సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ టోర్నమెంట్‌లో రెండో రోజు ఆటలో హైదరాబాద్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించి జమ్మూ కాశ్మీర్‌పై పట్టుబిగిస్తున్నారు. మొదట బౌలింగ్‌లో చైతన్యరెడ్డి (3/39), సి.వి.మిలింద్ (3/94) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించారు. తర్వాత బ్యాట్స్‌మెన్ తన్మయ్ అగర్వాల్ (191 బంతుల్లో 87 బ్యాటింగ్, 15 ఫోర్లు), అనిరుధ్ (135 బంతుల్లో 80 బ్యాటింగ్, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీలతో కదం తొక్కారు. హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి 58 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 180 పరుగులు చేసింది.
జింఖానా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సోమవారం 269/4 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన జమ్మూ కాశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 119.4 ఓవర్లలో 322 పరుగులు చేసి ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్ల ధాటికి ఓవర్‌నైట్ స్కోరుకు మరో 53 పరుగులే జోడించి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. సెంచరీ హీరో పారస్ శర్మ (131) క్రితం రోజు స్కోరు వద్దే నిష్ర్కమించాడు. దీంతో జమ్మూ కాశ్మీర్ పతనం ప్రారంభమైంది. మిలింద్, చైతన్య రెడ్డిలిద్దరూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు అవకాశమివ్వకుండా బౌలింగ్ చేశారు. ప్రణీత్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్ ఓపెనర్లలో శశిధర్ రెడ్డి (2) విఫలమయ్యాడు. ఈ దశలో తన్మయ్... వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ అనిరుధ్‌తో కలిసి భారీ భాగస్వామ్యానికి బాటలు వేశాడు. ఇద్దరూ అజేయమైన రెండో వికెట్‌కు 157 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సెంచరీలకు చేరువయ్యారు.
రాణించిన తన్మయ్, అనిరుధ్
Published Tue, Dec 10 2013 2:14 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement