఓవర్లలో 366 పరుగులు చేసి ఆలౌటైంది. తన్మయ్ అగర్వాల్ (178 బంతుల్లో 103; 15 ఫోర్లు), రాహుల్ సింగ్ (169 బంతుల్లో 100;17 ఫోర్లు) సెంచరీలతో విజృంభించగా... అనిరుధ్ (141 బంతుల్లో 78; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. త్రిపుర బౌలర్లు మురాసింగ్, సర్కార్ చెరో 3, దేయ్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన త్రిపుర 48.1 ఓర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. ఘోష్ (39) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. చైతన్య రెడ్డి 3, జయసూర్య, రోషన్ రఘురామ్, శ్రవణ్ కుమార్ తలా రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. ఫాలోఆన్ ఆడిన త్రిపుర తన రెండో ఇన్నింగ్స్‌లో 73.5 ఓవర్లలో 215 పరుగులు చే సి ఆలౌటైంది. దీంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 11 పరుగుల ఆధిక్యంతో హైదరాబాద్ గెలుపు దక్కించుకుంది. దేయ్ (53) అర్ధ సెంచరీతో చెలరేగగా... ఘోష్ (41), సూత్రధార్ (43) మెరుగ్గా ఆడారు. హైదరాబాద్ బౌలర్లు జయసూర్య 2, రోషన్ రఘురామ్, తన్మయ్ అగర్వాల్ చెరో 3 వికె ట్లు తీసుకున్నారు. -
రాణించిన తన్మయ్, అనిరుధ్
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ టోర్నమెంట్లో రెండో రోజు ఆటలో హైదరాబాద్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించి జమ్మూ కాశ్మీర్‌పై పట్టుబిగిస్తున్నారు. మొదట బౌలింగ్‌లో చైతన్యరెడ్డి (3/39), సి.వి.మిలింద్ (3/94) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. తర్వాత బ్యాట్స్‌మెన్ తన్మయ్ అగర్వాల్ (191 బంతుల్లో 87 బ్యాటింగ్, 15 ఫోర్లు), అనిరుధ్ (135 బంతుల్లో 80 బ్యాటింగ్, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీలతో కదం తొక్కారు. హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 58 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 180 పరుగులు చేసింది. జింఖానా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సోమవారం 269/4 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన జమ్మూ కాశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 119.4 ఓవర్లలో 322 పరుగులు చేసి ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్ల ధాటికి ఓవర్‌నైట్ స్కోరుకు మరో 53 పరుగులే జోడించి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. సెంచరీ హీరో పారస్ శర్మ (131) క్రితం రోజు స్కోరు వద్దే నిష్ర్కమించాడు. దీంతో జమ్మూ కాశ్మీర్ పతనం ప్రారంభమైంది. మిలింద్, చైతన్య రెడ్డిలిద్దరూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు అవకాశమివ్వకుండా బౌలింగ్ చేశారు. ప్రణీత్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ ఓపెనర్లలో శశిధర్ రెడ్డి (2) విఫలమయ్యాడు. ఈ దశలో తన్మయ్... వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ అనిరుధ్‌తో కలిసి భారీ భాగస్వామ్యానికి బాటలు వేశాడు. ఇద్దరూ అజేయమైన రెండో వికెట్‌కు 157 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సెంచరీలకు చేరువయ్యారు.