జింఖానా, న్యూస్‌లైన్: కూచ్ బెహర్ ట్రోఫీలో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 11 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. ఈ గెలుపుతో హైద రాబాద్ ప్లేట్ నాకౌట్ దశకు అర్హత దక్కించుకుంది.
అగర్తలాలో మూడు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 108 ఓవర్లలో 366 పరుగులు చేసి ఆలౌటైంది. తన్మయ్ అగర్వాల్ (178 బంతుల్లో 103; 15 ఫోర్లు), రాహుల్ సింగ్ (169 బంతుల్లో 100;17 ఫోర్లు) సెంచరీలతో విజృంభించగా... అనిరుధ్ (141 బంతుల్లో 78; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. త్రిపుర బౌలర్లు మురాసింగ్, సర్కార్ చెరో 3, దేయ్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన త్రిపుర 48.1 ఓర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. ఘోష్ (39) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు.
చైతన్య రెడ్డి 3, జయసూర్య, రోషన్ రఘురామ్, శ్రవణ్ కుమార్ తలా రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. ఫాలోఆన్ ఆడిన త్రిపుర తన రెండో ఇన్నింగ్స్‌లో 73.5 ఓవర్లలో 215 పరుగులు చే సి ఆలౌటైంది. దీంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 11 పరుగుల ఆధిక్యంతో హైదరాబాద్ గెలుపు దక్కించుకుంది. దేయ్ (53) అర్ధ సెంచరీతో చెలరేగగా... ఘోష్ (41), సూత్రధార్ (43) మెరుగ్గా ఆడారు. హైదరాబాద్ బౌలర్లు జయసూర్య 2, రోషన్ రఘురామ్, తన్మయ్ అగర్వాల్ చెరో 3 వికె ట్లు తీసుకున్నారు.
‘ప్లేట్’ నాకౌట్‌కు హైదరాబాద్
Published Wed, Jan 1 2014 11:59 PM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM
Advertisement