Cooch Behar Trophy under-19
-
హైదరాబాద్ ఆటగాడి విధ్వంసం.. 33 ఫోర్లతో డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: గోవా జట్టుతో జరుగుతున్న కూచ్ బెహార్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పరుగుల వరద పారించింది. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 136 ఓవర్లలో 9 వికెట్లకు 604 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓపెనర్ ఆరన్ జార్జి (258 బంతుల్లో 219; 33 ఫోర్లు) డబుల్ సెంచరీతో మెరిశాడు.వన్‌డౌన్ బ్యాటర్ చెప్యాలా సిద్ధార్థ్ రావు (195 బంతుల్లో 101; 15 ఫోర్లు), ఎనిమిదో నంబర్ బ్యాటర్ యశ్వీర్ (113 బంతుల్లో 111 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. సీహెచ్ నిశాంత్ రెడ్డి (66; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గోవా జట్టు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 139 పరుగులు సాధించింది. -
దుమ్ము రేపిన రాహుల్ ద్రవిడ్ కొడుకు.. వీడియో వైరల్
కూచ్ బెహార్ అండర్-19 ట్రోఫీలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయడు సమిత్ ద్రవిడ్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో సమిత్ కర్ణాటక తరపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో సమిత్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 159 బంతులు ఎదుర్కొన్న జూనియర్ ద్రవిడ్.. 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 98 పరుగులు చేశాడు. సమిత్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన కవర్ డ్రైవ్‌లు ఉన్నాయి. కొన్ని కవర్ డ్రైవ్ షాట్లు అతడి తండ్రిని తలపించాయి. సమిత్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడుతున్నారు. కాగా ఇదే మ్యాచ్‌లో సమిత్ ద్రవిడ్ బౌలింగ్‌లో కూడా రాణించాడు. మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన సమిత్..280 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జమ్మూపై ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో కర్ణాటక విజయం సాధించింది. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో వన్డే.. తిలక్‌పై వేటు! ఆర్సీబీ ప్లేయర్ అరంగేట్రం Samit Dravid, Rahul Dravid’s son, at Jammu while playing for Karnataka in Cooch Behar Trophy (U19) against J&K. He made 98 runs in Karnataka’s easy win. 📹: MCC Sports pic.twitter.com/t7EQSro023 — Mohsin Kamal (@64MohsinKamal) December 20, 2023 -
అమన్ రావు అజేయ శతకం.. డ్రాతో గట్టెక్కిన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అండర్–19 టోర్నీ (కూచ్ బెహర్ ట్రోఫీ)లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, సౌరాష్ట్ర మధ్య జరిగిన నాలుగు రోజుల మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 422 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ చివరి రోజు ఆట ముగిసే సమయానికి 97 ఓవర్లలో 5 వికెట్లకు 290 పరుగులు చేసింది. అమన్ రావు (217 బంతుల్లో 156 నాటౌట్; 19 ఫోర్లు, 5 సిక్స్‌లు) కీలక సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 290, హైదరాబాద్ 226 పరుగులు చేయగా... సౌరాష్ట్ర తమ రెండో ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆరు జట్లున్న గ్రూప్ ‘బి’లో ఉన్న హైదరాబాద్ ఒక మ్యాచ్‌లో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
మెరిసిన నితిన్, అశ్వద్
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నీలో భాగంగా సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్నింగ్స్ 355 పరుగుల భారీ ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఆల్‌రౌండర్ నితిన్ సాయి యాదవ్ (34 పరుగులు; 11 వికెట్లు) హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓవర్‌నైట్ స్కోరు 462/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 106 ఓవర్లలో 9 వికెట్లకు 541 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సిక్కిం 72 పరుగులకే ఆలౌటైంది. నితిన్ సాయి యాదవ్ (3/23), అశ్వద్ రాజీవ్ (4/15) సిక్కిం జట్టును దెబ్బ తీశారు. ఫాలోఆన్ ఆడిన సిక్కిం రెండో ఇన్నింగ్స్‌లో నితిన్ సాయి యాదవ్ (8/34) స్పిన్ మ్యాజిక్కు 114 పరుగులకే ఆలౌటైంది. -
శతక్కొట్టిన బ్యాటర్లు.. భారీ స్కోర్ దిశగా హైదరాబాద్
Under 19 Cooch Behar Trophy 2022-23: కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నీలో భాగంగా సిక్కిం జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు అదరగొట్టారు. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 90 ఓవర్లలో 6 వికెట్లకు 462 పరుగులు సాధించింది. ఓపెనర్ అమన్ రావు (113; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు), రితీశ్ రెడ్డి (110; 8 ఫోర్లు) సెంచరీలతో ఆకట్టుకున్నారు. అరవెల్లి అవినాశ్ (92; 8 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ కోల్పోగా... ధీరజ్ గౌడ్ (68; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), విఘ్నేశ్ రెడ్డి (39; 4 ఫోర్లు) కూడా రాణించారు. అమన్, అవినాశ్ తొలి వికెట్‌కు 206 పరుగులు జోడించడం విశేషం. -
కరోనా ఖాతాలో మరో క్రికెట్ టోర్నీ.. బీసీసీఐ కీలక నిర్ణయం
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న వేళ మరో క్రికెట్ టోర్నీ వాయిదా పడింది. ఇప్పటికే రంజీ ట్రోఫీ, కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలు పోస్ట్‌పోన్ కాగా, తాజాగా అండర్-19 కూచ్ బెహర్ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. NEWS : Cooch Behar Trophy knockout matches postponed. The BCCI on Monday announced the postponement of the knockout stage matches of the Cooch Behar Trophy following some positive COVID-19 cases within the team environment. More details here - https://t.co/mP3TvYDKbr pic.twitter.com/8rManovoXE — BCCI (@BCCI) January 10, 2022 ప్రస్తుతం టోర్నీ జరుగుతున్న పుణేలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో పాటు కొందరు ఆటగాళ్లు(ముంబై, సౌరాష్ట్ర) సైతం మహమ్మారి బారిన పడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టోర్నీని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కాగా, ఈ టోర్నీలో ముంబై, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, రాజస్థాన్, విదర్భ, బెంగాల్, హర్యానా , మహారాష్ట్ర జట్లు ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్కు చేరుకున్నాయి. చదవండి: ఏడో ర్యాంక్‌లో ఉన్న టీమిండియాను నంబర్ వన్‌గా నిలబెట్టాను.. విరాట్ కోహ్లి -
Ben Vs Hyd: 5 వికెట్లతో చెలరేగిన పృథ్వీ రెడ్డి..
Cooch Behar Trophy: బెంగాల్‌తో జరుగుతున్న కూచ్‌బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్ ఎలైట్ గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో హైదరాబాద్ పేస్ బౌలర్ పృథ్వీ రెడ్డి 5 వికెట్లతో చెలరేగాడు. పృథ్వీ (5/54) ధాటికి మ్యాచ్ తొలి రోజు సోమవారం బెంగాల్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ అభిషేక్ పొరేల్ (145 బంతుల్లో 104; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా... మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. బెంగాల్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ తౌఫీకుద్దీన్, అభిషేక్ పొరేల్, ఇర్ఫాన్ ఆఫ్తాబ్, సిద్ధార్థ్ సింగ్, శశాంక్ సింగ్‌లను పృథ్వీ రెడ్డి అవుట్ చేశాడు. ఓవరాల్‌గా పృథ్వీ రెడ్డి 14 ఓవర్లు వేయగా అందులో మూడు మెయిడెన్లు ఉన్నాయి. ఇతర హైదరాబాద్ బౌలర్లలో శశాంక్, అభిషేక్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. చదవండి: Ashes: 77 బంతుల్లో 12 ... 207 బంతుల్లో 26 పరుగులు.. స్టోక్స్, బట్లర్ పాపం.. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఖరారు..! -
బ్యాట్స్‌మెన్ విఫలం.. హైదరాబాద్ 135 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో ఓవర్‌నైట్ స్కోరు 40/4తో మ్యాచ్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 52.2 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. ఎ. వరుణ్ గౌడ్ (34; 4 ఫోర్లు) మినహా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. ప్రత్యర్థి బౌలర్లలో ఏఎస్ జంవాల్ 6 వికెట్లతో హైదరాబాద్‌ను దెబ్బతీశాడు. ఏఏ వాలియా 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హిమాచల్ ప్రదేశ్ శనివారం ఆట ముగిసే సమయానికి 57 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులతో నిలిచింది. హైదరాబాద్ బౌలర్లలో రతన్ తేజ, జి. అనికేత్ రెడ్డి చెరో 3 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం 293 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
హైదరాబాద్ 415
జింఖానా, న్యూస్‌లైన్: కూచ్ బెహర్ అండర్-19 నాకౌట్ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢి ల్లీ జట్టు బౌలర్ రావత్ (6/118) చక్కటి బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. ఢిల్లీలో బుధవారం రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 306/4తో బరిలోకి దిగిన హైదరాబాద్ 124.4 ఓవర్లలో 415 పరుగులు చేసి ఆలౌటైంది. తనయ్ త్యాగరాజన్ (76) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఢిల్లీ ఆట ముగిసే సమయానికి 60 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అరోర (56) అర్ధ సెంచరీతో అజేయంగా నిలవగా... రంజన్ (40), శర్మ (24 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.